పదసంచిక-30

0
8

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. చెప్పనలవి కానిది, నిర్వచింప శక్యము కానిది (6)
4. ప్రభవాది సంవత్సరములలో ఆరవది (4)
7. గలాటా (2)
8. స్వర్గము లేని నాసిరకము రక్తనాళము (2)
9. వికృతమైన పెనునగవు (6)
11. సమాజము, గుంపు (3)
13. పాలపుంత (3,2)
14. అడ్డము 9 వింటే గుండెల్లో ఇవి మొదలవుతాయి. (5)
15. కొంగ చేయు వేదాధ్యయనము (3)
18. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్(7)
19. రుచి (2)
21. అట్టు (2)
22. మిట్టమధ్యాహ్నానానికి క్వైట్ ఆపోజిట్ (4)
23. యా తాత కలము కిసలయమును చూపుతుంది. (6)

 

నిలువు

1. దీనిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. (4)
2. నిత్యము (2)
3. తిరగలి దిమ్మలు రెండు ఉంటేనే కాని పని నెరవేరదనే సంస్కృత న్యాయము శీర్షాసనం వేసింది. (5)
5. పుండు యొక్క చీము (2)
6. స్ట్రెయిట్ లైన్స్ (6)
9  గాధేయుడికి ఇష్టమైన టెంకాయ (7)
10. అతి తొందర గానూ అనవసరంగానూ  తెచ్చుకునే కోపము (4,3)
11. జలసంధిలో మద్యము (3)
12. ఎటుచూసినా సంతోషమే (3)
13. తామరకంటి (6)
16  పటిక గల నెరవేరని కోరిక (5)
17. నిరుటికి నిరుడు (4)
20. విడియములో ఎర్రనిది (2)
21. ఢోకా (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 15 తేదీన వెలువడతాయి.

పదసంచిక-28 జవాబులు:

అడ్డం:

1.కలగూరగంప  4.అభిమాని  7.సుత  8.హత్య  9.గోలకొండపత్రిక 11.మాలవ్యా  13.ఉపరిలోకం 14.పారశీకము 15.దళారి  18.లుకలుకలుకలు  19.వీక్ష  21.భూష  22.ధిరశదా  23.మునిభేషజము

నిలువు:

1.కసుగాయ  2.లత 3.పగడసాల 5.మాహ  6.నిత్యప్రళయము 9.గోదావరికధలు  10.కలహశీలురాలు 11.మాకంద 12.వ్యాపారి  13.ఉడుగణవీధి  16.ళాఖంకడము(ళాడకఖంము)  17.ప్రత్యూషము  20.క్షర  21.భూజ.

పదసంచిక-28కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • బావాజి ఎర్రమిల్లి
  • భాగవతుల కృష్ణారావు
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మావతి కస్తల
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • శుభా వల్లభ
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here