పద శారద-13

0
11

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఏదైనా సాధించినందుకు మెచ్చుకోలుగా చెప్పు పొగడ్త (5)
4) కృషి, సేద్యము (5)
8) దాహం (2)
9) గుహ (2)
11) బంగారము (4)
13) క్రూరత్వము (4)
15) కుషీగా, ఆలాజాలంగా ఉండటం (3)
17) మంచాలకు అల్లే సన్నని నార త్రాడు (3)
19) గలభా (3)
21) చివర తేలిపోయిన మిడుత (3)
22) అర్ధ మాసం (3)
23) తాఖీదు – పరభాష లోనే (3)
24) వంద మిలియనులు (4)
27) కాలుని వాహనం (4)
30) మొఱ (2)
31) రాముని రెండో కొడుకు (2)
33) సామెతలో మంగలి పిల్లి తల ఎందుకు గొరిగాడు (4)
35) కోపముతో రగులుట (4)
38) మధ్యలో వత్తు కోల్పోయిన ఉపద్రవం (3)
40) మరీ అంత తెలుపు కాదు – మరీ అంత నలుపూ గాని చాయ (3)
42) గోముగా చేయు అల్లరి: మర్మము (3)
44) టి.టి.డి (3)
45) ఒక అంటువ్యాధి (3)
46) సూర్యునితో ప్రారంభమయ్యే కంచుకము (3)
47) చంద్రుడు (4)
50) వరి పైరు (4)
53) గుడి పోయిన కంకి (2)
54) సహనం, భూమి (2)
55) కులాంగన (5)
56) రక్తప్రవాహం (5)

నిలువు:

2) కూతురు (3)
3) 8 అడ్డమే. పొడిగింపు (3)
5) ఇదొక రుచి (3)
6) మంత్రసాని (3)
7) జారత్వం దాచుకున్న నియంతృత్వం (5)
10) బాలకృష్ణుని చంప వచ్చిన బండి రక్కసుడు (5)
11) ఒక ఔషధపు మొక్క, అలివెరా (4)
12) ఇప్పటిది కాదు. ఎప్పటిదో (4)
13) కూరలు (4)
14) మౌనవ్రతం. తొలుత కురచ (4)
16) ఇల్లు (2)
18) నూరు వేలు (2)
20) పోలీసు చేతిలోది (2)
25) ఇతడుంటే శని ఎందుకు అన్నాడు మాయాబజారు కృష్ణుడు (3)
26) పికమే (3)
28) బుజ్జగింపు (3)
29) వరి ధాన్యం (3)
32) అభివృద్ధి మార్గం (5)
33) 1953 నాటి అంజలి, నాగేశ్వరరావు సినిమా – చివర దీర్ఘంతో (4)
34) బాహాబాహి కాదు, జుట్టూ జుట్టూ పట్టుకొని (4)
35) కనిపించక – చివర పున్నమి (4)
36) టక్కు తో పాటు ఇదీని – మోసపు విద్య (4)
37) దానం చేసే వ్యక్తి చేతికి – – – – – అంటారు (5)
39) బృందము (2)
41) చిన్నకొండ (2)
43) అశ్వత్థ (2)
48) పాపం తడబడింది (3)
49) రోలుంటే చాలా, ఇదీ కావాలి గదా (3)
51) కృష్ణుని ఒక భార్యకు చివర గుడి (3)
52) బెంగాలీ దీదీ (3)

ఈ ప్రహేళికని పూరించి 2024 అక్టోబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 13 అక్టోబర్ 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-12 జవాబులు

అడ్డం:

1) హంసపాదు 3) కంటగింపు 5) వరారోహ 7) రగడ 8) దక్షిణ 9) నిరంతరం 11) మురవైరి 13) లికుచము 15) కర్మసాక్షి 17) ప్రాణహిత 19) మలినము 21) లకుమ 22) నాడియా 23) విష్ణుకథ 25) మంత్రసాని 27) రంజనము 29) పశుపతి 31) జలూకము 33) పాలికాపు 35) కురరి 36) గర్జన 37) రంగస్థలి 38) తుషారము 39) తంజావూరు

నిలువు:

1) హంసధ్వని 2) దురోదరం 3) కంకణము 4) పురవైరి 5) వడగాలి 6) హరిద్రము 10) తమసా 12) వైదేహి 14) చక్కన 15) కమ్మతావి 16) క్షితినాథ 17) ప్రాణాయామాం 18) తలసాని 19) మమకారం 20) ముకుందము 24) కలప 26) సారిక 28) నమ్మికా 29) పరస్పరం 30) తిరుగలి 31) జమానతు 32) ముకురము 33) పారిజాతం 34) పులిగోరు

పద శారద-12 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి. వి. రాజు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here