రామ సాహిత్యం

1
17

[శ్రీరామనవమి సందర్భంగా – రామాయణానికి సంబంధించిన, రాముడిపై రచించిన పుస్తకాల పాక్షిక జాబితాను అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో రామాయణాన్ని విశ్లేషిస్తూ రామాయణమనే మహా సముద్రం నుంచి ఆణిముత్యాలను గ్రహిస్తూ, అనేక గ్రంథాలు వెలువడ్డాయి. ఆ రామ సాహిత్య మహా సాగరం నుంచి కొన్ని పుస్తకాల జాబితా ఇది. ఈ జాబితా సంపూర్ణం కాదు, సమగ్రమూ కాదు. రామ సాహిత్య మహా సాగరంలోని ఒక నీటి చుక్కలో సహస్రం వంతు మాత్రమే ఈ జాబితా.

గోరఖ్‍పూర్ ప్రెస్ వారు ప్రచురించిన వాల్మీకి రామాయణం అనువాద పుస్తకాలు, పుల్లెల శ్రీరామచంద్రుడు వచనంలో అనువదించిన రామాయణం అన్ని భాగాలు, ఇంకా రామచరిత మానస్ పుస్తకాలు, రాజాజీ సరళంగా రచించిన రామాయణం, ఉషశ్రీ రామాయణం ఇలా అనేకానేక రామాయణ సంబంధిత పుస్తకాలున్నాయి. అవికాక ఇంకొన్ని పుస్తకాల జాబితా ఇది. ఇంకా అనేక విభిన్నమయిన, విశిష్టమయిన పుస్తకాలున్నాయి. అవి మరోసారి.

~

  • ఆదికావ్యంలోని ఆణిముత్యాలు – వేదాంతం శ్రీపతి శర్మ – మోహన్ పబ్లికేషన్స్ – వెల ₹ 250.00
  • సుందర కాండము (మూలము) – గీతా ప్రెస్, గోరఖ్‍పూర్ – వెల ₹ 50.00
  • సంపూర్ణ హనుమత్ చరితము – అనుసృజన: విశ్వనాథం సత్యనారాయణ మూర్తి – రామకృష్ణ మఠం, హైదరాబాద్ – వెల ₹ 100.00
  • రామచన్ద్ర ప్రభూ (శతకం) – సామవేదం షణ్ముఖ శర్మ – ఋషిపీఠం కమ్యూనికేషన్స్ పై. లిమిటెడ్ – వెల ₹ 50.00
  • తెలుగు హిందీ రామ కావ్యాలలో సీత – పుట్టపర్తి నాగపద్మని – అన్ని ప్రముఖ కేంద్రాలు – వెల ₹ 75.00
  • దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు – గబ్బిట దుర్గా ప్రసాద్ – సరసభారతి, ఉయ్యూరు – వెల ₹ 200.00
  • శ్రీరాముడు జగదభిరాముడు – ఒంటిమిట్ట శ్రీరామ కథ – ఆలపర్తి పిచ్చయ్య చౌదరి, కడప – వెల అమూల్యం
  • యోగ వాసిష్ఠ రత్నాకరం – శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి – శ్రీ శుక బ్రహ్మాశ్రమం – వెల అమూల్యం
  • శ్రీమద్వాల్మీకి రామాయణ సుందరకాండ – వచనం: శ్రీమతి గండూరి విజయలక్ష్మి, హైదరాబాద్, ఫోన్: 9440352171 – వెల ₹ 150.00
  • రామాయణంలోని రహస్యాలు సాయి భగవానుని ధర్మ వివరణలు – సంకలనం: ఓరుగంటి సీతారామయ్య శాస్త్రి, ప్రశాంతి నిలయం – వెల ₹ 50.00
  • శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవత పద ప్రహేళికలు – నండూరు గోవిందరావు, హైదరాబాద్, ఫోన్: 9849801490 – వెల ₹ 1200
  • శ్రీమద్రామాయణము – ప్రశ్నోత్తర మాలిక – నండూరు గోవిందరావు, హైదరాబాద్, ఫోన్: 9849801490 – వెల ₹ 200.00
  • రామకథా రస వాహిని – భగవాన్ సత్యసాయిబాబా – ప్రశాంతి నిలయం – వెల ₹ 80.00
  • శ్రీరామ కర్ణామృతం – కల్లూరు అహోబలరావు – నా పుస్తకం, ఫోన్: 9493271620 – వెల ₹ 80.00
  • శ్రీ రాఘవేంద్ర రామాయణం (ఉల్కలు) – నూతక్కి రాఘవేంద్ర రావు – ఫోన్: 9866651094 – వెల ₹ 150.00
  • రామాయణాలు కల్పనలు – డా. అయల సోమయాజుల గోపాలరావు, విజయనగరం – ఫోన్: 9440485762 – వెల ₹ 1400
  • రామాయణ వైజయంతి (వ్యాసాలు) – కందాడై రామానుజాచార్య, భారత ధార్మిక విజ్ఞాన పరిషత్, గుంటూరు – వెల అమూల్యం
  • శ్రీ రామాయణం – శ్రీరమణ – నవోదయ పబ్లిషర్స్ –
  • పోతనగారి రామాయణం – అక్కిరాజు రమాపతి రావు – నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ – వెల ₹ 120.00
  • సుందరకాండ – వ్యాఖ్యానం: ఘండికోట బ్రహ్మాజీ రావు, విశాఖపట్టణం, ఫోన్:0891-2746187 – వెల ₹ 120.00
  • ఆధ్యాత్మ రామాయణము – అనువాదం: ముదునూరి వెంకట రామశర్మ – గీతా ప్రెస్, హైదరాబాద్ – వెల ₹ 130.00
  • శ్రీ పద చిత్ర రామాయణము (రెండు భాగాలు) – విహారి, హైదరాబాద్ – ఫోన్: 9848025600
  • శ్రీమద్రామాయణ కల్పవృక్షము – శ్రీరాముని మనుజ ధర్మము (సిద్ధాంత వ్యాసము) – కావూరి పాపయ్య శాస్త్రి, భద్రాచలం – వెల ₹ 75.00
  • రామకథాసుధ (కథా సంకలనం) – సంచిక సాహితి ప్రచురణలు – ఫోన్: 0866-2436643 వెల ₹ 175.00
  • శ్రీమద్రామాయణం మూల శ్లోకం సరళ తెలుగు తాత్పర్య సహితం – శ్రీ జయ లక్ష్మీ పబ్లికేషన్స్, హైదరాబాద్. ఫోన్: 040-23050986 వెల ₹2,550.00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here