ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 3

0
12

[box type=’note’ fontsize=’16’] శ్రీపదాలు అనే సూక్ష్మ కవితా ప్రక్రియలో మూడు పాదాలు, పాదానికి మూడేసి పదాలు ఉంటాయి, ప్రతిపాదం అర్థవంతంగా ఉండడం లక్షణం. ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలలో ఇది మూడవ భాగం. [/box]

~
[dropcap]1[/dropcap](1_3 మౌనం)
మౌనం ఎన్నో మాట్లాడుతుంది,
మాటలకు విలువ లేనప్పుడు,
వేలప్రశ్నలకు జవాబు అవుతుంది!!

2
నడినిశిలో సంద్రపుఅలలు మంద్రం,
అది అంతర్దర్శనంలోని మౌనం,
ఎద చేరాల్సిన తీరమది!!

3
మౌనం నిశ్శబ్దం కాదు,
అది ఒక విప్లవం,
అత్యంత శక్తివంతమైన ఆయుధం!!

4(గతం)
గతంలోకి చూస్తే చాలు,
తొలిచిన గాయాలతో పాటు,
పూసుకున్న లేపనాలు తలపుకొస్తాయి!!

(5_7 పరవశం)

*5* కరిమబ్బుకు ఎంతటి *పరవశం*,
మలయానిలు కౌగిలికి కరిగిపోతుంది,
వాన జల్లై మైమరచి!!

6
నీ తలపుల వేకువలో..
తడిసిన పారిజాతాలైన కనులు,
*పరవశాల* ఊగే తనూవల్లరి!!

7
చినుకు *పరవశం* తలిరాకునడగాలి,
పుడమి పరిమళం రైతునడగాలి,
పూల పరిచయం గాలినడగాలి!

8(8-10 కల)
ఒక్క *కలా* రాదు,
నీ కలవరింతల అలజడి,
కనులు మూయనీయదుగా మరి!!

9
*కలల* అలలపై పయనం,
భయసంభ్రమాల ఊగిసలాట కదా,
దరిజేర్చే సరంగు మనసే!!!

10
*కల* కి తొందర ఎక్కువే,
కునుకు పడితే వస్తుంది,
కళ్ళు విప్పితే జారిపోతుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here