పదసంచిక-34

0
11

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సులభసాధ్యం అనే అర్ధంలో వాడుకలో ఉన్న జాతీయం. (6)
4. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన తెలుగు నవల. (4)
7. అడవిపిల్లి ఇచ్చే ముద్ద (2)
8. అష్టాచెమ్మా సినిమా హీరోయిన్ కుడి నుండి ఎడమకు. (2)
9. ఫైర్ ఫ్లై (4,3)
11. వణుకుతో వున్నవాడు. (3)
13. సీమ నటించిన ఒక తెలుగు సినిమా (3,2)
14. తడబడిన అరవ దేశం (5)
15. లోకతంత్రములో దాగున్న దుఃఖము, భయము. (3)
18. ముద్రిక (7)
19. నురుగు అపసవ్య దిశలో (2)
21. అహో దాపురించిందా పెత్తనం? (2)
22. బక్కపల్చటి వ్యక్తిని పోల్చడానికి పనికొచ్చే కూరగాయ (4)
23. లంచగొండి లక్షణం (6)

నిలువు

1. సరికొత్త తానా బహుమతి నవల (4)
2. బల్లి గుడ్డులో చిన్నది (2)
3. పాము కందురు అశ్లీలపు మాటలాడుతాయా? (5)
5. భూపతి కలిగిన ఐశ్వర్యము (2)
6. శీర్షాసనం వేసిన అడ్డం 4 రచయిత (4,2)
9. హాఫ్ నాలెడ్జి (7)
10. గుడుగు, గుండు కలిగిన ఒకానొక బాల్యక్రీడ (7)
11. అంగీకారమైన మతం (3)
12. పరిమళములోని రీతి (3)
13. మనస్సు, బుద్ధి (6)
16. అరటి పండు (3,2)
17. బ్లడ్ డొనేషన్ (4)
20. ఉచ్చిష్టము (2)
21.  ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు.(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 12 తేదీన వెలువడతాయి.

పదసంచిక-32 జవాబులు:

అడ్డం:                                 

1.మొగిలిపనస  4.సంవేదన 7.గరి 8.క్షయ 9.మురళిఊదేపాప  11.మల్లిక  13.దేశభక్తుడు 14.రమావిభుడు  15.గుటక 18.శంకరనారాయణ 19.స్త్రాభ  21.కోక 22.లుగనశ 23.లకుముకిపిట్ట

నిలువు:

1.మొగమాటం  2.గిరి  3.సవెఊరల్లి/సరఊవెల్లి  5.దక్ష  6.నయవంచకుడు  9.ముణరభరాకశం  10.పదవీవిరమణ 11.మడుగు  12.కరక 13.దేవతావస్త్రాలు 16.టశానాకల/టకనాశాల 17.ఆనకట్ట 20.భగ 21.కోపి

పదసంచిక-32కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • తురిమెళ్ళ సుధామాధురి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. ఝాన్సీరాణి
  • సరస్వతి పొన్నాడ
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here