ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-12

0
12

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

పురందర దాసు:

[dropcap]పు[/dropcap]రందర దాసు క్రీ.శ. 1486 – 1564 కాలానికి చెందినవాడు. జన్మస్థానము బళ్లారి జిల్లాలోని పురందర గడ (హండి దగ్గర) అను గ్రామము. కర్నాటక బ్రాహ్మణుడు. మధ్వ మతస్తుడు. తండ్రి వరదప్ప, తల్లి పేరు కమలాంబ. భార్య సరస్వతీ బాయి. ఈతని మొదటి పేరు శీనప్ప. తరువాత ముద్దుగా చాలా పేర్లతో పిలిచేవారు. అవి శ్రీను, తిమ్మప్ప, తిరుమలయ్య అని. 20 ఏట తల్లి దండ్రులు గతించుట వలన వ్యాపార భారమంతయు శ్రీనివాసుని పై పడినది. అతి చతురతతో వ్యాపారము చేసి ధనాన్ని బాగుగా గడించెను. వారు సహజ వ్యాపారస్తులు, వారిని ‘నవకోటి నారాయణ’ అని పిలిచేవారు. కాని కృపణత్వము కొంచెం కూడా లేదు అనుటకు ఉదాహరణ.

శ్రీనివాసుని జ్ఞానోదయం కల్పించిన సంఘటన:

శ్రీనివాసుని దగ్గరకు ఒక బ్రాహ్మణుడు తన కొడుకు ఉపనయనము చేయుటకై పైకము సహాయం చేయమని అర్థించుటకు శ్రీనివాసుని దగ్గరకు వెళ్ళెను. ఆతడు ఇయ్యను అని చెప్పక, పలు మార్లు తిప్పించుకుని, రేపు రమ్మని చెప్పుట చేయుచుండెడివాడు. అపుడు ఆ బ్రాహ్మణుడు విసుగు చెంది, ఆతని గృహము కేగి అతని భార్య సరస్వతి దేవీని అర్థించెను. ఆమె మిగుల భక్తి గలది, నిష్ఠాపరురాలు కావున అడిగిన వెంటనే లేదనకూడదని వెంటనే తన ముక్కులోని ముక్కెరను తీసి యిచ్చి, దీనిని అమ్మి ఖర్చుచేసుకోమని ఇచ్చెనట. వెంటనే బ్రాహ్మణుడు దానిని తీసికొని శ్రీనివాసుని యొద్దకే పోయి అమ్మాడట. ఆ నగను చూచిన తడవనే అది తన భార్యది అని గ్రహించి వెంటనే ఒక సేవకుని తన ఇంటికి పంపి తన భార్య ముక్కెరను తీసుకురమ్మని పంపెనట.

సరస్వతీబాయికి ఈ విషయం తెలిసి, కంగారు పడి బ్రతుకుట కందె చచ్చుట మేలని విషమును కలుపుకొని తాగబోయెనట. కానీ ఆశ్చర్యము ఆ విషపు గిన్నెలో తన ముక్కెర కనబడెను. వెంటనే ఆ సేవకునికి ఇచ్చి ఆ ముక్కెరను పంపెను. నగను చూచి అచ్చెరువొంది ఇంటికెళ్లి తన బార్య వల్ల జరిగినదంతయు వినినంతనే ఆతనికి జ్ఞానోదయం కల్గెను. వెంటనే ఆ బ్రాహ్మణుని వెదకి తెమ్మని చెప్పెను. కాని ఆ బ్రాహ్మణుడు కనపడలేదు. ఆ బ్రాహ్మణుడే పరమ పురుషుడు అయిన శ్రీ విఠలస్వామి అని గ్రహించి వెంటనే తన సర్వస్వము ధాన, ధర్మములకు ఇచ్చివేసెను. అపుడే వారు ఆఠాణ రాగంలో ‘మోసహేదేనలో’ అను మొదది కీర్తన రచించిరి.

జ్ఞానోదయం కలిగిన తరువాత అతనిలో మార్పు:

దేశములోని అన్ని క్షేత్ర తీర్థములను దర్శించెను. వ్యాస రాయలవారు వీరిని 1525 లో వీరి 40వ ఏట హరిదాసులుగా ఆశీర్వదించిరి. వ్యాసరాయ పీఠ స్వాములైన సత్యధర్మ తీర్థులు వీరికి ‘పురందర దాసు’ అని పేరు ఇచ్చిరి. భార్యా భర్తలిద్దరు కృష్ణభక్తులు. వారి భక్తికి మెచ్చి పురందర విఠలుడు ఎన్నోసార్లు దర్శనమిచ్చెనట. వీరికి వరదప్ప, గురురాయ, అభినవ, మధ్యపతి అను నలుగురు కుమారులు, రుక్మిణి భాయి అను కూతురును కలిగిరి. వీరు ‘నారదాంశ’ యని ప్రతీతి. ఈయన రచించిన రచనలకు ‘దాసర వదగళు’, ‘దేవర నానుగళు’ అని పేర్లు. స్వనామ ముద్రకారులు. ముద్ర పురంధర విఠల.

