పువ్వుల పడతులు

0
14

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పువ్వుల పడతులు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]ట్ల భాగాలతో నేను చాలా బొమ్మలు చేశాను. వాటిలో కొన్నింటిని మీకు పరిచయం చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈ రోజు మీకు పూలతో చేసిన అమ్మాయిల్ని చూపిస్తాను. పూలతో రకరకాల జంతువుల్ని కూడా చేశాను. కానీ ఈరోజు మీకు అమ్మాయిలనే పరిచయం చేస్తాను. మా అమ్మాయిల పేర్లు కూడా చెపుతాను సరేనా!

మొక్కల సామ్రాజ్యంలో రెండు రకాలుంటాయి. పుష్పించే మొక్కలు ఒక రకం కాగా, పుష్పించని మొక్కలు మరొక రకం. పుష్పించే మొక్కలకే పువ్వులు పూస్తాయి. పువ్వులలో అండాశయాలు, కేసరాలు రెండూ ఉంటాయి. కేసరాలలో ఉండే పుప్పొడి అండాలను చేరి ఫలవంతమై కాయగా రూపొండుతుంది. పరాగ సంపర్కం, పర పరాగ సంపర్కాలు జరిగి పువ్వులన్నీ కాయలుగా మారతాయి. పువ్వులంటేనే మొక్కల్లోని ప్రత్యుత్పత్తి అవయవాలు. అందమైన ఆరర్షణ పత్రావళిలో రంగు రంగుల్లో అతి సుందరంగా ఉంటాయి. మరి కొన్ని పువ్వులు సువాసనలు వెదజల్లుతూ అందర్ని ఆకర్షిస్తాయి. పువ్వులను ఇష్టపడని వారుంటారా చెప్పండి.

నూరు వరహాల పాపను పరిచయం చేస్తున్నా. నూరు వరహాల పూలు గుత్తులుగా పూస్తాయి. ఒక్కొక్క గుత్తిలో సుమారు వందపూలు ఉండటం వలన దీనికి నూరు వరహాల చెట్టు అవి పేరు వచ్చింది. మా ఇంట్లో ఎర్రని రంగు, లేత గులాబీ రంగు నూరు వరహాల చెట్లున్నాయి. తెలుపు రంగులోనూ, నిండు గులాబీ రంగులోనూ పూస్తాయి. మా చెట్ల పూలతో ఎన్నో బొమ్మలు చేశాను గానీ ఈ రోజు మాత్రo మా పాపనే చూపిస్తున్నా.

పూలు పూసినపుడే కాదు మొగ్గలుగా కుండా అందంగా ఉంటాయి. ఇంట్లో ఒక్క చెట్టున్నా పూలు నిండుగా కనిపిస్తాయి. అందుకే పార్కుల్లో బాగా పెంచుతారు ఇది పదడుగులు పెరిగే పొదలాంటి చెట్టు గుబురుగా పెరుగుతుంది. అనపకాయలు అనే చిక్కడు కాయల్లాంటి కాయల్ని ముఖానికి వాడాను. దీనికి పారిజాతం ఆకుల్ని చేతులుగా పెట్టాను. కళ్ళ కోసం పారిజాతం గింజల్ని పెట్టాను. పీస్ లిల్లీ చెట్ల పూల మధ్యలో లావుగా ఉండే కేసరాల గుచ్చాల్ని కోసి పెట్టుకున్నాను. వీటితో నోరును పెట్టాను. నోని ఫ్రూట్ కొమ్మలు తీసుకొచ్చి కొప్పులో పెట్టాను. చెవులకు లోలాకులుగా దానిమ్మ కొమ్మల్ని పెట్టాను. కుచ్చుల గౌను తొడుక్కుంది కదా! దీని కోసం నూరు వరహల పూల గుత్తుల్ని వరసగా అమర్చాను. మధ్య మధ్యలో బంతి పూల రెమ్మల్ని సైతం చల్లాను. మొహాన విత్తనం బొట్టుతో అందంగా తయారు అయింది మా పాప.

కాగితం పూల కన్యను పరిచయం చేయనా! కాగితం పూల చెట్టు ఇంటికి ఎంత శోభనిస్తుందో తెలుసు కదా. ఒక్కసారి కొమ్మను పెడితే ఇల్లంతా అల్లుకుంటుంది. తెలుపు, ఎరుపు, పింక్, పసుపు రంగుల్లో పూలు గుత్తులుగా పూసి నేలకు సప్త వర్ణాలు అద్దుతాయి. మా ఇంట్లో ఒకప్పుడు ఉండేవి గానీ ఇప్పడు లేవు. రోడ్డు పక్కన పూసే పూలను తెచ్చుకుని ఈ కన్యారత్నాన్ని సృష్టించాను.

