పదసంచిక-12

1
5

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మంద కృష్ణ తన జాతివారి కోసం నడిపిన ఉద్యమం. (3,3)
4. మెరిక లేని ఖండమా? (4)
7. జానపదుల వేట. (2)
8. వాచాలుడి మాటలో శూర్పము. (2)
9. జమున కృష్ణంరాజు నటించిన కె.బాపయ్య సినిమా. (2,4)
11. రసన, లలన, జిహ్వ. (3)
13. మురళీమోహన్ తెరకు పరిచయమైన సినిమా (5)
14. త్రివర్ణ పతాకం తెలుగులో (3,2)
15. కానవలసిన దానిలో స్త్రీ.  వచన కథా కావ్య ప్రక్రియగా కనిపిస్తున్నది. (3)
18. అన్‌లక్కీ ఫెలోస్ (7)
19. బాకారంలో ఈ వాద్యపరికరం లభ్యమౌతుంది. (2)
21. కడిమిచెట్టులో పుడిసిలి (2)
22. దబాయింపు (4)
23. “__________ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది. ఎంతో పుణ్యం దక్కేది.” అంటాడు మాధవపెద్ది కులగోత్రాలు చిత్రంలో. (3,3)

 

నిలువు

1. భారత దేశపు తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి. (4)
2. దిటవులో బలము. (2)
3. లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు వైష్ణవ మత సంస్కర్తలు. (5)
5. నువ్వే కావాలి చిత్రంలో నటించిన అమ్మాయి. (2)
6. కాటమరాయుణ్ణి పిలవండి. (6)
9. __________________ గూడంటే గూడూ కాదూ పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది పొదరిల్లు మాది. సుఖదుఃఖాలు సినిమా పాట. (3,2,2)
10. పైకి మంచిగా కనిపించే క్రూరులు (4,3)
11. నయనాలు తిప్పి చూడు. జనకుడు కనిపిస్తాడు. (3)
12. ఫిదా సినిమా దర్శకుడు శేఖర్ ఇంటి పేరు మధ్య కాస్త పలచనయ్యింది. (3)
13. ఓ బేబి సినిమాలో దేవుడి పాత్రను ధరించిన నటుడు. (6)
16. అరుంధతీధవుడు. శివము, నిష్టల అనాగ్రం.(5)
17. బెల్లము కలిపిన పిండి. (4)
20. కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామిని అభిమానులు ముద్దుగా ఇలా పిలిచేవారు. (2)
21. కకపికలో కోతి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 06వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా ఆగస్టు 11 తేదీన వెలువడతాయి.

పదసంచిక-10 జవాబులు:

అడ్డం:

1 బైబైపోలోనియా 4. ముళ్లకంచె/ముళ్ళకంచె/ముండ్లకంచె  7. డాలు  8. కిలి  9. అడుసుతొక్కనేల  11. ముదిత 13.కులదేవత 14. కముజుపిట్ట/కవుజుపిట్ట 15. కమరు 18. వడ్డించిన విస్తరి 19. మైకం 21. పార 22. తేటగీతి  23.ముచ్చర్ల అరుణ

 నిలువు:

1.బైడాలము 2. బైలు 3. యాభైతొమ్మిది 5. కంకి 6.చెలియలికట్ట 9. అతిథి దేవోభవ 10. లక్కరాజు సుందరి 11. ముతక 12. తకరు 13. కుడి ఎడమైతే  16.మహానసము 17. విచారణ 20. కంట 21. పారు

పదసంచిక-10కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఆర్కసోమయాజి ధూళిపాళ
  • బందా శైలజ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • ఈమని రమామణి
  • నాథ్ బద్రి
  • భాగవతుల కృష్ణారావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.ఝాన్సీరాణి
  • రామలక్ష్మి
  • రావులపర్తి రాజేశ్వరి
  • సుభద్ర వేదుల
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here