సంగీత సాహిత్య సేవ:

పురాణములలోని, ఉపనిషత్తులలోని సారాంశమంతయు వీరి రచనలలో అణగి యుంది.

వీరి కీర్తనలు చక్కటి ఉపమానములు, సామెతలతో కూడి యుంటాయి. రచనా భాష కన్నడము. సంగీతము యొక్క ఔన్నత్యమును గుర్తించి సరియైన మార్గములో జనులు నేర్చుకొనుటకు వీలుగా వీరు ‘మాయా మాళవ గౌళ రాగము’ల స్వరావళులు మొదలగు కీర్తనల వరకు క్రమ పాఠములను రచించి, మనకు గొప్ప నిధిని యిచ్చారు. వీరు స్వరావళులు, అలంకారములు, పిళ్లారి గీతములు, ఘనరాగ గీతములు, శూళాదులు దేవర నామములు రచించారు. మాయా మాళవగౌళ రాగమును సంగీత శిక్షణకు ఆరంభ రాగంగా ఎంచినది ఈ ఆది గురువే. స్వభాషలో రచనలు చేసిన ప్రథములు వీరే. వీరి ముందర వారంతయు సంస్కృతము నందే రచించిరి. వీరి రచనలు మధ్యమకాల రచనలు. కొన్ని నాయకా, నాయకి భావములలతో రచింపబడినవి. వీరి మలహరి గీతములు ద్విధాతు ప్రబంధములు.

పురందర దాసు – త్యాగయ్య పోలిక:

ఇద్దరు ఋషితుల్యులు. ఇరువురు భార్యలు, ఇద్దరు 80 ఏండ్లు జీవించిరి. పురందర దాసు గారి అపూర్వ రాగాలు, ద్విజావంతి, శ్యామక్యూణీ మారవి, మధు మాదవి మొదలైనవి.

వాల్మీకి 24 వేల శ్లోకాలు, త్యాగయ్యగారి 24 వేలలో 750 ప్రచారంలో వున్నవి. శ్యామశాస్త్రి గారివి 300లో 70 మాత్రమే ప్రచారంలో వున్నవి.

దీక్షితులు 461, పురందర దాసు వారివి 4,75,000. అన్నమయ్య కంటే చిన్నవాడు. కర్నాటక సంగీత పితామహ అని బిరుదు గలదు. ముఖారి ‘వాసుదేవ’ కీర్తనలలో 4,75,000 రచించినట్లు పేర్కొనెను.

పురందర దాసు సంగీత విద్యార్థులకు గురువు, మార్యదర్శి, మహాభక్తాగ్రేసరుడు. త్యాగయ్య ఉపనిషత్తుల ధర్మములన్నియు, రామాయణ షట్కాండల సారమంతయు తన కీర్తనలు అందు యిమిడ్చి అజ్ఞానాంధకారమున సంకట పడుచున్న భక్తులకు పారమార్థికమై వెలుగును, జ్ఞానమును వెధజల్లి గొప్ప సేవ చేసి యున్నారు. త్యాగయ్య కీర్తనల సంపుటి ‘త్యాగోపనిషత్తు’ అని ఎల్లరలిచే కొనియాడబడుతోంది. ఇటులనే పురందర దాసు యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య ప్రబోధితములగు కీర్తనలను ‘పురందర బ్రహ్మోపనిషత్తు’ అనుట సమంజసము. సంగీత సభలయందు భక్తితో పాడుట ప్రధానము గాని ప్రక్క వాయిద్యములు ప్రధానం కావని తన కీర్తనల ద్వారా గాయకులకు సంగీత సభలకు, సంగీత రసికులకు చాటియున్నారు. ఈయన కీర్తన ‘కేళనో హరి తాళనో – తాళ మేళగ లిడ్డు ప్రేమవిలాద గాన’ అనునది ప్రక్క వాయిద్యము ఎంత అందంగా యున్న గాత్ర గానమున భక్తి, లేనిచో అది సంగీతమును వారి వినడు, భరించడు అని చాటుచున్నది.

