[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వ్యోర్మామ్భోజమ్. (3,3) |
4. సోనూసూద్‌కు పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమా (4) |
7. ధాన్యపు మిల్లు (2) |
8. వాయువేగమితి కలిగిన గుంపు (2) |
9. వేంకటపార్వతీశకవుల డిటెక్టివ్ నవల (7) |
11. త్వగేలాపత్ర నాగకేసరయుత చందన చూర్ణములో నదీవిశేషము (3) |
13. తెలుగు సినిమా హాస్యనటులు ఈ చదలవాడవారు. (5) |
14. భీముడో, హనుమంతుడో, సుయోధనుడో. (5) |
15. సుశ్రుతముని పెట్టే రొద (3) |
18. తాళ్ళపాక అన్నమాచార్యుని కుమారుడు. ఇతను కూడా సంకీర్తనాచార్యుడే. (7) |
19. గృహస్తు కోసం వర్చస్సును తిరగేయాలి. (2) |
21. కథ అల్టిమేట్ గోల్ ఇక్కడికి చేరడమే. (2) |
22. ఇటీవల మరణించిన వాగ్గేయకారుడు. (4) |
23. ఛాగి. (6) |
నిలువు:
1. తికమక (4) |
2. కత్తుల కౌగిలి కృష్ణమూర్తి గారి తుపాకీ (2) |
3. తుంటి లేని నడుమంతరము పాదుతో కలిసి పేలిపోతుంది జాగ్రత్త (5) |
5. దీన్ని ఆమ్రేడిస్తే మెరుస్తుంది. (2) |
6. పొడుగైన చేపను కలిగున్న సూర్యుడు (6) |
9. బహుమతులలో మొదటిది (3,4) |
10. పుస్తకశిల్పి అనే బిరుదున్న తాళ్ళపల్లి వారు(7) |
11. సక్కదనము (3) |
12. క్షీణ, ఆధునిక, నన్నయ, ప్రాజ్ఞన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథ మొదలైన వాటితో జోడీ కుదిరే పదం. (3) |
13. రసం కలిగిన నన్నెచోడుని కావ్యం.(6) |
16. యుక్తమైన అశ్వశాలతో సంబంధి (5) |
17. కౌముది అంతర్జాల పత్రికలో కర్లపాలెం హనుమంతరావు చిన్న కథల ప్రయోగం. (4) |
20. తిరగేసిన గుహ (2) |
21. కుబేరుని ఖడ్గము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 18 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 23 తేదీన వెలువడతాయి.
పదసంచిక-64 జవాబులు:
అడ్డం:
1.శైలశిబిరము 4. మహానస 7. వాక్కు 8. క్షర 9. అప్రస్తుత ప్రశంస 11. జంపతి 13. శైశవగీతి 14. లక్ష్మీవల్లభ 15. కనకం 18. తిరుమంగలియము 19. రతి 21. రాత 22. ముక్కనుమ 23. ముఖభూషణము
నిలువు:
1.శైవాలిని 2. లక్కు 3. మురతటుప/ముమతటుప 5. నక్ష 6. సరసిజనాభ 9. అభినవ భారతి 10. సహస్రావధానము 11. జంతిక 12. తిలకం 13. శైత్యోపచారము 16. నభోగజము 17. గుణింతము 20. తిక్క 21. రాణ
పదసంచిక-64కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- కన్యాకుమారి బయన
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.