పద శారద-12

0
13

[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) వ్రాయడంలో ఏదయినా మిస్సయితే ఈ గుర్తు పెట్టి సరిచేస్తారు. ఆదిలోనే – – – – అని సామెత (4)
3) ఇతరులపై కడుపుమంట – కంటికి ఇంపులేకపోవడమా! (4)
5) శ్రేష్ఠమైన నితంబము గల్గిన స్త్రీ (4)
7) గొడవ – ఒక ఛందో విశేషం కూడా (3)
8) సంభావన లాంటిది (3)
9) సదా (4)
11) శ్రీకృష్ణుడు (4)
13) గజనిమ్మపండు, బత్తాయి (4)
15) సూర్య నారాయణుడు. అన్నీ గమనిస్తునే ఉంటాడు గదా (4)
17) కాళేశ్వర క్షేత్రం వద్ద గోదావరిలో సంగమించే ఉపనది (4)
19) కల్మషము, మురికి (4)
21) కుమార గురురెడ్డి ప్రేయసి, నర్తకి (3)
22) ఈ హిందీ ఆస్ట్రేలియన్ తార ‘ఫియర్ లెస్’ (3)
23) వినరో భాగ్యము – – – – అన్నమయ్య (4)
25) కాన్పులు జరిపే కాంత (4)
27) ఆనందింప జేయు ఇంగిలీకము (4)
29) శంకరుడు (4)
31) నెత్తురు పీల్చే నీటి కీటకము (4)
33) – – – – నుదుటి చెమట మిథ్యంటావా! అని అని శ్రీశ్రీ అడిగాడు మిథ్యావాదిని (4)
35) ఆడ లకుముకి పిట్ట (3)
36) సింహము కోపముతో వేయు రంకె (3)
37) నాట్య వేదిక (4)
38) మంచు (4)
39) సరస్వతీ మహల్ గ్రంథాలయం ఈ వూరిలోనే (4)

నిలువు:

1) వాతాపి గణపతిం భజే కీర్తన ఈ రాగంలోనే (4)
2) జూదము (4)
3) కడియము; నీటి బొట్టు కూడా (4)
4) 29 అడ్డంలో ఆయనే (4)
5) వేడిగాడుపు. కొండలే రగిలేది అన్నారు సముద్రాల వారు (4)
6) విష్ణువుతో మొదలయ్యే పసుపు (4)
10) వాల్మీకి ఋషి ఈ నదికి స్నానానికి వెళ్ళినపుడే కిరాతుడు క్రౌంచవధ చేశాడు (3)
12) సీతమ్మ తల్లి (3)
14) – – – మ్మ చిక్కినా అందమే అని సామెత (3)
15) మధురమైన పరిమళం (4)
16) భూపతి (4)
17) ఊపిరిని మంత్ర పూర్వకముగా నియత్రించు యోగాంగము (4)
18) ఈ శ్రీనివాసయాదవ్ గారు మాజీ మంత్రి (4)
19) నాది అనే ఆపేక్ష, మమత (4)
20) మల్లెలతో అంతమయ్యే ఒక నిధి, కుబేరుని నిధులలో ఒకటి (4)
24) ఫలకం తిరగబడి కొయ్య సామానయింది (3)
26) శ్రుతిహాసన్ తల్లి (3)
28) విశ్వాసమా (3)
29) ఒకరి కొకరు (4)
30) పాత కాలపు రాతి గ్రైండరు (4)
31) డిపాజిట్టు – అన్యదేశ్యం (4)
32) అద్దము (4)
33) నంది తిమ్మన కావ్యం ఈ పూవు గురించే (4)
34) వ్యాఘ్ర నఖం (4)

ఈ ప్రహేళికని పూరించి 2024 సెప్టెంబర్ 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 29 సెప్టెంబర్ 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-11 జవాబులు

అడ్డం:

1) శ్రీరంగము 3) పలుకాకి 5) అర్ణోరాశి 7) రాజీవం 8) పెరిమ 9) ముత్తియము 11) రథికుడు 13) కచ్ఛపము 15) పీడకల 17) అపరంజి 19) అలరులు 21) జ్ఞాపకం 22) త్రపుస 23) రంజకము 25) రంతిదేవు 27) కంచుకము 29) మధుకరం 31)హేవిళంబి 33) గాడుపులు 35) రివాజు 36) వరాల 37) కల్పవల్లి 38) తమస్విని 39) కద్వదుడు

నిలువు:

1) శ్రీశైలము 2) మురిపెము 3) పడమర 4) కిరాతుడు 5) అవంతిక 6) శిఖరము 10) యష్టిక 12) కుటీరం 14) పసరు 15) పీతాంబరం 16) లవిత్రము 17) అవసరం 18) జిజ్ఞాసువు 19) అకంటకం 20) లులాయము 24) కచ్చిక 26) దేవళం 28) కడుపు 29) మరీచిక 30) రంగవల్లి 31) హేమలత 32) బిరియాని 33) గాజువాక 34) లుబ్ధకుడు

పద శారద-11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి. వి. రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here