అనగా భక్తి ప్రధానము గాని, ప్రక్క వాయిద్యములు ప్రధానము గావని దారి తప్పుచున్న సంగీత లోకమునకు అమూల్యమగు సందేశము ఈయన ఇచ్చెను.

వీరు హంపిలో ఒక మంటపములో నివసించిరి. ఇప్పటికే ఆ మంటపమునకు ‘పురందర దాస మంటపం’ అని పేరు. జీవితాంతములో వారు సన్యాశాశ్రమమును తీసికొని, రక్తాక్షి సంవత్సరం పుష్య అమావాస్యమున పరమ పదించిరి. కాని ఆయన రచనలు అజరామరమైనవి.

పురందర దాసుల వారి గీతముల యొక్క ప్రాముఖ్యత – వివరణ:

1.సంగీత రచనలో చాలా ముఖ్యమైనది గీతం. సంగీత విధ్యార్థులు సంగీత కళను ప్రారంభించి కొంత శిక్షణ పొంది వెనుక నేర్చుకొన తగినది. మధుర రచనల అన్నిటికి సాంకేతికమైన ఈ గీతం పునాదిగా ఏర్పడింది.

2.దీనిలో సంగీతం చాలా ఇంపుగాను, సాధారణముగా సులభముగా యుండును. రాగ భావముట్టిపడు చుండును. లయ ఒకే రీతి నడచును. గీతమునకు పల్లవి, అనుపల్లవి, చరణము అను భాగములు లేవు. సంగతులు ఉండవు. కష్ట సంచారములు ఉండవు. రాగ స్వరూపం. బాగా చెవులకు పట్టును. లయ సామాన్యము. స్వర భాగములో ప్రతి స్వరమునకును సరియైన అక్షరము సాధారణముగా సాహిత్య భాగములో యుండును. సాహిత్య భావము, దైవ భక్తి, గీతమును ఆపక మొదటి నుండి చివర వరకు నిలువక పాడటయే గీతమును పాడు పద్ధతి. అర్థము లేని పదములు – అయ్య, తియ్య, అయ్యం, వయ్యం మొదలగు పదములు కొన్ని గీతములలో వాడబడినవి. వీని వల్ల ఉపయోగం ఏది లేదు కాని గీత రచయితులు వీనిని తమ తమ గీతములలో వాడిన గీతము శోభించునను తలంపుతో వాడిరి. వీనినే ‘గీతాలంకారములు’ అని అందురు. కొన్ని ప్రసిద్ధ సంస్కృత శ్లోకములను గీతములు పరివర్తనము చేసి సంగీతములో వాడుకొనుట కలదు.

ఉదాహరణ: భైరవి రాగం ‘శ్రీ రామ చంద్ర’ యును; నాట రాగంలో ‘అమరీ కబరీ’ యగును.

3.గీతముల భాష సాధారణముగా సంస్కృతము, కన్నడం, భాండీర భాష. వాగ్గేయకారులు సంస్కృతము నందే రచనలను రచించుచుండిరి. కాని కొంత కాలం తరువాత ప్రాకృతములో ఒక భేదమైన భాండీర భాషలో రచించుట మొదలువెట్టిరి. ఇంక కొద్ది కాలము పిమ్మట ఇతర భాషలలో రచనలు రచింపబడినవి. ఇతర భాషలలో రచనలు ప్ర్రారంభమైన వెనుక భాండీర భాషలో తగ్గిపోయాయి. సరళీలు, జంటలు, అలంకారములు తరువాత గీతములు నేర్చుకొనవలెను.

గీతములలో  2 రకములైన గీతములు కలవు.

సామాన్య గీతములకు, లక్షణ గీతములకు తేడా:

సామాన్య గీతములు లక్షణ గీతములు
దైవమును ప్రార్ధించుట వర్ణించుట యుండును

గీత లక్షణములు అన్ని కలిగియుండునది దీనినే

సంచారి, లక్ష్యమని కూడా అందురు. నడక అక్షర కాలంగా యుండును.

ఉదా: భైరవి – శ్రీరామచంద్ర చ దృతాళం

సాహిత్యం ఆ గీతములో యుండు రాగ లక్షణమును తెలుపునదిగా వుండును. అనగా మేళకర్తనూ,

జన్యమా దాని పేరు, ఉపాంగమా, భాషాంగమా, అన్య స్వరమేది, వక్ర, వర్జ, న్యాస, గృహ జీవ, రాగాచ్ఛాయ, జాడవ, షాడవ సంపూర్ణ మొదలైన అంశములు చర్చించవలె.

