[dropcap]ప[/dropcap]చ్చని ఆ అడవి అందం…
ప్రకృతే పచ్చని చీరను కట్టిన చందం…
ఇక ఈ ప్రకృతిలో…
చిటపట చినుకులు…
మధురమైన ఆ చిలుకల పలుకులు…
కోయిలల కుహు కుహు గానాలు…
పిచ్చుకల కిచ్ కిచ్ రావాలు…
కొండలపై నుంచి ఎగసి దూకే జలపాతాలు…
ఆహార సంపాదనకై వెంటాడి వేటాడే జంతుసమూహాల తాపాలు…
కొండ గుహల్లో నివసించే పులులు, సింహాలు…
అవి బతకడానికి విడిచిపెట్టవు నరమాంసాలు…
మానవ మాత్రులను మించి ఉన్నాయి అక్కడ ఆత్మీయానుబంధాలు…
ఆ అడవిలో అనువణువున ఉన్నాయి ప్రేమానుబంధాలు…
తమ సంతాన అభివృద్ధికై అవి పడతాయి ఆత్రం…
తమ జాతిని రక్షించుకోవడానికి వెనకడుగు వేయవు ఏ మాత్రం…
స్వాతంత్రం కల్గిన సమానత్వం…
సాధ్యం కాదిక్కడ మతతత్వం…