పుస్తకం..!!

0
12

[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘పుస్తకం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


1
శరీర పటుత్వానికి వ్యాయామమెంత అవసరమో
మానసిక ఆరోగ్యానికీ అంతే ప్రాముఖ్యం
మనిషి మూర్తిమత్వానికి,విశ్వాసానికి
మనుగడలో పఠనం ఒక వ్యాయామమే

2
వజ్రాన్ని సానబడితే దగధ్ధగాయమానంగ మెరసినట్లు
మస్తిష్కాన్ని మథిస్తే
మహోజ్వలిత విజ్ఞానం సొంతమవుతుంది
సానబడితే వజ్రం మెరసినట్లు
పుస్తక పఠనంతో సమాజంలో వజ్రంలా మెరవవచ్చు..

3
హస్త భూషణంగా పుస్తకం మహనీయుల చేతుల్లో
ప్రత్యక్ష సాక్షులుగా వీక్షిస్తున్నాం ప్రధాన కూడళ్లలో
చిరిగిన చొక్కా అయినా ఫరవాలేదు కానీ
ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో కందుకూరి మాటలు చర్వితచరణం

4
మనిషిని ఉన్నతంగా ఉంచేదే పుస్తకం
పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేకుండా నిర్మించుకున్నదే
ప్రతీ బాల్యం సరస్వతీ నమస్తుభ్యమని
అక్షర శ్రీకారంలో అమ్మ ఆశీస్సులు పొందాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here