ప్రియ వల్లభుడు

0
7

[dropcap]కు[/dropcap]లుకులు హంసలుగా
మువ్వలు ప్రేమ రవ్వలుగా
కన్నులు వెన్నల కలువలుగా
వంపులు ప్రణయ ధునిరేపే సెగలగా
ఎగసిపడే అందాలు
చెలరేగే వయ్యారాలు
చల్లే చందన సుగంధాలు
ఒడిసి పట్టాలనే … గోపికలకు
మాయా ఆనందాన్ని
భక్తి మాధుర్యాన్ని
మధువుగా పోస్తూ
వేణుగానం పాడుతున్నడా
గోపికా వల్లభుడు
అన్నట్టుంది
నా మానస బృందావనం
స్వప్నవేళన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here