ప్రాంతీయ దర్శనం -31: కాశ్మీరీ – నేడు

0
8

[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా కాశ్మీరీ సినిమా ‘ఐడెంటిటీ కార్డ్ – ఏక్ లైఫ్ లైన్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఐడెంటిటీ కార్డ్ – ఏక్ లైఫ్ లైన్’

[dropcap]2[/dropcap]014లో జమ్ముకశ్మీర్ లో సినిమాల పునరుద్ధరణ జరిగాక నిర్మించిన ‘ఐడెంటిటీ కార్డ్ – ఏక్ లైఫ్ లైన్’ అనే వాస్తవిక చలన చిత్రాన్ని రాజ్య హింస పైన తీశారు. లోయలో తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రారంభించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) విభాగం పాల్పడ్డ చర్యలు ఎలాటివి అనే అంశంతో రాహత్ కాజ్మీ అనే దర్శకుడు నిర్మించాడు. టియా బాజ్ పాయ్, ఫుర్ఖాన్ మర్చంట్, మానినీ మిశ్రా, ప్రశాంత్ గుప్తా, రఘువీర్ యాదవ్ లతో బాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు సౌరభ్ శుక్లా నటించారు.

ఇది వాస్తవిక సినిమానేగానీ, చూస్తూంటే సినిమా కోసం చేసిన స్క్రీన్ ప్లేలా గాక, నాటకం కోసం రాసినట్టనిపిస్తుంది. అధిక భాగం ఒకే ఎస్టీఎఫ్ కార్యాలయ భవనంలో దృశ్యాలు వాచికంగా సాగడాన్నిబట్టి అర్ధం జేసుకోవచ్చు. దీనివల్ల సినిమాల్లో వుండే చాలా సినిమాటిక్ ఎలిమెంట్లు కన్పించవు. దీనికి తోడూ విషయం పై శ్రద్ధకూడా పెట్టినట్టు వుండదు.

ఓ ముగ్గురు యువతీ యువకులు లోయలో డాక్యుమెంటరీ నిర్మించడానికి లొకేషన్లు చూడడానికి వస్తారు. వీళ్ళు మిలిటెంట్లని అనుమానించి ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుంటారు. కశ్మీర్‌లో ప్రయాణించాలంటే ఐడెంటిటీ కార్డులు కలిగి వుండడం ముఖ్యం. ఆ ముగ్గుర్లో నాజియా సిద్ధిఖీ (టియా బాజ్ పాయ్) అనే జర్నలిస్టు ఐడీ కార్డు పోగొట్టుకుంటుంది. ఎస్టీఎఫ్ ఎస్పీ శామ్యూల్ (విపిన్ శర్మ), అతడి ముగ్గురు కింది అధికారులూ ఆమెని ఇంటరాగేట్ చేయడం మొదలెడతారు. మిగిలిన ఇద్దరు అనుమానితులు నాజియా ఫేస్బుక్ ఫ్రెండ్ అజయ్ (ఫుర్ఖాన్ మర్చంట్), ఆమె గైడ్ రాజు (షోయెబ్ కాజ్మీ). ఇంటరాగేటర్స్‌లో గులాం నబీ (సౌరభ్ శుక్లా) చాలా కఠినంగా వుంటాడు.

 

సమస్య ఎక్కడొచ్చిందంటే ఇంటరాగేషన్‌లో కుళ్ళు జోకులేయడం, పరస్పరం అధికారులు తమ సొంత విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం, ఉత్తుత్తిగానే శాడిజం ప్రదర్శించడం చేయడంతో, కథ చెప్పడానికి తీసుకున్న రాజ్యహింస సమస్య మటుమాయమై పోయింది. ఈ సమస్యపై పాత్రల బలాబలాల సమీకరణ బాగానే వుంది. వాదాలే జరగవు. జర్నలిస్టు వర్సెస్ పోలీసులుగా రాజ్యహింసపై రసవత్తర డ్రామా రక్తి కట్టించకుండా ఎటో వెళ్ళిపోయారు. ధైర్యం లేకపోయైనా వుండాలి, విషయం లేకపోయైనా వుండాలి.

బావున్నదల్లా చివర్లో ఎండ్ టైటిల్స్‌లో శతాబ్దాల కశ్మీర్ చరిత్ర. 2014లో సినిమాల పునరుద్ధరణ జరిగాక వెంటనే అందుబాటులో స్క్రిప్టు లేదేమో, ఏదో నాటకాన్ని స్క్రిప్టుగా మల్చి సగర్వంగా వెండితెర కెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here