రామం భజే శ్యామలం-15

0
7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశ చరిత్రను కొలవడానికి.. నిర్ధారించడానికి మన దేశంలో నెహ్రూవియన్ చరిత్రకారులు కొన్ని పరికరాలను సూత్రీకరించారు. ఈ దేశ చరిత్రను తెలుసుకోవాలంటే.. మన పూర్వీకులు కలప, రాగి రేకులు, పెద్ద పెద్ద రాళ్లపై రాసిన శాసనాలు, స్తంభాలు, రాతిగోడలు, మట్టిపాత్రలు, లోహ పాత్రలు.. రావిచెట్టు పట్టలు, తాటాకులపై రాసిన రాతల ద్వారా తెలుసుకోవచ్చని.. ఆ విధంగానే తాము చరిత్రను కనుగొని భారతదేశ ఆధునిక తరాలకు అందించామని ‘ఎలీట్’ సంస్థలనుంచి వచ్చిన మేధావులు తమ ఉద్గ్రంథాల్లో పేర్కొన్నారు. చరిత్ర తెలుసుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయని కూడా ఉద్ఘాటించారు. ఇర్ఫాన్ హబీబ్, రోమిలాథాపర్ వంటి చరిత్రకారుల భారతదేశ ప్రాచీన చరిత్ర గ్రంథాల్లో ఈ ఉపకరణాల గురించి బాగానే చర్చించారు. కామన్‌గా మన పూర్వీకులు రాసిన రాత ప్రతులు చరిత్ర అధ్యయనానికి పనికివస్తాయని కూడా థాపర్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. రాయడం తెలియని కాలంలో కూడా మనకు చరిత్ర ఉన్నదని కూడా అంగీకరించారు. అదే సమయంలో తాము చరిత్ర నిర్మాణం చేసినదంతా పురావస్తుశాఖ ఆధారాలమీద నిర్మించుకొన్నామని.. అక్కడ దొరికిన శాసనాలు, మట్టిపాత్రలు.. లోహ ఫలకాలు, ఇంకా.. ఇంకా.. లభించిన పనిముట్లతో చరిత్ర ఇలాగే జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి తాము భారతదేశ ప్రాచీన చరిత్రను డిసైడ్‌ చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నది.

ఈ ప్రాచీన చరిత్రలో వీళ్లు ఎంతవరకు అన్వేషించారు అంటే.. ప్రశ్నార్థకమే. మన దేశ చరిత్ర యావత్తూ.. మొదట్లో ఆర్యుల దండయాత్రతో మొదలైందని చెప్పారు. ఇదికూడా వాడెవడో యూరప్ చరిత్రకారుడు చెప్పింది తిరగరాసుకోవడమే తప్ప వీళ్లు కొత్తగా పరిశోధించి.. తవ్వకాలు జరిపి.. మట్టికుప్పల్లో దిగి సాధించిందేమీ లేదు. థాపర్లు కానీ, హబీబ్‌లు కానీ.. ఏసీ గదుల్లో పురావస్తుశాఖ తెచ్చిపెట్టిన అవశేషాలను.. ఒకసారి విజిట్‌చేసి.. (మనం అప్పుడప్పుడూ మ్యూజియంకు పోతామే.. అలాగ).. ఎవడో మెకాలేయిట్‌లు రాసిన రాతలను తమకొచ్చిన భాషలో రాసేసి.. పుస్తకాలు అచ్చేసి పద్మభూషణ్‌లు కొట్టేస్తారు.. సరే.. ఇదంతా కడుపు చించుకొంటే కాళ్లమీదకు వస్తుందన్నట్టుంటుంది. వీళ్లు మొదట ఆర్యుల దండయాత్రతో మాత్రమే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని చెప్పారు. కొన్నాళ్లకు (దాదాపు 1920లలో) సింధులోయ నాగరికత బయటపడేసరికి.. ఇక తప్పక కొంచెం వెనుకకు పోయారు. అంతాకలిపి మన చరిత్ర ఐదువేల ఏండ్లకు మించి లేదని నిర్ధారించారు.

