విలియం వర్డ్స్‌వర్త్ రెండు కవితలు

0
9

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. విలియం వర్డ్స్‌వర్త్ రాసిన We are Seven; The Sun has long been set అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1.మేము ఏడుగురం

~

ఒక అతి మామూలు చిన్నారి
తేలికైన శ్వాసలతో
ప్రతి అవయవంలోను జీవం తొణకిసలాడేలా..
………..

మరణం గురించి తానేమి తెలుసుకోవాలి..?

చిన్న కుటీరంలోని ఓ బాలికను కలిసాను
ఎనిమిది వత్సరాల వయసు తనదని చెప్పిందామె
తలచుట్టూ వంపులు తిరిగి, చిక్కులు బడ్డ
చిక్కటి కేశపాశంతో కొండగాలి చుట్టుకున్న పల్లె పిల్ల
మోటైన దుస్తులు ధరించిన అనాగరికపు అమ్మాయి

ఆమె కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి
ఎంతో నిర్మలంగా ఉన్నాయి
ఆ సహజ సౌందర్యం
నన్నెంతో ఆనందపరిచింది
“అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు..
చిన్నదానా.. మీరు ఎంతమంది ఉండవచ్చు..”

“ఎన్ని.. మొత్తం ఏడుగురం”
చెపుతూ ఆశ్చర్యంగా నా వైపు చూసింది
“మరి.. వారంతా ఎక్కడున్నారో”
తెలపమని అభ్యర్థించాను
జవాబిచ్చిందిలా..

“మేము ఏడుగురం..
మాలో ఇద్దరు కాన్వేలో..
మరో ఇద్దరు సముద్రంలోకి వెళ్ళిపోయారు.”

***

(కాన్వే.. Conway = పుణ్యనది, మొక్కులు చెల్లించే స్వస్థలం.)

***

2.సూర్యుడు త్వరగా వెళ్ళిపోయాడు

~

ఎంతోసేపైంది సూర్యుడు అస్తమించి
నీలాకాశంలోంచి రెండు మూడు నక్షత్రాలు
తొంగి తొంగి చూస్తున్నాయి

చిన్ని చిన్ని పక్షులు కలరవాలు వినిపిస్తున్నాయి
చెట్ల మీదనుంచి, పొదల మధ్య నుంచి
కోయిల కమ్మ కమ్మగా పాడుతోంది
మరో అడవిపక్షి జానపదాల్ని ఆలపిస్తుంది

సుదూరం నుంచి విసిరి విసిరి
వీచే గాలి వీవెనలు
నీటి తుంపరలతో ప్రవాహ గానం
అడవిపై పెత్తనంతో కుహు కుహు చేసే వింత శబ్దాలు
ఆకాశంలోని శూన్యాన్నంతటినీ నింపేస్తున్నాయి

ఈ జూన్ వేసవి రాత్రిలో
అందమైన మృదువైన అర్ధచంద్రుని విడిచి
ఈ అమాయకపు ఆనందాలన్ని వదిలి
ఇంత అద్భుతమైన రాత్రిలో
లండన్ మహా నగరంలో అయినా సరే,
ఎవరు మాత్రం పరేడ్ చేస్తారు!!
ఎవరు మాత్రం ప్రాతినిథ్యం వహిస్తారు??

~

మూలం: విలియం వర్డ్స్‌వర్త్

తెలుగు సేత: హిమజ


విలియం వర్డ్స్‌వర్త్ ( ఏప్రిల్ 1770 – ఏప్రిల్ 1850) ఒక ఆంగ్ల శృంగార కవి, శామ్యూల్ టేలర్ కోల్‌రిడ్జ్‌తో కలిసి, వారి ఉమ్మడి ప్రచురణ లిరికల్ బల్లాడ్స్ (1798)తో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ ఏజ్‌ను ప్రారంభించడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇంగ్లీష్ గ్రామీణ ప్రాంతాలలో నడకలు అతని కవిత్వంలో చూడవచ్చు. విలియం వర్డ్స్‌వర్త్ 1797-1808 యొక్క ‘గ్రేట్ డికేడ్’ సమయంలో ‘టింటర్న్ అబ్బే’ తో సహా అతని ప్రధాన రచనలలో చాలా వరకు రాశాడు. ‘ది సోలిటరీ రీపర్’, ‘రిజల్యూషన్ అండ్ ఇండిపెండెన్స్’, ‘ఓడ్’.

 

 

తన కవితలలో, వర్డ్స్‌వర్త్ ఇతర కవుల వలె ప్రకృతిని మామూలు పద్ధతిలో చూడలేదు. అతను ప్రకృతిని దైవిక శక్తిని కలిగి ఉన్న సజీవ వ్యక్తిత్వంగా భావించాడు. ప్రకృతి తనంత తానే గొప్ప కవి అని భావించిన వర్డ్స్‌వర్త్ ప్రకృతిని ఆరాధించాడు. తన కవితా వృత్తిలో, వర్డ్స్‌వర్త్ ప్రకృతికి అంకితమయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here