పదసంచిక-37

0
7

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రులలో ప్రప్రథమ ____ __ గా పేరు పొందాడు(4,2)
4. నాయకుడు (4)
7. వాలిపొమ్మంటే 1982 నాటి కృష్ణంరాజు సినిమాను తలుచుకుంటావేం? (2)
8. కప్పురములో దాగిన ప్రమాదం. (2)
9. మ్యూజికల్ చైర్‌ను పోలిన బాలికల జానపద క్రీడా విశేషము. (3,4)
11. ఏ చెట్టూ లేని చోట ఈ చెట్టే మహావృక్షం (3)
13. సీత చేసింది. యండమూరి (దర్శకుడిగా) తీసింది.(5)
14. అలకాపూరు డిపోలోని స్త్రీ చెల్లాచెదిరింది. (5)
15. రామ్‌నాథ్‌ కోవింద్‌ భార్య పేరు (3)
18. జగము, దవనము, నఖములతో వినాయకుడు వెనుదిరిగాడు (7)
19. కావడిలో వేగము (2)
21. పాదపీటలోని బ్యారెల్ (2)
22. ఎముకలపోగులో చెక్కిలి (4)
23. రాముని పాలిటి సిరి ఈ పురపాలక సంఘం(6)

నిలువు

1. ప్రస్తుతం అమరావతిలో దీని గురించి రచ్చ జరుగుతోంది. (4)
2. కూజా (2)
3. దివ్వెగంటము (5)
5. చేటలో పేరును చెరుగు (2)
6. తమ తప్పులెరుగని వారు (6)
9.  డ్రామా షో (3,4)
10. దీపావళిని ఇలా కూడా పిలవవచ్చునటరా నీ పాసుగూల? (4,3)
11.  కోరిక (3)
12. దండింప బడినది/ వాడు (3)
13. కవకవమనే అసంబద్ధత (6)
16. విచ్చలవిడి (5)
17. పరిపూర్ణాంద, లగడపాటిల ఆద్యంతాలతో ఇది మామూలే. (4)
20. అడ్డం 14లో కొఠారు (2)
21. బుల్‌బుల్‌ పిట్ట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 2 తేదీన వెలువడతాయి.

పదసంచిక-35 జవాబులు:

అడ్డం:                                 

1.కలవరకంప 4.కైఫియతు 7.పోత  8.మీనా  9.తెరతీయగరాదా 11.పూదండ 13.స్వార్ధపరత  14.సుకర్మములు 15.మునిగి 18.విజ్ఞానసర్వస్వము 19.న్యాయం  21.కూళ  22.సంతతము 23.నందివర్ధనము

నిలువు:

1.కపోతము 2.లత  3.పర్యాయపదం  5.యమీ  6.తునాతునకలు 9.తెలకపల్లిరవి  10.దానధర్మఫలము 11.పూతము 12.డసుగి 13.స్వాగతోపన్యాసం  16.నివాసస్థానం  17.అంగుళము 20.యంత 21కూన

పదసంచిక-35కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • ఈమని రమామణి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.ఝాన్సీరాణి
  • సరస్వతి పొన్నాడ
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here