పెన్షన్ స్కీమ్ – వృద్ధుల ఆనందమే

0
12

[dropcap]సూ[/dropcap]ర్యోదయానికి ముందే పల్లె మేల్కొంటుంది. ప్రజలంతా తన పనుల్లో లీనమై ఉంటారు. ఇరుగు పొరుగు గురించి కూడా బాగా ఆలోచిస్తారు. ఆ ఊళ్ళో అన్ని ప్రెసిడెంట్ గారు చూస్తారు.

పెన్షన్ స్కీమ్‌కి ఇంకా కొందరు మాత్రమే ఉన్నారు. ఒకసారి అలవాటు చేసారు, అసలు లేకపోతే ఏమో ఎవరూ ఏమీ అడగరు.

ఆ మధ్య కొందరికి పెన్షన్ ఇవ్వడం మానేశారు. ఇప్పుడు మరి కొందర్ని ఏరేసారు. అలా జనాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ కొత్త వాళ్ళని ఎన్నుకుని పాత కార్డులు మానేశారు. ఇది ఏమి సమంజసం? వృద్ధులకి పెన్షన్ లేదు, చిన్న వయసు వారికి ఊరికే ఇంట్లో కూచుంటే డబ్బు పథకాలు వచ్చాయి. ఏమిటి? ఆర్తులు అన్నార్తులు ఏరి వేయబడ్డారు.

అన్నపూర్ణమ్మ లేచి కళ్ళాపి చల్లి ముగ్గు వేసి రెడీగా కూర్చుంది. ఆమె ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. వృద్ధులకు నిద్ర తక్కువ. ఇలా ఓ పదిమందికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పింది. అన్నపూర్ణ, సుందరమ్మ ఇద్దరు స్నేహితులు. కష్టం సుఖం చెప్పుకుంటారు.

సూర్యోదయం ముందే సుందరమ్మ లేచి కొత్త సంవత్సరం రోజున రెడీగా ఉన్నది. వాలంటీర్ ఎప్పుడు వస్తుందా, బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఆశగా చూస్తోంది.

దగ్గరలో ఉన్న స్లం ఏరియాలకి మినిస్టర్ వచ్చి కేక్ కోసి పంచి, పెన్షన్ ఇచ్చారు. అన్ని పెద్ద టీవీల వారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసి మెసేజ్ తీసుకున్నారు. మినిస్టర్ చేతి మీదుగా పెన్షన్ కవర్ అంటే మాటలా, అబ్బో అబ్బో ది గ్రేట్ అనే భావనతో అంతా ఉన్నారు.

‘ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షాం రామం నిశాచర వినాశకరం నమామి’ అన్నట్లుగా ఎత్తుగా పొడుగ్గా గంభీరంగా నవ్వుతూ కనిపించే నారాయణుడిలా ఉన్నాడు. అందరూ దండలు పెట్టారు. కొందరు ఆఫీసర్స్ పూల దండలు గుచ్చాలు ఇచ్చారు.

సుందరమ్మ ఎదురు చూస్తోంది. అక్కడ నుంచి మినిస్టర్ వెళ్ళిపోయారు. ఇంకో చోట కేక్ కోసే ఫంక్షన్‍కి వెళ్ళారు.

కానీ కింద కొంత మందికి పింఛన్లు అందలేదు. అక్కడి కౌన్సిలర్స్ వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లారు. ముసలమ్మలకి పించేన్ ఇచ్చినట్లు ఫోటోలో కనిపిస్తున్న దానికి వాళ్ళు మురిసిపోయారు.

సుందరమ్మకి ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. ముసలి ప్రాణం ఆనంద పడింది. ఈ నెల రెండు వందల యాబయి రూపాయలు ఎక్కువ వచ్చినందుకు ఆనందంగా ఉంది.

కొందరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఏవో సాకులు చెప్పి ఇవ్వడం లేదు. కొందరికి ఇల్లు, కొందరికి స్థలాలు ఉన్నట్లు ఆ లిస్టులో చెప్పింది. కానీ అది నిజం ఎంత వరకు? కానీ వాళ్ళు కొత్త సంవత్సరంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏమో చాలా మంది అనుకున్నది.

