పదును ప్రోగు చేసి..

0
17

[dropcap]న[/dropcap]న్ను నరికిన మాటను
ఇక్కడే వదిలేసి వెళ్లారు.

రహస్యంగా
తీసి దాచి ఉంచా

రెండు ముక్కలైన నేను
నాలుగు ముక్కల్లో జవాబు చెప్పడానికి

* * *

రేపు నేను నరకబోవడాన్ని
తప్పుపట్టకుండా

నలుదిక్కులా చూస్తుండగా
కాచుకుకూర్చున్నా

గుప్పెట్లో ఆ మాటనే ముడుచుకుని
సహనంతో మరింత పదును ప్రోగు చేసి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here