పదసంచిక-4

0
8

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1. రాముడికి ప్రియమైన భూర్జపత్రము (6)
4. ఈ కృష్ణమూర్తి ఇంటిపేరుతో ప్రసిద్ధుడు. పాతకాలం నాటి చలనచిత్రాలలో విలనూ, కేరక్టర్ నటుడు. (4)
7. జల్లికట్టు ఆద్యంతాలతో టీము. (2)
8. సోయగములో వున్న పుణ్యక్షేత్రం. (2)
9. ___ ___ __ రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం అని ఒక  సినిమా టైటిల్ సాంగ్.(2,3,2)
11. ఆతపత్రములో వేగిరపాటు (3)
13. కలగాపులగమైన Delay (5)
14. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపకుడు. సినీ నిర్మాత. (5)
15. చతుర్విధ రాగములలో నొకటి. Wanderer.(3)
18. ఒక తెలుగు దినపత్రిక. బతుకమ్మ పేరుతో ఆదివారం ప్రత్యేక సంచిక ప్రకటిస్తుంది.(3,4)
19. ఛాయ తిరగబడింది.(2)
21. విహగుడులో దాగియున్న బిలము. (2)
22. ములాయము, లాలు కలిసి దున్నపోతును దర్శింపజేస్తారు. (4)
23. ఆంధ్ర విశ్వవిద్యాలయం నెలకొని వున్న పట్టణం.(6)

 

నిలువు
1.   ఈ పాత తరం సినిమా ప్రతినాయకుడు కూడా ఇంటిపేరుతోనే ప్రసిద్ధుడు. (4)
2.   గుట్టు తోడిది. పరిమితి. (2)
3.   ఆ మధ్య విడుదలైన వై.ఎస్.రాజశేఖరరెడ్డి బయోపిక్. ముందు వై.ఎస్.పాత్రధారిని కూడా కలపండి. (3,2)
5.    సరిగమలలో పుంస్త్వము.(2)
6.    కాయల హారకుడులో శివుడున్నాడు. (6)
9.     దుష్యంతుడు ఏ పద్ధతిన శకుంతలను పెళ్ళి చేసుకున్నాడు?(3,4)
10.  శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ నైఘంటికుడు. ఇంగ్లీష్-తెలుగు, తెలుగు- ఇంగ్లీష్ నిఘంటువుల తయారీదారు (7)
11.   తింటే _____. తినకుంటే నీరసం.(3)
12.    తెలుగు సినిమా నిర్మాత. ఇతని ఆత్మకథ పేరు నవ్విపోదురుగాక. (3)
13.     కలిమిలేములను వీటితో పోలుస్తారు. (3,3)
16.     అంతా అయిపోయిన తర్వాత కలిగే పరిజ్ఞానము. (5)
17.     ఎక్కడం. ఐదో, ఏడో కాదు. (4)
20.    రామలింగ పద్యాలు, బుచ్చిలింగ పద్యాలు, శారదాంబ పద్యాలు వ్రాసిన జంగయ్యగారి ఇంటిపేరు. (2)
21.    చుట్టగుల్ల కడుపులో చిన్నకొండ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూన్ 11వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 16వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-2 జవాబులు:

అడ్డం:
1. అంతా విష్ణుమాయ 5. కోరమీసం 7. పవి 8. తోతా 9. ఈస్టిండియా కంపెనీ 11. ఆనతి 13. అండదండలు 14. భారతదేశం 15. గవర 18. లుతెగు వ్యాకరణం 19. బాకా 21. కుంచె. 22. వాజసని 23. రంగనాయకమ్మ.
నిలువు:
1. అంపశయ్య 2. తావి 3. యమ యాతన 5. మీతో  6. సంతాప సందేశం 9. ఈ కాలం దంపతులు 10. నీలమత పురాణం 11. ఆలుగ 12.తిభార 13. అందమైన బావా 16. వడ్డీ వ్యాపారం 17. అష్టా చెమ్మ 20. కాజ 21. కుంక

పదసంచిక-2కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. అభినేత్రి వంగల
  2. అనురాధాసాయి జొన్నలగడ్డ
  3. ఈమని రమామణి
  4. భాగవతుల కృష్ణారావు
  5. పి. ఝాన్సీరాణి
  6. తల్లాప్రగడ మధుసూదనరావు
  7. వైదేహి అక్కపెద్ది
  8. తాతిరాజు జగం
  9. విద్య ప్రయాగ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here