పిల్లలు ఉండి చూడక ఎందరో వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. పిల్లలు మంచివాళ్ళు అయితే ఓ ఇల్లు ఏర్పాటు చేసి వంట మనిషిని పెట్టీ చూస్తున్నారు. ఎవరి ఉద్యోగం వారిది, అవి వదులుకుంటే జీవితం లేదు. పెద్దల్ని ప్రేమగా చూస్తున్నారు అంతే చాలు. వృద్ధాప్యపు పించిన్ కొంత ఆదుకుంటుంది. కన్న కొడుకులు మాదిరి ఆ ఆఫీసర్స్ ఆదుకుంటున్నారు.

వేలి ముద్రలు పడకపోయినా, కన్నుకి ఫోటో తీసి పట్టుకెళ్ళి డబ్బు ఇచ్చారు. ఏమిటి వేలి ముద్ర మిషన్ సరిగా ఉండదు? ఒక్కో నెల ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్ వచ్చి చెక్ చేస్తారు.

ఒకసారి అస్సలు వేలిముద్ర పడలేదు. నాలుగు రోజులు గడువు ఉన్నది ఎలాగో అలాగా చూసి డబ్బు ఇవ్వండి అని అడిగింది. అప్పుడు కేవైసీ కావాలి అన్నారు. అది ఆమెకు ఎలా వస్తుంది? ఎవరు వివరం చెప్పలేదు. వాలంటీర్స్‌ని అడిగితే వాళ్ళు కూడా మీరే వెళ్ళాలి అన్నారు. వెళ్లి క్యూ లో నుంచుని ఒక రోజు ఫారం తెచ్చుకుని వాళ్ళు చెప్పిన సమయానికి వేరే రోజు వెళ్లి ఇస్తే, మళ్ళీ కొన్నాళ్ళు ఆగి రండి అని చెప్పి పంపేశాడు గుమాస్తా.

పాపం రూకల కోసం రకరకాలు తిప్పలు పడింది.

మళ్ళీ ఇక్కడ డబ్బు కట్టి పుచ్చుకుంటే మేము కాదు, ఎప్పుడు వస్తుందో చెప్పలేము. పోస్ట్ లో వస్తుంది అంటూ పదిహేను రోజులకీ ఈసేవకి వెళ్లి తెచ్చుకోండి అన్నారు. సరే అనక పోతే తిప్పలు. ఎలాగో, అనుకుంది.

వాలంటీర్స్ మాత్రం మీకు కే.వై.సీ లేనిదే పెన్షన్ ఇవ్వము. మిషన్‌లో వేలిముద్ర రావడం లేదు. కన్ను సరిగా పడటం లేదు. పెన్షన్ వెనక్కి పంపేస్తాము అన్నారు. ఇలా ప్రతి నెల హిరణ్యాక్ష వరంలా ఏదో ఒక వంక పెడుతూ ఉన్నారు.

ఏ రోజు సవ్యంగా డబ్బు ఇవ్వలేదు సరికదా, ఆ కాగితం తెండి ఈ కాగితం తెండి అంటు చెప్పేవారు. ప్రతి కాగితం కోసం వెళ్ళాలి అంటే అటో ఖర్చు, ఇంకా అక్కడ క్యూలో శ్రమ పడటం మళ్ళీ ఐదు వందలు ఖర్చు. సరి పోయేది కాదు.

ఇదో రకం హింస ఇంటికి ఇస్తున్నాము అంటారు. వంద ప్రూఫ్‌లు కావాలి. అన్నపూర్ణా, రమణమ్మ, రాజ్యం, సుందరమ్మ ఇలా ఎందరో ఈ పెన్షన్ కోసం తిప్పలు పడుతున్నారు.

పిల్లలు ఉన్నా ఎక్కడో ఉద్యోగాల్లో ఉంటారు. ఎవరి కుటుంబం వారిది. తల్లికి కొంత డబ్బు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పంపుతారు. వచ్చి మా దగ్గర ఉండు అంటే ఎలా?

ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలు వదిలి రావాలి. మళ్ళీ ప్రభుత్వం నుంచి పొందడం కష్టం అనే కంటే ఒక సారి వదిలితే మళ్ళీ రాదు అనే భయం.

