‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. రూపనగుడి నారాయణరావు దౌహిత్రుడు. సాహిత్యాభిమాని ఈ కైప వంశతిలకుడు. (2,4) | 
| 4. మెల్లమెల్లగా హిందీలో చెప్పండి. (4) | 
| 7. పులిసిన నీళ్ళలో వాగ్దేవి (2) | 
| 8. అడవి ఉలవ. ఇలా అయ్యి మసైపోతుందనుకునేరు. (2) | 
| 9. అరకొర పని అని అర్థాన్నిచ్చే ఒక జాతీయము. (4,3) | 
| 11. చంద్రకాంత పువ్వు, బచ్చలిపండు, వెంపలిపువ్వు కలిగున్న రంగు. ఎఱుపు ఊదా కలిసిన ఒక రకం నీలి రంగు. (3) | 
| 13. ఇదివరకేమోగాని ఇప్పుడు ఇతడిని దివ్యాంగుడు అనే పిలవాలి. (5) | 
| 14. కొలిమి అంటుకున్నది నవలా రచయిత. (2,3) | 
| 15. మహాదాతకు మరోపేరు. (3) | 
| 18. వికీపీడియా దీనికి ఉదాహరణ. (3,4) | 
| 19. భారతీయ ఎల్విస్ ప్రెస్లీ ఈ కపూర్. (2) | 
| 21. రూపాయలో రెండువందల యాభైఆరవ వంతు. (2) | 
| 22. శ్రీకృష్ణుడు. కరిభిత్తు, గిరిభిత్తు కాడు. (4) | 
| 23. అందరికీ న్యాయపతి రాఘవరావు ఇలా తెలుసు. (3,3) | 
నిలువు:
| 1. Circumferenceకై వారము వర్జ్యము వెదకాలి. (4) | 
| 2. ఫణి తేలికైన వ్యాపారి (2) | 
| 3. దంపతులకు చేసే పూజ వికృతమై తలక్రిందయింది. (5) | 
| 5. ధైర్యం. (2) | 
| 6. అందరికీ న్యాయపతి కామేశ్వరి ఇలా తెలుసు. (3,3) | 
| 9. వరదాంబికా పరిణయం అనే సంస్కృత కావ్యకర్త్రి. (5,2) | 
| 10. ముత్యాల రాజు వ్రాసిన కృతికి ఈ పేరును ఊహించుకోవచ్చును. (3,4) | 
| 11. మెదడులో పులిసిన మజ్జిగ. (3) | 
| 12. చిన్నపెట్టె చిందరవందర అయ్యింది. (3) | 
| 13. తటిద్వల్లరి (6) | 
| 16. _ _ _ _ _ యమునాతీరే వసతివనే వనమాలీ (5) | 
| 17. శంకరాభరణం బ్లాగరి ఈ కంది వారు. (4) | 
| 20. తిరగబడిన ఒక విధమైన పేకాట (2) | 
| 21. అల్పము (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 03 తేదీన వెలువడతాయి.
పదసంచిక-48జవాబులు:
అడ్డం:
1.అనుపమచోప్రా 4.చిరుద్యోగి 7.క్షోత్త 8.తట్టు 9.మృష్టాన్నభోజనము 11.తోవంట 13.అనిష్ణాతుడు 14. లబ్బులిదొర/లదొలిబ్బుర 15.తపన 18.మున్నంగిశతకము 19.యుక్తి 21.కోమా 22.డుముదాసు 23.డుకురకాయల.
నిలువు:
1.అక్షోహిణి 2.నుత్త 3.ప్రారంభోత్సవం 5.ద్యోత. 6.గిట్టుబాటుధర 9.మృదుకృష్ణాయసము 10.ముదుసలితనము 11.తోడుత 12.టలన 13.అనామధేయుడు 16.పరాశరుడు 17.హేమమాల 20.క్తిము 21.కోయ
పదసంచిక-48కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనిత ఎస్
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- కన్యాకుమారి బయన
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

