ప్రకృతి సంపద

0
9

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఎన్.  హేమంత్ కౌశిక్ వ్రాసిన కథ ” ప్రకృతి సంపద“.  బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]కప్పుడు విష్ణు అనే వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంతో పాటు ఉద్యోగం కూడా చేసేవాడు. అతనికి పొలాలు కూడా ఉన్నాయి. పకృతి గురించి ఏ మాత్రం బెంగ లేదు. తను తినే తిండి ప్రకృతి నుండి వస్తుందని తెలిసినా ఆ విషయాన్ని కొట్టి పారేసేవాడు. అతనికి కష్టపడే తత్వం ఉంది. కాని ఎవరి మాట వినే వాడు కాదు. భార్య మాట కూడా వినడు. అలా తనే ఒంటరిగా వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వాడు. అడ్డు చెప్పే వారు లేక తన వ్యాపారం తగ్గుముఖం పట్టింది. దురుసుగా యజమానితో ప్రవర్తించడం వల్ల ఉద్యోగం కూడా పోయింది. తర్వాత తినడానికి తిండి లేక ఉద్యోగం కోసం వెతుకుతూ ఊరూరు తిరుగుతున్నాడు.

అలా తిరుగుతుంటే ఒక స్వామిజీ కనిపించాడు. అతనికి జరిగిన విషయం చెప్పాడు. స్వామిజీ ఒక సలహా ఇచ్చాడు. “మీకు పొలం ఉంది కాదా! దాని విత్తనాలు చల్లి నీరు పెట్టి పెరిగి పెద్దయ్యాక కోసి వచ్చిన పైకం నాకు ఇవ్వాలి” అన్నాడు. అప్పుడు విష్ణు అలాగే చేసాడు. అలాగే వచ్చిన డబ్బును మొత్తం స్వామీజీకి ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు స్వామీజీ “ఈ డబ్బు  మొత్తం నీదే నాయనా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించాల్సిన సంపద, ఉద్యోగం ఎక్కడో లోదు. ఈ ప్రకృతిలోనే ఉంది” అని చెప్పాడు. విష్ణుకు అర్థమైంది. ‘నేను ఒక వైపు ప్రకృతి ఇచ్చిన తిండి అంటూనే ప్రకృతి గురించి తెలుసుకోలేకపోయాను’ అనుకున్నాడు.

నీతీ: ప్రకృతికి మించిన తల్లి, సంపద మరోకటి లేదు.

ఎన్. హేమంత్ కౌశిక్, 6వ తరగతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here