పహరా హుషార్

10
13

[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘పహరా హుషార్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]లనాడు..!
ఉమ్మడి కుటుంబాలలో
బామ్మా, తాతయ్యల
ప్రేమ, లాలనలో
అల్లి బిల్లి తిరుగుతూ
గిల్లి కజ్జాలాడుకుంటూ
ఆత్మీయాభినాల మధ్య
కల్లాకపటం లేని స్నేహలతల నీడల్లో
సామరస్యం, పరస్పర అవగాహనలతో
ఎదిగి ఒదిగిన పిల్లలు
మనోధైర్య స్థైర్యాలతో
ఆత్మన్యూనతను అధిగమించి
అభివృద్ధి పథంలో పయనించి
‘జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపీ గరీయసి’ అని నిరూపిస్తే..!

ఈనాడు..!
వ్యష్ఠి కుటుంబంలో
మితిమీరిన గారాబం
పెచ్చరిల్లిన అసహనం – దురభిమానం –
సామాజిక అవగాహనా లోపం –
స్నేహ, ప్రేమరాహిత్యాలనే
అడకత్తెర మధ్య పోకచెక్కలా నలిగిపోతుంటే!
కృష్ణ పక్షపు చంద్రుడిలా మసక బారుతుంటే!
కాంక్రీటు, కార్పొరేట్ విద్యాలయాల్లో
పెల్లుబికిన రాక్షసత్వం
సర్దుకోలేని పసితనం
అమాయకపు మొండితనం
ఆత్మహత్యకు పురికొల్పితే
ఆ తల్లిదండ్రుల ఆవేదన..!
అనిర్వచనీయం..
నేటి తల్లిదండ్రులూ!
పహరా హుషార్! పహరా హుషార్! పహరా హుషార్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here