ప్రేరణ

1
12

[వి. నాగజ్యోతి గారు రచించిన ‘ప్రేరణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నిషిలోని భావతరంగాలు
మాటవినక వెల్లువౌతూ
కవితో గేయమో తెలియని
అక్షర రూపమై నిలుస్తాయి

తనకు తానై తొలుత కవిననుకోడు
వేదన తగ్గించుకునే దారిలోనో
పట్టరాని సంతోషం కలిగినపుడో
లిఖించే ప్రతీ పదమూ
తనగుండే లోతుల్లోంచి వెలువడి
ఒక గేయమై అమరినపుడు
పరుల మనసును కదిలించినపుడు
తనకు కవి అనే బిరుదు లభిస్తుంది

దోషాలనెంచి సవరించే వారుంటే
ఆ రచన రంగవల్లికలా మెరుస్తుంది
కవి మనసు ఆనంద సాగరమౌతుంది
పరుష మాటలతో దూషిస్తే
మౌనరాగ మాలపిస్తూ
మానసిక వేదనతో ఆ కవే
తనదైన లోకంలో విహరిస్తాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here