‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. చెప్పనలవి కానిది, నిర్వచింప శక్యము కానిది (6) |
| 4. ప్రభవాది సంవత్సరములలో ఆరవది (4) |
| 7. గలాటా (2) |
| 8. స్వర్గము లేని నాసిరకము రక్తనాళము (2) |
| 9. వికృతమైన పెనునగవు (6) |
| 11. సమాజము, గుంపు (3) |
| 13. పాలపుంత (3,2) |
| 14. అడ్డము 9 వింటే గుండెల్లో ఇవి మొదలవుతాయి. (5) |
| 15. కొంగ చేయు వేదాధ్యయనము (3) |
| 18. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్(7) |
| 19. రుచి (2) |
| 21. అట్టు (2) |
| 22. మిట్టమధ్యాహ్నానానికి క్వైట్ ఆపోజిట్ (4) |
| 23. యా తాత కలము కిసలయమును చూపుతుంది. (6) |
నిలువు
| 1. దీనిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. (4) |
| 2. నిత్యము (2) |
| 3. తిరగలి దిమ్మలు రెండు ఉంటేనే కాని పని నెరవేరదనే సంస్కృత న్యాయము శీర్షాసనం వేసింది. (5) |
| 5. పుండు యొక్క చీము (2) |
| 6. స్ట్రెయిట్ లైన్స్ (6) |
| 9 గాధేయుడికి ఇష్టమైన టెంకాయ (7) |
| 10. అతి తొందర గానూ అనవసరంగానూ తెచ్చుకునే కోపము (4,3) |
| 11. జలసంధిలో మద్యము (3) |
| 12. ఎటుచూసినా సంతోషమే (3) |
| 13. తామరకంటి (6) |
| 16 పటిక గల నెరవేరని కోరిక (5) |
| 17. నిరుటికి నిరుడు (4) |
| 20. విడియములో ఎర్రనిది (2) |
| 21. ఢోకా (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 15 తేదీన వెలువడతాయి.
పదసంచిక-28 జవాబులు:
అడ్డం:
1.కలగూరగంప 4.అభిమాని 7.సుత 8.హత్య 9.గోలకొండపత్రిక 11.మాలవ్యా 13.ఉపరిలోకం 14.పారశీకము 15.దళారి 18.లుకలుకలుకలు 19.వీక్ష 21.భూష 22.ధిరశదా 23.మునిభేషజము
నిలువు:
1.కసుగాయ 2.లత 3.పగడసాల 5.మాహ 6.నిత్యప్రళయము 9.గోదావరికధలు 10.కలహశీలురాలు 11.మాకంద 12.వ్యాపారి 13.ఉడుగణవీధి 16.ళాఖంకడము(ళాడకఖంము) 17.ప్రత్యూషము 20.క్షర 21.భూజ.
పదసంచిక-28కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- బావాజి ఎర్రమిల్లి
- భాగవతుల కృష్ణారావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మావతి కస్తల
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- శుభా వల్లభ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.















