‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. చేతిలో రేఖలు చూసి భవిష్యత్తును చెప్పు శాస్త్రం. (6) | 
| 4. ______________ ఎదగమని మొక్క నీకు చెబుతుంది అంటాడు చంద్రబోస్. (4) | 
| 7. నెలవంకలో భిన్నములోని పై భాగం (2) | 
| 8. నంది తిమ్మనలో రాక్షసమాత (2) | 
| 9. ప్రవాసి పత్రికా సంపాదకుడు ఈ కాళిదాసు. (3,4) | 
| 11. కొల్లూరి సోమశంకర్ కథ తనవి కాని కన్నీళ్లులో నాయిక ఒక professional mourner. (3) | 
| 13. ఇది కలికాలమని అనుమానంగా అడుగుతున్నారా? (5) | 
| 14. తూర్పు దిశకు, దక్షిణ దిశకు మధ్య దిశ గజిబిజిగా మారింది. (5) | 
| 15. పాపం లాలు వెనక్కి చూస్తే దున్నపోతు కనిపిస్తుంది. (3) | 
| 18. వరి తన నడుమును… ఏమిటీ వాచాలత్వం? (7) | 
| 19. వెనుక నుండి దిగిన చురకత్తి (2) | 
| 21. ఆచూకీ తెలిపిన గురజాడ (2) | 
| 22. పుటుక్కు జరజర _________. దీనికి అర్థం తెలియాలంటే తెనాలి రామలింగడు దిగిరావాలి. (4) | 
| 23. తగర చెట్టు. (6) | 
| నిలువు | 
| 1.బలరాముడు లేక కర్షకుడు (4) | 
| 2.స్తోత్రం. (2) | 
| 3.ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన ఒకానొక తెలుగు సినిమా. (2,3) | 
| 5. ఉగాది చివర గోదాము (2) | 
| 6. పేరుకు మాత్రమే గొప్ప అసలు విషయం ఏమి లేదని అర్థంలో వాడే ఒక తెలుగు జాతీయము. (2,4) | 
| 9. తగిన వరుణ్ణి వెదకడానికి ఇలా ప్రకటన ఇస్తాము. (3,4) | 
| 10. బద్దెన కవి కృతి. (3,4) | 
| 11. కుమారులు కర్చీపును కలిగి ఉన్నారు. (3) | 
| 12. పందిరి రూపాంతరం చెంది శీర్షాసనం వేసింది. (3) | 
| 13. రెండు కథల పృచ్ఛకుడు. (6) | 
| 16. తలారి, వనం పదాల కలయికతో బలము. (5) | 
| 17. ముక్కలుగానిది, సంపూర్ణము. (4) | 
| 20. ఆం.ప్ర. తాజా మాజీ ముఖ్యమంత్రి ఇలా పిలువబడతాడు. (2) | 
| 21. గజాననుడిలో కొలత. (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా ఆగస్టు 4 తేదీన వెలువడతాయి.
పదసంచిక-9 జవాబులు:
అడ్డం:
1: జనగణమన 4: అసిధార 7: యతి 8: రాగి 9: సామలసదాశివ 11: కుజుడు 13:తల్లాపెళ్లామా 14: తలనీలాలు 15: రికాబు 18: వలక్షమయూఖుడు 19: వాని 21: వాచ 22: రుద్రభూమి 23: మట్టిలోమాణిక్యం.
నిలువు:
1: జయభేరి 2: నతి 3: నరసరాజు 5: ధారా 6: రగిలేగుండెలు 9: సాదనపెనకువ 10: వరూధినీధవుడు. 11: కుమారి 12: డుతబు 13: తప్పులెన్నువారు 16: కాలమహిమ 17: చాకచక్యం 20: నిద్ర 21: వాణి
పదసంచిక-9కి సరైన సమాధానాలు పంపిన వారు:
- తల్లాప్రగడమధుసూదనరావు
 - అభినేత్రి వంగల
 - అనురాధసాయి జొన్నలగడ్డ
 - భమిడిపాటి సూర్యలక్ష్మి
 - భాగవతుల కృష్ణారావు
 - ఈమని రమామణి
 - సుభద్ర వేదుల
 - శుభా వల్లభ
 - తాతిరాజు జగం
 
