సామాన్య గీతములకు, లక్షణ గీతములకు తేడా మరియొక పద్ధతిలో:

మూడు విధములు మూడు పద్ధతులు
A. పళ్ళారి గీతములు – వినాయకుడు, శివుడు, విష్ణువు – స్తోత్రము చేయుచు రచించినవి. ఉదా: 1. శ్రీ గణనాధ 2. కుంద గౌర 3. కెఱయ నీరను 4. పదుమ నాభా 5. భయసమయ దేవ మొదలగునవి. A. మేళ కర్త రాగము తీసికొను స్వరముల జాతిని తెలుపును
B.ఘనరాగ గీతములు: నాట, గౌళ, ఆరభి, శ్రీ మాళి. ఉదా: అమరీ కబరీ, సకల సురాసుర రేరే శ్రీ రామ చంద్ర, మీనాక్షి, జయ కామాకి, వందే మాధవ (వరాళి) B. మేళ కర్త నుండి జనించు ఉపాంగ రాగ వర్ణన
C. రాగమాలికా గీతములు: పురందర దాసు, రామా మాత్యుడు, పైడాల గురుమూర్తి శాస్త్రి C. మేళ కర్త నుండి జనించు భాషాంగ రాగం గూర్చి

సుళాదులుః గీతానికి దేశ్య పదమైన సూడ నుంచి గ్రహించ బడింది.

అమరికలో, లక్ష్మణంలో గీతమును పోలి వున్నది.

ఉదా: అచ్యుతానంద – కాశిరామక్రియ

రాగం ఝంపె పురందర రచన.

వేంకటమఖి 72 మేళ కర్త రాగములు, వాని చట్టము తయారు చేసిన మహాశయుడు. 72 రాగములలో లక్ష్మణ గీతములను రచించి యున్నాడు. ఇది సంగీత ప్రపంచానికి అఖండ సేవ. కాని ఇవి ప్రస్తుతము తమ విలువను కోల్పోయాయి.

72 రాగాంగ రాగ లక్ష్మణ గీత యొక్కొక్క దానిని సూత్ర, ఉపాంగ, భాషాంగ ఖండములని పేర్లు.

సూత్ర అనగా – సాహిత్యము ఆ రాగాంగము యొక్క స్వరములు, వాని వికృతి భేదములు. ఏ చక్రమునకు చెందినది. దాని వరుస సంఖ్య మొదలగు విషయాలు మాత్రము చర్చించ బడతాయి.

ఉపాంగ ఖండంలో రాగాంగ రాగములో జన్మించు ఉపాంగ రాగముల పట్టిక వ్రాయబడి వుండును.

భాషాంగ ఖండ మందు భాషాంగ పట్టిక వుండును. కొన్ని ఉపాంగములు భాషాంగములు అయినవి. కొన్ని రాగములు ఉపయోగమునందు లేవు .

గీతములు రచించుట, గీతములు పాడుట, ఒకప్పుడు చాలా గొప్పగా విద్వత్తుగా నెంచబడుచుండెను. పైడాల గురుమూర్తి 1000 గీతములు వ్రాసి ‘వెయ్యి గీతముల గురుమూర్తి’ అని బిరుధు నొందెను.

గీతములు రచించిన మహాశయులలో గోవింద దీక్షితులు, వేంకటమఖి, గోవిందాచార్యులు

రామామాత్యుడు, పురందర దాసు మొదలగువారు ముఖ్యులు.

పురందర దాసు వారి ‘కెరయ నీరను’ అను కన్నడభాషలో రచించిన గీతమునకు అర్థ తాత్పర్యము:

  • కెరయ – సరస్సు యొక్క
  • నీరను – నీటిని
  • కెరగె – ఆ సరస్సులోనే
  • జెల్లి – జల్లి
  • వరవ పడెదము – వరము లందిన వారి వలె
  • కాణిరో – కనుపించండి
  • హరియ – శ్రీ హరి యొక్క
  • కరుణ దాళ – కరుణ వల్ల
  • ఆధ భాగ్యత – కలిగిన భాగ్యమును
  • హరి సమర్పణ – ఆ హరికే సమర్పణ
  • మాడి – చేసి
  • బదుకిరో – బ్రతకండి
  • నోడిబదుకిరో – చూచి బ్రతకండి

తాత్పర్యము:

సరస్సు నందలి నీటిని సరస్సులోనే జల్లునట్టి వరము నీకుండునట్లు కనబడుచున్నది. శ్రీహరి యొక్క కరుణ వల్ల నీకీ అదృష్టము కలిగినది. దానిని మరల నీవు హరికే సమర్పణ చేసి బ్రతుకుము. విఠల రాయని చరణ కమలమును తిలకించి బ్రతుకుము. హరి కరుణ వల్ల నీకే అదృష్టము కల్గింది.