***

సూర్యోదయానికి ముందే పల్లె లేస్తుంది. పనుల్లో బిజీ. ఆత్మీయత అనురాగంతో మనుష్యులు. మాట మంతీ. పలకరింపులు. పట్నంలో మసక చీకటిలో మంచు తెరలతో మనుష్యులు మధ్య ఆర్థిక బంధాలతో ఫోన్ లోనే బద్ధకంగా పలకరింపులతో మసలుతు ఉంటారు.

అయినా రూకలు ఉన్న చోటే నూకలు ఉంటాయి. అక్కడే మూకలు పెరుగుతారు.

పల్లె అంతా మారిపోయి పట్నానికి వెడతారు సంక్రాంతి అనగానే. బస్సులు రైళ్లు అన్ని కూడా బాగా నిండిపోతాయి. పట్నంలో పడ్డ శ్రమ పోగొట్టుకోవడానికి, బంధువుల్ని ఆత్మీయులను కలవాలని పల్లె స్వాగతం పల్కుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు వ్యాపకాలు అన్ని కూడా గుర్తు వస్తాయి.

***

ఆదో పల్లె. అక్కడ అన్ని కాలేజీలు. ఆ ఊరివారు సగం మందికి ఆ కాలేజీ వల్లే ఉపాధి.

రోజుకి రెండువేల మంది హాస్టల్ వారు. రెండు వేల మంది డే స్కాలర్స్ ఉంటారు భోజనాలు అద్భుతంగా ఉంటాయి చదువు అంతా కంటే ఇంకా అద్భుతం.

ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ గడపను తొక్కకుండానే పెద్ద ఉద్యోగాలు అలంకరించారు.

తల్లిదండ్రులది ఎంతో ఆనందం. ఉన్న ఊళ్ళో చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు. అక్కడే తరాలు జరిగిపోతు ఉన్నాయి

వాళ్ల పిల్లలు కూడా అక్కడే. విదేశాలు వెళ్లి చూసి వచ్చి వాళ్ల సొంత కాలేజీ లోనే వివిధ పదవుల్లో చేరిపోయారు. ఆటానమస్ కాలేజీలుగా ఎస్టాబ్లిష్ అయ్యాయి.

అందరూ కూడా పిల్లల్ని ఆ ఊరి వారికి కన్సెషన్ ధరకి చదువు చెప్పించే వారు. అది ఆ ఊరు అదృష్టం అనాలి, అక్కడ చదువులకి వచ్చిన పిల్లలకి ఇల్లు కావాలి కనుక ధరలు కూడా పెరిగి పోయాయి..

ఊరంతా సంక్రాంతి కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. ముగ్గులో నక్షత్ర ముగ్గులుగా 27 సెలెక్ట్ చేస్తారు. ఇవి కాక ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గులతో కలిపి నెల ముగ్గులుగా వీటికి బహుమతి ఇస్తారు.

మొదటి బహుమతి బంగారు గొలుసు, రెండవ బహుమతి వెండి పట్టీలు, మూడవ బహుమతి పెద్ద కూలర్, వాషింగ్ మిషన్ ఇలా పెద్ద ఐటమ్స్ ఇస్తారు. 27 మందికి మంచి బహుమతి ఉంటుంది. ఇదండీ వారి ప్రజ్ఞకు బహుమతి. ఇలాంటి బహుమతులు ఎక్కడ కనిపించవు. అతి పెద్ద సంస్థలలో కూడా ఇలా ఉండదు.

అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా కలిపి చూసుకుంటారు. ఎన్నో దేశాలు చూసిన సంక్రాంతి ఆంటే సొంత ఊరే. అక్కడే నిజమైన ఆనందం. వరి కంకులు ఎండు గడ్డి, ఎద్దు బళ్ళు ఇలా కొన్ని అపురూపాలు ఉంటాయి. వాటి అందం వాటిదే. ప్రకృతి ఆస్వాదనలో ఎన్నో అందాలు. అయితే విదేశాల్లో పట్టణాల్లో ఎప్పుడు దీపాలు అలంకరించి ఉంటాయి. మరి పల్లెలో పండుగ సంబరాలు వేరే ఉంటాయి. ఆ గాలిపటాల అందం ఇప్పుడు విభిన్న రీతుల్లో ఫోటోలతో వస్తున్నాయి. అవి పిల్లలకి అంతంత ఆనందం. ఎంత ధనవంతులైన పండుగ అనగానే పిల్లలకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. దేశాన్ని ఏలే అధినేతలు కూడా సంక్రాంతికి ఎంతో ఆనందంగా అందరితో ఐకమత్యంగా ఉంటారు.

