పురాణం శ్రీనివాస శాస్త్రి సంస్మరణ సభ

0
8

[box type=’note’ fontsize=’16’] ఇటీవల పరమపదించిన ప్రముఖ రచయిత శ్రీ పురాణం శ్రీనివాస శాస్త్రి గారి సంస్మరణ సభ వివరాలు అందిస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామ్‌లాల్. [/box]

పురాణం శ్రీనివాస శాస్త్రికి (శ్రీశా) ఘన నివాళి:

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత, సాహితీ విమర్శకుడు, పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు పురాణం శ్రీనివాస శాస్త్రి (శ్రీ.శా.) సంస్మరణ సభ సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగింది.

శ్రీనివాస శాస్త్రి కుటుంబ సభ్యులు, కోకిలమ్ సాహితీ, సాంస్కృతిక వేదిక మరియు పాత్రికేయ మిత్ర మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు శ్రీశా మిత్రులు, అభిమానులు, అనుయాయులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు హాజరై అనుబంధాలు, అనుభవాలు, ఆప్యాయతల మధుర స్మృతులను పంచుకున్నారు.

జర్నలిజానికి, తెలుగు కథకి, సాహిత్యానికి శ్రీశా చేసిన సేవలను కొనియాడుతూ ఆయన అరుదైన వ్యక్తిత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని సహచరుల పట్ల ఆయన కనబరచిన ప్రేమను, అభిమానాన్ని మరోసారి నెమరు వేసుకున్నారు.

రాజీ లేని జీవితాన్ని గడిపిన శ్రీనివాస శాస్త్రి జీవన స్మృతులని తలచుకొన్న ఆహుతులు తమ అభిమానాన్ని తమ హృదయాలలో వున్న బాధని అందరితో పంచుకుని శ్రీశాకు ఆత్మీయనివాళి ఘటించారు.

సీనియర్ పాత్రికేయులు ఎం. రంగాచార్యులు సంధాన కర్తగా వ్యవహరించిన ఈ సంస్మరణ సభకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు, ప్రసిద్ధ రచయితలు, డిజిటల్ మీడియా మిత్రులు, చిత్ర ప్రముఖులు, క్రీడా రంగ విశ్లేషకులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రముఖ ఛానల్ TRI నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. పూర్తి కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో కూడా పొందుపరచటం విశేషం.

ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, ప్రెస్ అకాడెమి మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేంద్ర, సీనియర్ పాత్రికేయులు తాడి ప్రకాష్, తల్లావజ్జుల శివాజీ, లలితా ప్రసాద్, మారేమండ సీతారామయ్య, ప్రసాద రెడ్డి, రాంలాల్, ముక్కామల చక్రధర్, వసీరా, బాలాంత్రపు రామచంద్ర వెంకోబ్, ప్రముఖ వైద్యులు, లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) అశోక్, క్రీడా విశ్లేషకులు సి.వెంకటేష్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ రామ్ ఫణి, ప్రముఖ రచయిత నాగసూరి వేణుగోపాల్, నవభూమి ఎడిటర్ అజీద్, రామారావు, గొడుగు యాదగిరి, వాకా మంజుల, కోట ప్రసాద్, నూతక్కి రాఘవేంద్ర రావు, పూసపాటి శ్రీనివాసు, రామారావు, పడాల రాములు, దేవరకొండ మురళి, జాగర్లమూడి రామకృష్ణ, రామకృష్ణ రావు, రోయ్యూరు శేషసాయి, గురు ప్రసాద్, ముని కుమార్, గోపినాథ్, కె. కృష్ణమూర్తి, హంస వర్దిని, ప్రసూన, విష్ణుప్రియ, జయశ్రీ, ఇంకా చాలా మంది అభిమానులు, మిత్రులు, కవులు, కళాకారులు హాజరయ్యారు.

వీరందరికి పురాణం శ్రీనివాస శాస్త్రి గారి కుటుంబం తరపున, కోకిలమ్ సాహితి సాంస్కృతిక వేదిక తరపున పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం.

రామ్‍లాల్, సీనియర్ జర్నలిస్ట్, రచయిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here