దానిని తిరిగి మనం భగవద్ కైంకర్యం చేసి, జన్మ సార్థకం చేసుకోవాలి. దాని కొరకై మన యీ ప్రయత్నాలు, పరిశోధనలు, పరిశీలనులు.

~

పురందర దాసు రచనలని దేవర నామమని, దేవర పదములని, దాసర పదగళు అని పిలుస్తారు. అవి శక్తి, వేదాంత, అద్వైతంతో కూడి వున్న రచనలు. 14, 15 శతాబ్దములలో వున్న రాగాలు అన్ని కుడా పురందర దాసుని కాలంలో వాడకలో వున్న రాగాలు.

ఎక్కువగా మాయామాళవ గౌళ రాగానికి ప్రాధాన్యత నిచ్చి ఆ రాగంలో ప్రారంభకులు కొరకు అన్ని రచనలు అనగా సరళీ స్వరములు, జంటలు, అలంకారాలు, గీతాలు, సూళాదులు, లక్ష్మి గీతాలు మొదలైనవి అన్ని రచించెను. మలహరి, సావేరి రాగాలలో కూడా చాలా రచనలు చేసెను. ఈ రెంటికి కొంచెం భేదం కలదు.

మలహరి రాగం (15వ మే॥ జన్యం)

ఆరోహణ: స రి మ ప ద స

అవరోహణ: స ద ప మ గ రి స

అనగా శుద్ధ రిషభము, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ద ధైవతము ఈ రాగంలో వస్తాయి.

సావేరి రాగానికి నిషాదం వుంది. మలహరిలో నిషాదం లేదు.

సావేరి రాగం (15వ మే॥ జన్యం)

ఆరోహణ: స రి  మ ప  ద స

            (శు)  (శు)   (శు)

అవరోహణ: స ని ద ప మ గ రి స

            (కా)               (రి)

సావేరి జాడవ సంపూర్ణ రాగం. వర్జ రాగం. గమక వరిక రక్తి రాగం. రి, మ, ద – రాగాచ్చాయ స్వరములు.

పదనిదప, సరిగరిస – అను ప్రయోగంలో నిషాదం, గాంధారం ఒక్క శృతి తక్కువగా పలుకుతున్నాయి. కాబట్టి, దీక్షితుల వారి ప్రకారం ఈ రాగము భాషాంగముగా పిలువబడింది. కాని ప్రస్తుతం ఉపాంగముగా వాడబడుతోంది.

నినిదమ గరిస – దమగరిస – రక్తి ప్రయోగములు.

నినిదమ గరిస – గదమగరిస – విశేష సంచారములు.

పార్శ్వదేవుని సంగీత సమయసారంలోను, నారదుని సంగీత మకరందంలోను ఈ రాగం పేర్కొనబడింది. ఇది చాల ప్రాచీన రాగం. కరుణ రసమును వెదజల్లు రాగం.

సంచారం:

సారీ  మపదపా – పాదమ – పాదనీ దా – పామపదా – మపాదప మగారి – రిమా రిమదా

మదరినీ దా మాగారి సారిగారి – సారిపమగారి – సారి గరిస సనిదాన – మదాసా .

దేశాక్షి రాగ లక్షణం:

ఆరోహణ: స రి గ ప ద స

అవరోహణ: స ని ద ప మ గ రి స (29 ధీర శంకరాభరణం లో జన్యం)

జాడవ, సంపూర్ణ వర్జ రాగం. గమక వరిక రక్తి రాగం. వ్యాప్తి చెందిన రాగం. ఉత్సాహము, వీర రసం ఇచ్చు రాగం. బిలహరికి అతి దగ్గర రాగం.

ఉదా: దేశాక్షి రాగం. గీతము తాళం. త్రిశ్ర త్రిపుట 7 అక్షరములు.

మగరి । మగ । రిస ॥ సనిద । సా । రేరే ॥

భయస మయ దేవ మెన్న దే వశ్రి

మగరి । సని । దప ॥ దదప । మగ । రిగ ॥

వేం క టా చల దే వ న ల్ల దె

గపద । పద । పద॥ సనిద । సా । సా ॥

కెరళ్ద మన దణి సువా రే రే

శ్రీ. పు । రం । దర ॥ విఠల । రాయ । శ్రీ ॥

చరణ కమ లఎ నంచి బదు కిరో

కెరళ్ద । మన । దణి । సువా । రే । రే ॥

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here