***

సూర్యోదయానికి ముందే సుభద్ర ఇంటి పనుల్లో లీనమవుతుంది. పాలేరు వెంకన్న వచ్చి ఆవుపేడ కళ్ళాపి చల్లి వెడతాడు. ముగ్గు గిన్నెలు రంగుల గిన్నెలు పుచ్చుకుని వెళ్లి ముగ్గు పెడుతుంది. పెట్టిన ముగ్గు పెట్టకుండా వేసిన రంగు వెయ్యకుండా అందంగా పెడుతుంది. ఆ వీధిలో వెళ్ళేవాళ్ళు అంతా ఆగి చూసి వెడతారు. ఆ నెల అంతా ఇంద్రధనుస్సు నేలపై ఉన్నదా అన్నట్లు సూర్య వర్ణాలతో పోటీ పడినట్లు ఉంటుంది.

చల్లని చలి గాలలు ఒక ప్రక్క మరో ప్రక్క మంచి ముత్యాల మాదిరి మంచు ముత్యాల వానలా కురుస్తుంటే రంగు ముగ్గులు పెట్టీ అలంకారము చేస్తుంటే కాడ మల్లె పూల సుగంధ సౌరభాలు, శ్రీ హరిదాసు గజ్జెల అడుగులు

తంబురా శ్రుతి చిడతలు వాయిస్తూన్న ధ్వని దగ్గర పడుతుంటే శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతూ చిందులు వేస్తూ వస్తాడు.

ఇత్తడి పళ్ళెంలో కూరలు బియ్యం పప్పు బెల్లం పెట్టీ రోజువారీ ఇస్తారు. పండుగ రోజు పిండి వంటలు పెట్టీ ఇస్తారు. ఇత్తడి గుమ్మడికాయ పాత్ర అంచుకి శ్రీ వేంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టీ ఉంటుంది. ఆ పాత్రలో బియ్యం వేసి పిండివంటలు జోలెలో వేస్తారు.

ఈ ఆధునిక యుగంలో మోపెడ్ స్కూటర్ పై వచ్చి మైక్ పెట్టీ పాడుతూ స్పీడ్‌గా వెడుతున్న పద్ధతి వచ్చింది. కలియుగ మార్పు అనాలి. వారి పిల్లలంతా పెద్ద చదువులు చదివి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా సరే ఇది హరినామ స్మరణ కావున వృద్ధాప్యంలో కూడా ఈ పద్ధతిలో హరిదాసు కనిపిస్తున్నాడు. పెద్ద పెద్ద వీధులు. అందుకే స్కూటర్ పై వస్తున్నాడు. సుభద్ర నెలకి సరిపడా హరిదాసు కి ప్యాకెట్లు కట్టి ఉంచుతుంది. ముగ్గు గిన్నేతో పాటు ఈ ప్యాకెట్ ఒకటి దగ్గర పెట్టుకుని రాగానే పళ్ళెంలో పెట్టుకుని ఇస్తుంది.

ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో శ్రీ కృష్ణ శ్రీ విష్ణు శ్రీ జనార్ధన స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ రాముడు శ్రీ కేశవ స్వామి శ్రీ నరసింహ స్వామి శ్రీ రంగనాథ స్వామి శ్రీ పాండు రంగ విఠల్ స్వామి దేవాలయాలలో ధనుస్సు పూజ చేసి దధ్యోజనం పులిహోర చక్రపొంగలి వడలు పాయసం వంటి వంటకాలు చేసి నివేదన పెడతారు.

