పదసంచిక-50

0
5

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రూపనగుడి నారాయణరావు దౌహిత్రుడు. సాహిత్యాభిమాని ఈ కైప వంశతిలకుడు. (2,4)
4. మెల్లమెల్లగా హిందీలో చెప్పండి. (4)
7. పులిసిన నీళ్ళలో వాగ్దేవి (2)
8. అడవి ఉలవ. ఇలా అయ్యి మసైపోతుందనుకునేరు. (2)
9. అరకొర పని అని అర్థాన్నిచ్చే ఒక జాతీయము. (4,3)
 11. చంద్రకాంత పువ్వు, బచ్చలిపండు, వెంపలిపువ్వు కలిగున్న రంగు. ఎఱుపు ఊదా కలిసిన ఒక రకం నీలి రంగు. (3)
13. ఇదివరకేమోగాని ఇప్పుడు ఇతడిని దివ్యాంగుడు అనే పిలవాలి. (5)
14. కొలిమి అంటుకున్నది నవలా రచయిత. (2,3)
15. మహాదాతకు మరోపేరు. (3)
18. వికీపీడియా దీనికి ఉదాహరణ. (3,4)
19. భారతీయ ఎల్విస్ ప్రెస్లీ ఈ కపూర్. (2)
21. రూపాయలో రెండువందల యాభైఆరవ వంతు. (2)
22. శ్రీకృష్ణుడు. కరిభిత్తు, గిరిభిత్తు కాడు. (4)
23. అందరికీ న్యాయపతి రాఘవరావు ఇలా తెలుసు. (3,3)

నిలువు:

1. Circumferenceకై వారము వర్జ్యము వెదకాలి. (4)
2. ఫణి తేలికైన వ్యాపారి (2)
3. దంపతులకు చేసే పూజ వికృతమై తలక్రిందయింది. (5)
5. ధైర్యం. (2)
6. అందరికీ న్యాయపతి కామేశ్వరి ఇలా తెలుసు. (3,3)
9. వరదాంబికా పరిణయం అనే సంస్కృత కావ్యకర్త్రి. (5,2)
10. ముత్యాల రాజు వ్రాసిన కృతికి ఈ పేరును ఊహించుకోవచ్చును. (3,4)
11. మెదడులో పులిసిన మజ్జిగ. (3)
12. చిన్నపెట్టె చిందరవందర అయ్యింది. (3)
13. తటిద్వల్లరి (6)
16.  _  _ _ _ _ యమునాతీరే వసతివనే వనమాలీ (5)
17. శంకరాభరణం బ్లాగరి ఈ కంది వారు. (4)
20. తిరగబడిన ఒక విధమైన పేకాట (2)
21. అల్పము (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 03 తేదీన వెలువడతాయి.

పదసంచిక-48జవాబులు:

అడ్డం:                                 

1.అనుపమచోప్రా  4.చిరుద్యోగి  7.క్షోత్త  8.తట్టు  9.మృష్టాన్నభోజనము  11.తోవంట  13.అనిష్ణాతుడు 14. లబ్బులిదొర/లదొలిబ్బుర 15.తపన 18.మున్నంగిశతకము 19.యుక్తి  21.కోమా  22.డుముదాసు  23.డుకురకాయల.

నిలువు:

1.అక్షోహిణి  2.నుత్త  3.ప్రారంభోత్సవం  5.ద్యోత. 6.గిట్టుబాటుధర  9.మృదుకృష్ణాయసము 10.ముదుసలితనము 11.తోడుత 12.టలన 13.అనామధేయుడు 16.పరాశరుడు 17.హేమమాల 20.క్తిము 21.కోయ

పదసంచిక-48కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనిత ఎస్
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here