పుట్ట బంగారం – పుస్తక పరిచయం

0
10

[dropcap]తా[/dropcap]ను ఏం రాసినా, ఏం చేసినా తనను నడిపించే జీవధాతువు సూర్యాపేట మూలాల్లో ఉందని, అందుకే ఈ పుస్తకం పేరు ‘పుట్ట బంగారం’ అయిందని పుస్తక రచయిత ‘పుట్టిన నేలకి సత్కారం’ అన్న ముందుమాటలో ప్రస్తావించారు.

ఈ పుస్తకంలో మొత్తం 33 సాహిత్య వ్యాసాలున్నాయి. ఆళ్వారుస్వామి, దాశ‌ర‌థి, రాజా బ‌హ‌ద్దూర్ వెంక‌ట రామరెడ్డి, అమృత లత, బోయ జంగయ్య, అన్నవరం దేవేందర్, యాకూబ్, ముదిగంటి సుజాతారెడ్డి వంటి సాహిత్యకారుల విశ్లేషణాత్మక వ్యాసాలతో పాటు, ‘ప్రత్యేక తెలంగాణ ఉద్య‌మ సాహిత్య‌ం’, ‘తెలంగాణ న‌వ‌ల‌ – ఇతివృత్త వైవిధ్యం’, ‘తెలంగాణ్ కథ – గ్లోబలైజేషన్’, ‘తెలుగులో ప్రాంతీయ అస్తిత్వవాద విమర్శ’ వంటి పలు వైవిధ్యభరితము, ఉపయుక్తమూ అయిన సాహిత్య వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం చివరలో కె.పి.అశోక్ కుమార్ రచించిన ‘తెలంగాణ సాహిత్య చరిత్రకారుడు’, వంశీకృష్ణ రచించిన ‘పదునైన ఆలోచనాధార’ వ్యాసాలను ‘మలి మాటలు’గా పొందుపరిచారు.

పుట్ట బంగారం

తెలంగాణ సాహిత్య వ్యాసాలు
రచన: గుడిపాటి
ధర 120 రూపాయలు
పేజీలు 192
ప్రతులకు పాలపిట్టబుక్స్‌, నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాద్‌, అనేక, ప్రగతిశీల బుక్‌సెంటర్‌, ఏలూర్‌రోడ్‌, విజయవాడ, నవతెలంగాణ, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here