కొందరు పెళ్లి కానీ పిల్లల చేత మంచి భర్తల కోసం తెల్లవార గట్ల ధనుస్సు పూజ చేయించి నివేదన పెడితే మంచి సంబంధం కుదురుతుంది. గోదాదేవి శ్రీ రంగ నాయకులను నెల అంతా పూజ చేసి పాశురాలు పాడి నెల చివర భోగి రోజు కళ్యాణము దేవాలయాలలో చేస్తారు. శ్రీ కృష్ణుడికి శ్రీ వేంకటేశ్వర స్వామికి శ్రీ విష్ణువు శ్రీ రంగనాథునికి భోగి పళ్లు పోసి పూజిస్తారు. ఇంట్లో చిన్న పిల్లలకి కూడా పోస్తారు .

ఇటువంటి ఆనంద సంక్రాంతికి ముందు న్యూఇయర్ రోజు ఎంతో మందికి పెన్షన్ ఆగి పోయింది. ఇది ఎంతో మందికి చాలా బాధాకరమే కదా. అయినా ఎవరి కోసం ఏది ఆగదు. అయితే ఆదుకొనే వారు కావాలి. అందుకు విశాల దృక్పథంతో కొంత మంది ముందుకు రావాలి. కానీ పెన్షన్ అగిన ఏ ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి సమస్య గురించి అప్లికేషన్స్ పెట్టలేదు. ఎవరి మానాన వారు భాధ పడుతు కూర్చున్నారు

ఆడవాళ్ళు రత్తమ్మ, సుందరమ్మ, అన్నపూర్ణ, వెంకట లక్ష్మీ, కాంతామణి ఇలా ఎంతో మంది ఆర్థిక భాధ పడుతున్నారు కానీ పట్టించుకునే వారు లేరు. మౌనంగా చింత పడటమే తెలుసున్న వాళ్ళు ఏ సలహా అడిగిన ఏమి చెయ్యగలము రూల్స్ ప్రకారం అంతే అనాలి.

జనవరి ఒకటి రోజు అంతా కలిసి చక్కగా కొత్త సంవత్సరం రోజున మినిస్టర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. కేక్. చాక్లెట్స్, బిస్కట్లు, పళ్ళు పంచి పెట్టారు

ఎందరో మహానుభావులు అందరి వందనాలు అన్నారు. ఆశతో ఎదురు చూపులు చూస్తున్నారు. వచ్చిన కార్లు పావుగంటలో అంతే వేగంగా వెళ్లిపోయాయి. మీడియా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరికి దక్కేనో వారికి దక్కింది. మిగతా వాళ్ళు నిరాశ పడ్డారు.

కొందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలలో పేపర్స్ నిండా, ఛానెల్స్ లోనూ చూపించారు. ఒక మంత్రి గారితో పోటో అంటే మాటలా చెప్పండి? కొందరే అదృష్టవంతులు.

ఇటువంటి పరిస్థితుల్లో సుభద్ర భర్త రామారావు కొంచెం ఆలోచించారు. ఆ ఊరు ప్రెసిడెంటుగా వీరికి సహాయం చెయ్యాలి అనుకున్నారు. కొంత పెట్టుబడి పెట్టి వీరి చేత బిజినెస్ పెట్టించితే మంచిదని అనుకున్నారు.

సుభద్ర మూడో పిల్ల వారిజ కొంచెం ఎక్కువ చదివింది. పీజీ చేసే కంప్యూటర్ ట్రైనింగ్ అయ్యింది. అయినా ఇంకా చదవాలి అంటుంది.

పెళ్లికి ముందు ఎంతో గారంగా పెరిగింది. అత్తవారు మాకు ఉద్యోగం వద్దు డబ్బు ఉన్నది అన్నారు. పెళ్లి వారు కొంచెం తెలిసిన వారు, డబ్బు ఉంది అంటారు. వేరే శాఖ అని ఆలోచిస్తే, కాదు మంచి వాళ్ళు అంటూ పెళ్లి పెద్ద పెళ్లి చేయించారు. మరి ఈ తరం పిల్లలకి అనువుగా పెళ్లి చెయ్యాలి.

