‘రాజనాల బండ’ పుస్తక ఆవిష్కరణ సభ నివేదిక

0
6

[dropcap]తి[/dropcap]రుపతికి చెందిన ‘ఈ తరం కవితా వేదిక’ ఆధ్వర్యంలో ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు రచించిన ‘రాజనాల బండ’ పుస్తకావిష్కరణ 27 నవంబరు 2022 ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ భవనంలో ఆవిష్కరించారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్.వి. యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర నాయుడు మన మూలాలు మన పల్లెల్లో దాగివున్నాయన్న విషయం మరువరాదని అన్నారు.  ఈ విషయం భావితరాలకు చేరాలంటే సాహిత్యమే సరైన మార్గమని ఆయన సూచించారు. గతాన్ని మరిస్తే భవిష్యత్‌ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి కథల ద్వారా గతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్రాంత ఆచార్యులు నాగోలు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ కథల్లోని సామెతలు, నానుడులు, పలుకుబడులు కథల ద్వారా గ్రంథస్థమై స్థిరమైన స్థానాలను తెలుగు భాషలో కలిగి ఉంటాయన్నారు. ఈ పుస్తకంలోని తిరుపతి జిల్లా తూర్పు పశ్చిమ ప్రాంతాల జీవన విధానం, ఆయా ప్రాంతాల సంసృతి, చరిత్రలో నిలిచిపోతాయాని కొనియాడారు.

ఆత్మీయ అతిధి శ్రీ పద్మావతి మహిళా కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కృష్ణవేణి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా యాస, మాండలీకంలో చక్కటి రచనలు చేసే రాజుగారు సమాజ శ్రేయస్సు కోరే రచనలు మరిన్ని రాయాలని రచయితకు సూచించారు.

చిత్తూరు జిల్లా గ్రామీణ నేపథ్యం, సామాజిక స్థితిగతులు తన కథలకు ఊపిరని రచయిత ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు చెప్పారు. చిత్తూరు జిల్లా యాస ఎంతో ఆకర్షణీయమైనదని, ఇందులో మరిన్ని మంచి రచనలు వస్తే పాఠకుల నుంచి విశేషమైన స్పందన ఉంటుందని అన్నారు.

ఈతరం కవితా వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షుత వహించారు.

ఈ కార్యక్రమంలో రచయితలు కిట్టన్న, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, మౌని, పి.సి వెంకటేశ్వర్లు, గాలి గుణశేఖర్, ఆముదాల మురళి, కె.వి మేఘనాథ్ రెడ్డి, పల్లిపట్టు నాగరాజు, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here