ఫ్రెంచి నావికాదళ అధికారి ‘బొగనే విల్లే’ దీనిని మొదటి సారిగా కనుగొనటం వలననే దీనికి ‘బొగన్ విలియా’ అనే పేరు వచ్చింది. 1768వ సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో పుట్టింది. చెట్టుకు ముళ్ళు ఉంటాయి. పైర్ ఎగబాకే జాతికి చెందిన మొక్కలు ఆకులు దాదాపుగా గుండ్రంగా ఉంటాయి. సాధారణంగా ఇళ్ళకు, ఉద్యావనాలకు కంచెగా ఈ మొక్కల్ని వేసుకుంటారు. రోడ్డుకిరువైపులా రంగు రంగుల పుష్పాలతో దారి వెంట వెళ్ళే వాళ్ళకు అందంగా కనిపిస్తాయి. చింత గింజలతో అమ్మాయి శరీరాన్ని తయారు చేశాను. నలుపురంగు ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్పటానికే నలుపు రంగును ఎంచుకున్నాను. అమ్మాయి వేసుకున్న స్కర్టును కాగితం పూలతో నింపాను. రెండు జడలు పైకి కట్టుకున్నది. జాకెట్ కోసం ఆకుపచ్చ రంగు ఆకుల్ని ఉపయోగించాను. చింత గింజల కళ్ళు, ఆకుల జూకాలు పెట్టుకున్నది. ఒక అందమైన పూలచెట్టు కింద నిలబడి బస్సు కోసం ఎదురుచూస్తున్నది.

గుల్ మొహర్ గుమ్మను చూపిస్తా మీకిష్టప్పుడు. ఈ చెట్టు పూలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండి చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి. ఇది పెద్ద వృక్షంలా పెరుగుతుంది. ఈ పూల కేసరాలు వంపుతిరిగి ఉంటాయి. పుప్పొడి చివరకు ఉంటుంది కదా. ఈ కేసరాలలో పిల్లలు ఆటలాడి ఎవరి పుప్పొడి తెగిపోతే వారు ఓడినట్లుగా ఆడుకుంటారు. కోడి పుంజుల పందేలు అని ఈ ఆటకు పేరు. అందువలన ఈ చెట్టు పేరు ‘తురాయి’ అయినప్పటికీ కోడిపుంజుల చెట్టుగా పిలవబడుతున్నది. ఒకానొక కాలులో చెట్టునిండా పువ్వులే కనిపిస్తూ ఉంటాయి. ఆకులు మొత్తం రాల్చేసి ఉంటుంది. కోడి పుంజుల కాయలతో మొహాన్ని, శరీరాన్ని చేశాను.

గుల్ మొహల్ పూల రెక్కలతో చిన్న గౌను కుట్టి పాపకు వేశాను. రెండు పిలక జడలు వేశాను. చేతుల కోసం ఎండు కొమ్మల్ని వాడాను. కాళ్ళకు సైతం కొమ్మల్నే పెట్టాను. తురాయి పూల పొడుగు కేసరాలను బూట్ల కోసం ఉపయోగించాను. పిల్ల స్కూలుకు రెడీ అయింది. పంపించేసి వస్తాను.

దీపం చేత బట్టుకుని వెళుతున్న మా అమ్మాయి తన మొహం చూపించడానికి సిగ్గుపడింది. సరేలే అని వెనక నుంచి ఫోటో తీసేశాను తెలియకుండా, ఫ్లోరల్ డిజైన్ లంగా, జాకెట్ వేసుకుని ముస్తాబయింది ముచ్చటగా ముడి వేసుకుని బంతిపూలు పెట్టుకున్నది నల్లని తల వెంట్రుకల కోసం సపోటా గింజలు పెట్టుకున్నది.

శరీరమంతా తెల్లని వెంటిలేటర్ వేస్టుతో తయారుచేశాను. ఇందాక పిల్ల నలుపు రంగులో ఉన్నది కదా ఈ పిల్ల తెల్లగా ఉండాలని చేశాను. మా పాప లంగా లోని ఫ్లోరల్ డిజైన్ కొరకు మా ఇంటి కుండీల్లో ఉన్న పువ్వులనింటినీ కోసుకొచ్చాను. శంకుపూలు, బిళ్ళ గన్నేరు, గులాబీలు, బంతులు, చెమంతులు కోసేసరికి చెట్లన్ని బోడిగా అయిపోయాయి. తెలుపు, వంగరంగు శంఖు పూలను లంగాకు లైన్లుగా కుట్టాను. బిళ్ళగన్నేరు పూలను మధ్య మధ్యన కుట్టాను బంతులు, చేమంతుల్ని విడదీసి రెక్కలుగా చేసి లంగా మొత్తం పరిచాను. గులాబీ, రెక్కల్ని బార్డర్‌గా పెట్టాను. జాకెట్ కూడా మ్యాచింగ్ ఉండాలి కదా! అందుకే ఫ్లోరల్ డిజైన్‌లో కుట్టాను.

ఇప్పుడు బంతిపూల బాలికను చూపిస్తున్నాను. నాకున్న ఐదుగురు ఆడపిల్లల్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పిల్ల ఎప్పడూ ‘బంతి, చామంతీ’ అని పాట పాడుకుంటూ తిరుగుతుంది. ముద్దబంతి మోముతో ముద్దుగా ఉంటుంది. పొలాల గట్లలో ముద్ద బంతిపూలు ఎంత దూరం నుంచి చూసినా ఆకట్టుకుంటాయి.

శంఖుపూల కళ్ళను పెట్టాను. సీతమ్మ వారి జడ కుచ్చులను ఈ పిల్ల గౌనుకు కుచ్చులుగా కుట్టాను. కుచ్చుల గౌను అడుక్కుంది. బిళ్ళ గన్నేరు పూల డిజైనును గౌను పై భాగంలో కుట్టాను. ముద్ద బంతి పూల ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్నది. మా పిల్లల అంద చందాలను వర్ణించాను మీరందరూ కూడా ఆశీస్సులoదించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here