ఎలాగో దాని తిప్పలు అది పడుతుంటే కూతుళ్ళు పండుగ పబ్బాం అని వస్తూ ఉండి ఏవో వంకలు పెట్టీ తిప్పలు పెడతారు. ఆడదానికి అడదే శత్రువు అన్నది మారదు, మార్పు రాదు.

అయినా సుభద్ర కూతురికి ఉద్యోగం చెయ్యాలనే తపన. ఒక పిల్లాడు చాలు, ఇంకా ఆడపిల్లని కని దాన్ని కూడా ఈ సమస్యలలో పెట్టను అంటుంది. ఇది సైన్స్ యుగము. సైన్స్‌తో మనిషి జీవించాలి.

రత్తమ్మ తో పాటు మిగిలిన వారు కూడా ఇక్కడ పనికి ఒప్పుకున్నరు. నీడ పట్టున పని. భోజనం కూడా పెడతారు. రక రకాల వంటలు కూడా. వండిన వంటలు ప్యాకెట్లు కట్టడం, ఆ తరువాత వాటిని సుభద్ర కూతురు పంపడమే.

సుభద్ర – పెన్షన్ ఆగిపోయిన వృద్దులకు, కూతురుకి కూడా వారధిగా ఉన్నది. “అమ్మా బాగానే ఉన్నది అనటానికి, వండినది బాగా రుచి చూసి తినడానికి తేడా ఉంది. నేను హెల్ప్ చేస్తాను. నాకూ ఏదో ఒక వ్యాపకం ఉండాలి” అని వారిజ ‘అమ్మ చేతి వంటలు’ అనే కాన్సెప్ట్‌తో ఆన్‌లైన్‍‌లో యాడ్ పెట్టింది. ఓ పాతిక మంది రిజిస్టర్ చేసుకున్నారు.

ఇంకేమి తల్లిని ఓ వంద ప్యాకెట్లు పంపమన్నది. బాగానే అమ్ముడు అయ్యాయి. ఇది బాగానే ఉన్నది కానీ అందరికి కుదరదు అనుకున్నది వారిజ. ఎంత సేపు ఇంటి చాకిరీ? ఎంత ఆధునిక పరికరాలు ఉన్నా చేసేవారికి పని ఉంటుంది. సరే వేసవిలో తాటి తాండ్ర, ఊరగాయలు, మామిడి తాండ్ర ఇలా వేరు రకాలు ఏర్పాటు చేద్దాం, పల్లె నుంచి వచ్చే ప్రకృతి వరాలను పట్నం వాసులకి పరిచయం చేసినట్లు ఉంటుంది.” అంది.

వారిజ దృష్టిలో మనిషికి ఒక్క చదువే కాదు ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆహారం ఎవరికైనా అవసరమే.

సుభద్ర దగ్గర ఉండీ అన్ని సరుకులు సరసమైన ధరలకు ఏర్పాటు చేసింది. ముందు అన్ని చూడాలి, నేర్పాలి. ఇంటి వెనుక పెరడులో ఒక షేడ్ వేసి ఏర్పాటు చేసింది. ఏమైనా ఏడాది అంతా ఏదో రకంగా ఆహార పదార్థాల అవసరం ఉంటుంది. కొంత కూతురుకి ఉపాధి ఉంటుంది అని సుభద్ర ఒప్పుకున్నది.

ఇవ్వాళ మంచి ఆహారం దొరకడం కష్టం. రుచి ఉండాలి. సిటీలో ఒక సమయం ఇస్తుంది. ఆ సమయంలో కావాల్సిన వాళ్ళు ముందే బుక్ చేసుకుని ఉంటారు. కాబట్టి తేలికగా అందరికీ ఇచ్చేస్తుంది .

ఇప్పుడు ఆన్లైన్ జీవితం కనుక మంచి వస్తువు కొత్త వస్తువుకి డిమాండ్ ఎక్కువ. మనిషికి మనిషి సహాయం కావాలి. మనిషి సంఘజీవి. ఎంత డబ్బు ఉన్నా అవసరానికి ఎంతో ఆదుకునే వ్యక్తి కావాలి.

సుభద్ర ఈ వృద్ధులని ఆదుకోవాలి అనే భావనతో కొన్ని విషయాలు భర్తకు చెప్పింది. ఊరు ప్రెసిడెంట్ కదా, వారి బాగోగులు చూడాలి, సరే అన్నాడు.

