ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 4

0
10

[box type=’note’ fontsize=’16’] శ్రీపదాలు అనే సూక్ష్మ కవితా ప్రక్రియలో మూడు పాదాలు, పాదానికి మూడేసి పదాలు ఉంటాయి, ప్రతిపాదం అర్థవంతంగా ఉండడం లక్షణం. ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలలో ఇది నాల్గవ భాగం. [/box]

~

11(11_13కాలం)
[dropcap]అ[/dropcap]నంత పయనం *కాలానిది*,
ఒకపరి వసంతాలను సృజిస్తూ…
మరోతరి శిథిలాలను స్పృశిస్తూ!!

*12
*కాలం* మాయల మరాఠి,
ఉందనుకున్నవన్నీ దూరం చేస్తుంది,
లేనిదానిపై భ్రమలు పెంచేస్తుంది!!.

13
కాలానికెంతటి నిబ్బరమో కదా,
మహాభినిష్క్రమణలు,మహాప్రళయాలు,మహోత్సవాలు,
దేన్నీ ఆగి చూడదు

(14_16చెలిమి)
14
ఎంత మార్దవమా *చెలిమి*??
అలల ఒడిలో మునిగి,
పూలబుగ్గలు తడిమే గాలిది!!

15
మట్టితో *చెలిమి* అద్భుతం,
విత్తుకే కాదు మనిషికి,
మనసుకి, భవితకి కూడా!!

16
ప్రతి *చెలిమీ..* పూదారేంకాదు,
కొన్నిసార్లు మనసు గాయమౌతుంది,
కొన్నే హరివిల్లులై మురిపిస్తాయి!

17
మొక్క ప్రేమ మలయానిలమే,
తాకినా,చూసినా….చలువే
మెత్తగా..మనసుకు సాంత్వనగా!!

*18
కొన్ని బంధాలెప్పటికీ బాధలే?
ముళ్ళలాటి మాటలు గుచ్చుతూ…
విడివడనీయక మనసును మెలిపెడుతుంటాయి!!

19(19-21 సొగసు)
19
పసిమొలకల హరిత *సొగసు*,
పుడమికి వేసిన పచ్చలహారం,
జీవులకు అదే ప్రాణాధారం!!

*20
చినుకు *సొగసు* అపురూపం,
అరవిరిసిన పూబాల చెక్కిలిపై,
ఆరుగాలపు కష్టజీవి మేనిపై.

21
శ్రమకు ఎంత సౌందర్యం??
వన్నెపూలై , తీపిఫలమై ఫలిస్తుంది,
తరతరాలకు వారసత్వం అందిస్తుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here