పిడపర్తి వెంకటరమణశర్మ గారి జ్ఞాపకార్థం కథల పోటీ – 2021 – ప్రకటన

0
2

[dropcap]కౌ[/dropcap]ముది (www.koumudi.net) వెబ్ మాసపత్రిక నిర్వహణలో ‘పిడపర్తి వెంకటరమణశర్మ గారి జ్ఞాపకార్థం కథల పోటీ – 2021’ నిర్వహించబడుతోంది.

బహుమతులు:

  • ఉత్తమ కథలు – 3 – ఒక్కొక్క కథకు రూ. 5,000/-
  • బహుమతి కథలు – 20 – ఒక్కొక్క కథకు రూ 1,500/-
  • సాధారణ ప్రచురణ కథలు – 15 – ఒక్కొక్క కథకు రూ 1,000/-

రచయిత/త్రులకు సూచనలు:

  • కథాంశం ఏదైనా – నవ్యతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే రచనల్ని ఆహ్వానిస్తున్నాం.
  • కేవలం సందేశం కోసమే వ్రాసిన కథలకూ, శీర్షికలోనే కథాంశం తెలియపరిచే కథలకూ విజయావకాశాలు తక్కువగా ఉంటాయని గమనించ ప్రార్థన.
  • ఇంతకు ముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో కానీ, వెబ్ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ) ప్రచురితం కాని రచనలను మాత్రమే పోటీకి పంపించండి.
  • ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు కూడా పోటీకి అర్హం కావు.
  • పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పని సరిగా జతపరచాలి. హామీపత్రం లేని రచనలు పరిశీలించబడవని గమనించగలరు.
  • కథలను తెలుగులో టైప్ చేసి (యూనికోడ్ లేదా అను ఫాంట్స్) లేదా స్కాన్ చేసి ఇ-మెయిల్లో మాత్రమే పంపించాలి.
  • ప్రచురణకు అంగీకరించని ప్రతులను త్రిప్పి పంపడం సాధ్యం కాదు. వాటి కాపీలు తీసి ఉంచుకోవడం మంచిది.
  • రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/త్రి అసలు పేరు, పూర్తి చిరునామా తప్పని సరిగా వ్రాయాలి.
  • పోటీలలో ఏ బహుమతి పొందిన కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత రచయిత/త్రి వెనకకు తీసుకునే అవకాశం లేదని గమనించండి.
  • టైపింగ్ కథ 10 పేజీలు మించకుండా ఉంటే మంచిది.
  • పోటీ ఫలితాలు koumudi.net – నవంబర్ 2021 సంచికలో ప్రచురించబడతాయి.
  • బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం లేదు.
  • బహుమతి పొందిన కథలు ‘కౌముది’ వెబ్ పత్రికలో జనవరి 2022 సంచికనుంచి, నెలకు రెండు చొప్పున, ప్రచురించబడతాయి.

పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2021

ఫలితాల ప్రకటన: నవంబర్ 1, 2021

మీ రచనలు పంపించాల్సిన ఇమెయిల్ చిరునామా: stories@koumudi.net

తెలుగు కథా రచనకు ప్రోత్సాహం – ఉత్తమ కథలకు సముచిత పురస్కారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here