పదసంచిక-58

0
7

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శ్రీశ్రీ చెప్పిన మార్చ్ ఫార్వర్డ్. (3,3)
4. రావిశాస్త్రి నవల. (4)
7. తల్లికి కలుగు ముద్దు __ కున్నదా అని తాళ్లపాక పెదతిరుమలయ్య కీర్తన. ఇక్కడ రివర్సులో (2)
8. ముక్కిడి (2)
9. అల్లం రాజయ్య నవల (7)
 11. నటరాజ రామకృష్ణ వ్రాసిన చారిత్రక నవల (3)
13. కలువప్రియుడు కదా చంద్రుడు. (5)
14. తడబడిన బౌద్ధారామము (5)
15. దారం వడికే సాధనం (3)
18. లొట్టిపిట్ట (7)
19. దరిలేని తోబుట్టువు తప్పుకదా (2)
21. శివాజీగణేశన్ కొడుకు ఈ నటుడు. (2)
22. అడవిని కడుపున పెట్టుకున్న సంతోషకరం (5)
23. ఇచ్చినమాటను తప్పువాడు (6)

నిలువు:

1. పలువేదికలతో అనేకము (4)
2. వ్యవహారం (2)
3. చెప్పుదెబ్బ దీనికే గానీ తడబడ్డది. (5)
5. అంగ్రేజీ విద్యలో ఆత్మ (2)
6. సమాసానికి గల అర్థాన్ని తెలియజేసేది (6)
9.  అనిసెట్టి శ్రీధర్ కథల పుస్తకం. అదే పేరుతో వరుణ్ సందేశ్ సినిమా. (2,3,2)
10. __ __ ___ నూరేళ్ళు ఆయుష్షు అని తెలుగు సామెత. (2,2,3)
11. దేవమణి సత్యనాథన్‌ రాసిన తొలి తరం తెలుగు నవల (3)
12. వి.ఎస్.రమాదేవి వ్రాసిన నవల. (3)
13. నొప్పి పుట్టించే పరమాన్నం (6)
16.  మత్కుణములు (5)
17. సరసిజనాభుడి దాయాది. (4)
20. స్థాయి. (2)
21. బుద్ధికి కొమ్మిస్తే అంగవికలుడు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 23 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూన్ 28 తేదీన వెలువడతాయి.

పదసంచిక-56 జవాబులు:

అడ్డం:                                 

1.జాతీయ సంపద 4. గర్భసంచి 7. తట 8. తగు 9. వర్తమానసంచిక 11. అడవి 13. అడకత్తెర 14. రాముని దాడి 15. సంగమం 18. బంకించంద్ర ఛటర్జీ 19. టిన్ను 21. స్వాతి 22. నికరము 23. క్షంపయలహామ

నిలువు:

1.జాతకర్ణి 2. తీట 3. దమనకాండ 5. సంత 6. చిగురాకుతిండి 9.వసుధైక కుటుంబం 10. కమలినిముఖర్జీ 11. అరసం 12. విరామం 13. అమరతటిని 16. గజేంద్రమోక్షం 17. వి ప్రతిమ 20. న్నుక 21. స్వాహా

పదసంచిక-56కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కన్యాకుమారి బయన
  • భాగవతుల కృష్ణారావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పెయ్యేటి సీతామహాలక్ష్మి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here