పదసంచిక-3

0
6

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1.భారతి పత్రికలోని ఒక శీర్షిక. తిరుపతి వెంకట కవుల ఒక పుస్తకం. వివిధ అంశాలు కలిసి ఉండటం (6)
4.నహుషుని భార్య. (4)
7.అభ్యుదయములో కనికరం (2)
8. మాండలికము లాంటి ఉక్తి విశేషము తెలుసుకోవడానికి అంతగా ఆయాస ప్రయాసలు పడాలా?(2)
9. వెయ్యి మంది పృచ్ఛకుల సమక్షంలో అవధాని నిర్వహించే  సాహిత్యక్రతువు. (7)
11. స్వాదుముకుళములు (taste buds) దూకమంటున్నాయా?(3)
13. తప్పటడుగు వేసిన తప్పటడుగు (5)
14. శ్రీ కృష్ణ కర్ణామృతం రచించిన కవి.(5)
15. నటి కావాలంటే పూర్వం మద్రాసులో “తిష్ట”వేయక తప్పేది కాదు. (3)
18. ఏడుకొండలవాని ఒకానొక ఆర్జితసేవ (2,2,3)
19. పారామిలిటరీ దళంలో ఈ పేరు గల స్త్రీని వెదకండి.(2)
21. కీలెరిగి ఇది పెట్టాలి (2)
22. వృషభములు మదపుటేనుగును దాచాయి. (4)
23. ఇంద్రుని ఉద్యానవనం(6)

 

నిలువు
1. అలుక దనములో సమరం.(4)
2. భద్రం కొడుకో చిత్రంతో తెరంగ్రేటం చేసిన నటి (2)
3. తమ వశము కానిది. మైమరుపు. (5)
5.  వయాగ్రాలో లాటిన్ ద్వారా(2)
6.    పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా అని వాణిశ్రీని ఆట పట్టిస్తున్నాడు నాగేశ్వర్రావు ఈ సినిమాలో.(3,3)
9.     కందుకూరి నడిపిన తొలి తెలుగు స్త్రీల పత్రిక.(7)
10.   భోజన ప్రియులు మెచ్చే నోము శీర్షాసనం వేసింది. (5,2)
11.   ఆకాశం = ఊరంతటికీ ఒకటే __________(3)
12.    మంచి కులమున పుట్టినది.(3)
13.     రాట, లుక్కు, మాటలతో మోసాలు.(6)
16.     హోళీ పండగ.(5)
17.    వ్యాసప్రోక్తమైన అయిదవ వేదము (4)
20.    షమితా శెట్టి మొదట్లోనే సాకులు వెదుకుతోంది. (2)
21.    దావానలంలో వర్షము. (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూన్ 4వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 9వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-1 జవాబులు:

అడ్డము
1.  అంతరిక్ష నౌక  4.  విశ్వవసు   7.  గవ్వ  8.  జమ  9.  అధర్వణవేదము  11. ఆసందు 13.  రాయబారము 14.  బాలరెంటాల 15.  దంచేయి 18.  జుట్టుపిట్టతాలుపు 19.  టపా 21.  పంట  22.  మునగాల  23.  నులకమంచము
నిలువు
1.   అంగరాజు   2.   తవ్వ  3.   కరుణరసము  5.   వజ  6.   సుమకనకాల 9.   అడవిబాపిరాజు 10.  ముప్పదిరెంటిగుంపు 11.  ఆముదం  12.  దుబాయి  13.  రాజమకుటము 16.  చేపట్టలేను 17.  కంకటము  20.  పాన   21.  పంచ

పదసంచిక-1కి సరైన సమాధానాలు పంపిన వారు:

భమిడిపాటి సూర్యలక్ష్మి
తల్లాప్రగడ మధుసూదనరావు
ఎ. ప్రతిభ
శుభా వల్లభ
వైదేహి అక్కపెద్ది
తాతిరాజు జగం
పొన్నాడ సరస్వతి
విద్య ప్రయాగ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here