పక్షుల పొడుపు కథలు

0
11

[బాలబాలికల కోసం పక్షుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ప్రశ్నలు:
1)
మేఘావృతమైన ఆకాశం
మేను విదిల్చి చేసే నాట్యం
పక్షి జాతిలో పెట్టెను కిరీటం

2)
తెల్లారిందని నిద్ర లేపుతుంది
ఇల్లెక్కి గట్టిగా అరుస్తుంది
పిల్లల్ని వెంటేసుకు తిరుగుతుంది

3)
మామిడి చివుళ్ళు నములుతుంది
మధుర స్వరంలో ఆలపిస్తుంది
నలుపు కాదు నైపుణ్యం చూడమంటుంది

4)
చుట్టు పక్కల చెట్టు మీద ఉంటుంది
పిల్లల కథల్లో కావు కావున విహరిస్తుంది
పితరుల అన్నం తిని సంతోష పరుస్తుంది

5)
పలికినవన్ని తిరిగి అప్ప చెప్పుతుంది
పలువురికి జోస్యం కూడా చెపుతుంది
రంగుల్లో ప్రత్యేకత కలిగి ఉన్నది

6)
వడ్లగింజలను ఒలుచుకు తింటుంది
బియ్యం తిని పోట్టును పారేస్తుంది
చూరులో చేరి గోల గోల చేస్తుంది

7)
చెట్టు బెరడును తొలుస్తుంది
చెక్కను చీల్చి గూడు కడుతుంది
చెక్క పనిని ఇంటి పేరు చేసుకుంది

8)
నీటిలోన ఈదుతుంది
నేల మీద నడుస్తుంది
నింగిలో ఎగిరి వలస పోతుంది

9)
కోడి పిల్లల్ని రివ్వున తన్నుకుపోతుంది
ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతుంది
సునిశిత దృష్టిని కలిగి ఉంటుంది

10)
చనిపోయిన జీవుల్ని పీక్కుతింటుంది
స్కావెంజర్ గా భూమికి మేలు చేస్తుంది
అడవులు తగ్గి అంతర్థానమవుతుంది

11)
మానస సరోవరంలో నివసిస్తుంది
మరల సందేశాన్ని మోసుకు వస్తుంది
సరస్వతి దేవి వాహనంగా పేరు పొందింది

12)
ఒంటి కాలి మీద జపం చేస్తుంది
నీటి మడుగుల్లో బాగా నివసిస్తుంది
మెడ పొడుగుతో పేరు తెచ్చుకుంది

13)
లక్ష్మి దేవీ వాహనమై తిరుగుతుంది
మిడిగుర్లుతో అందవికారంగా ఉంటుంది
రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది

14)
పక్షులకు రాజు
విష్ణువు వాహనం
పాముల శత్రువు

జవాబులు:
1. నెమలి 2. కోడి 3. కోయిల 4. కాకి 5. చిలుక 6. పిచ్చుక 7. వడ్రంగి పిట్ట 8. బాతు 9. డేగ 10. రాబందు 11. హంస 12. కొంగ 13. గుడ్లగూబ 14. గండ భేరుండ/ గరుడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here