[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సులభసాధ్యం అనే అర్ధంలో వాడుకలో ఉన్న జాతీయం. (6) |
4. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన తెలుగు నవల. (4) |
7. అడవిపిల్లి ఇచ్చే ముద్ద (2) |
8. అష్టాచెమ్మా సినిమా హీరోయిన్ కుడి నుండి ఎడమకు. (2) |
9. ఫైర్ ఫ్లై (4,3) |
11. వణుకుతో వున్నవాడు. (3) |
13. సీమ నటించిన ఒక తెలుగు సినిమా (3,2) |
14. తడబడిన అరవ దేశం (5) |
15. లోకతంత్రములో దాగున్న దుఃఖము, భయము. (3) |
18. ముద్రిక (7) |
19. నురుగు అపసవ్య దిశలో (2) |
21. అహో దాపురించిందా పెత్తనం? (2) |
22. బక్కపల్చటి వ్యక్తిని పోల్చడానికి పనికొచ్చే కూరగాయ (4) |
23. లంచగొండి లక్షణం (6) |
నిలువు
1. సరికొత్త తానా బహుమతి నవల (4) |
2. బల్లి గుడ్డులో చిన్నది (2) |
3. పాము కందురు అశ్లీలపు మాటలాడుతాయా? (5) |
5. భూపతి కలిగిన ఐశ్వర్యము (2) |
6. శీర్షాసనం వేసిన అడ్డం 4 రచయిత (4,2) |
9. హాఫ్ నాలెడ్జి (7) |
10. గుడుగు, గుండు కలిగిన ఒకానొక బాల్యక్రీడ (7) |
11. అంగీకారమైన మతం (3) |
12. పరిమళములోని రీతి (3) |
13. మనస్సు, బుద్ధి (6) |
16. అరటి పండు (3,2) |
17. బ్లడ్ డొనేషన్ (4) |
20. ఉచ్చిష్టము (2) |
21. ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు.(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 12 తేదీన వెలువడతాయి.
పదసంచిక-32 జవాబులు:
అడ్డం:
1.మొగిలిపనస 4.సంవేదన 7.గరి 8.క్షయ 9.మురళిఊదేపాప 11.మల్లిక 13.దేశభక్తుడు 14.రమావిభుడు 15.గుటక 18.శంకరనారాయణ 19.స్త్రాభ 21.కోక 22.లుగనశ 23.లకుముకిపిట్ట
నిలువు:
1.మొగమాటం 2.గిరి 3.సవెఊరల్లి/సరఊవెల్లి 5.దక్ష 6.నయవంచకుడు 9.ముణరభరాకశం 10.పదవీవిరమణ 11.మడుగు 12.కరక 13.దేవతావస్త్రాలు 16.టశానాకల/టకనాశాల 17.ఆనకట్ట 20.భగ 21.కోపి
పదసంచిక-32కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- తురిమెళ్ళ సుధామాధురి
- పడమట సుబ్బలక్ష్మి
- పి. ఝాన్సీరాణి
- సరస్వతి పొన్నాడ
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.