సుభద్ర కొందరినైనా ఆదుకున్నాను అనే తృప్తి పొందింది.

కాలక్రమంలో మనుమలని చధివించుకున్నది. రత్నమ్మ కూతురు కూడా ఇదే ఉపాధి ఎంచుకుని బ్రతుకును మార్చుకున్నది. వంట అంతా తేలిక కాదు. అన్ని సమంగా పాళ్ళు పడాలి. పొయ్యి దగ్గర కూర్చుని సహనంతో వండాలి. ఇది కూడా ఒక యోగమే. నిదానం స్థిరత్వం అన్ని ఉండాలి సృజన ఉండాలి. రుచి అభిరుచి బాగుండాలి పదార్ధాలు చూపులకి కూడా అందంగా ఉండాలి లేకపోతే పిల్లలు తినరు కదా.

సడెన్‌గా పెన్షన్ అగిన ఓ పది మంది కొంచెం ఓపిక ఉన్న వృద్ధుల చేత ఈ లాంటి బిజినెస్ పెట్టి పల్లెలో ఏర్పాటు చేసుకున్నది వారిజ.

అత్తగారు కొత్తలో కోప్పడింది కానీ వివరిస్తే సరే అన్నది. ఆవిడ డబ్బు మనిషి ఎంత డబ్బు ఉన్నా చాలదు. ఇంక ఇంక డబ్బు డబ్బు కావాలి. ఇది ఎలా అంటుంది.

ప్రెసిడెంట్ గారి అమ్మాయి పిండి వంటల బిజినెస్ పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించింది అని కొందరు అంటే ఆ వాళ్ళ అవసరం కోసం ఈ వృద్దులు తక్కువ ధరకి పని చేస్తారు అంటూ ‘పల్లె అరుస్తూటుంటే పట్నం పలుకుకు కరువు’; అన్ని అధిక ధరలు ఉన్నాయి ఇది జనులు చెప్పే జన వాక్కు.

పుట్టుట గిట్టుట నిజము/నట్ట నడుమ పని నాటకము – శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల సారం కొందరికే అవగాహన అవుతుంది. ఇది అందరికీ తెలుసు కానీ అర్థం చేసుకోరు, అన్వయించుకోరు.

ఏ మాసానికి ఆ మాసం పిండివంటల గిరాకీ ఉంటుంది. మాఘమాసంలో పెళ్లి, పిండివంటలు, సారికి బిజీ ఉంటుంది. అదివారం ఆర్డర్స్ పై పొంగలి డబ్బాలు, ఎర్ర రవ్వ హల్వా ప్రసాదం డబ్బాలు బుక్ చేస్తారు.

ఆహారం అన్ని కాలాల అవసరమే అందుకు ఈ బిజినెస్ ఎంతో మంచిది.

అప్పుడే నెల తిరిగి పోయింది. పెన్షన్ ఇవ్వడం ఆగిపోయింది. అయితే బ్రతుకు మారింది. మనిషి జీవితానికి ఏదో ఒక ఉపాధి కావాలి అనుకుంటే డబ్బు పెట్టీ చూసే వాళ్ళు కావాలి. అందుకే ఆహారం బిజినేస్ నిత్యనూతనం అని చెప్పాలి.

వారిజ ఆలోచిస్తూ ఉన్నది – పెద్ద ఎత్తున పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇదే సింపుల్‌గా చేసి అమ్మితే నయం అని సంతృప్తి పడింది. ఇలాగ సాగనీ అని భర్త అనడం వల్ల ఊరుకున్నది. ఇంటి సహకారం ఉండాలి. మరి కొందరు ముందుకు వచ్చి చేయూత నిచ్చారు. ఐకమత్యం బలము.

మంచి ఆలోచన, ఎంతో మందికి జీవన ఆదరణ అందించే సామర్థ్యం కలిగిన ప్రతిభ ఉన్నవారు పల్లె ఉన్నతికి కృషికి శ్రీకారం చుట్టి ఆదుకుంటున్నారు.

సర్వేజనా సుఖనోభవంతు. శాంతి శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here