సరే.. కాసేపు మనకు తెలిసింది ఇంతే అనుకొందాం. కానీ ఎవరో ఒకరు సదరు థాపర్‌ను ఈ తాళపత్రాలు, పుస్తకాలు, మౌఖిక సాహిత్యం.. ఇంకా.. వీటిలోపల దాగిఉన్న చరిత్ర సంగతి ఏమిటని ప్రశ్నించారట. అందుకు ఆమె చెప్పిన మాటేమిటంటే.. (ఇది కూడా లిఖితపూర్వకంగా రాసుకొన్న మాటలే)..‘ ‘పాత పుస్తకాల్లో లేదా రాత ప్రతుల్లో’ రాసిన లిపి అంతా పాళి లేదా ప్రాకృత భాషలో ఉన్నది. మిగతావి సంస్కృతంలో ఉన్నాయి. దక్షిణభారతంలో తమిళ లిపి ఉన్నది. దేవనాగరి లిపిలో ఉన్న ఈ సంస్కృతం మనం అంతగా చదువలేం. ఎందుకంటే ఇది మనం ఇండ్లల్లో మాట్లాడే భాష ఎంతమాత్రం కాదు. నిత్యజీవితంలో మనం వాడే పరిస్థితి ఉండదు. మనం దాన్ని నేర్చుకొనేదాకా చదవడం, అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కావాలి.’ ఇవీ రోమిలా థాపర్ తన ప్రాచీన భారతదేశ చరిత్ర అన్న పుస్తకంలో రాసుకొన్న మాటలు.

Clues can be of many kinds. The most commonly used are manuscripts. Manuscripts are ancient books, written either on dried palm leaves or the thin bark of the birch tree or on paper.

(Generally the latter kind have survived, though books written on paper are not as old as the others.) Some of the languages in which they very old books are written are languages which we in India do not use in everyday life anymore. such as Pali and Prakrit. Others are written in Sanskrit and Arabic. Which we still study and use in our religious ceremonies although we do not speak them at home. Yet others are written in Tamil, a language which IS spoken in South India and whose literature goes back to an early period. These are called Classical Languages and the history of many parts of the World recorded in various classical languages In Europe, ancient manuscripts were often written in Greek and Latin in western Asia they were written in Arabic and Hebrew, and in china, classical Chinese was used. The writing or the scripts in which the manuscripts of India are written resemble the modern scripts. For example, you could probably read the script in Sanskrit manuscripts are written in the Devanagari script.. Although you will not understand what was written until you learn Sanskrit. But the writing which was used two thousand years ago looks different and in order to read that you would have to be specially trained.

భాష అనేది నిత్య పరిణామశీలి అని నేను అనుకొంటున్న భావన. పండితులెవరైనా విశ్లేషిస్తే బాగుంటుంది. కాల పరిణామ క్రమంలో భాష అనేకరకాలుగా మార్పు చెందుతూ వస్తుంది. ఈ మార్పు ఆహ్వానించదగింది. అలా అని ఫలానా భాష మనకు తెలియదు కాదు కాబట్టి అందులో ఉన్నదంతా అర్థం లేనిదని కొట్టిపారేయడం.. కాలగర్భంలో కలిపేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కాదు. ఈమె చెప్పినట్టే ప్రపంచ చరిత్రను గమనిస్తే ప్రాచీన ఐరోపా భాషలు, గ్రీకు, లాటిన్, హిబ్రూ, అరబిక్, చైనీస్ వంటి ప్రాచీనభాషల్లోనే రాసి ఉంటాయి. విఖ్యాత చరిత్రకారుల ఈ లిపిని అధ్యయనంచేసి వాటిలోని చరిత్రను బహిర్గతం చేయబట్టే వాటి ఉనికి ప్రపంచానికి తెలిసింది. కానీ, మనదేశంలో మాత్రం చరిత్రను చదువడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. ఏ భాషను నేర్చుకోవడానికైనా కచ్చితంగా శిక్షణ కావలసిందే కదా.. పుట్టినప్పుడు అమ్మ ట్రైనింగ్ ఇవ్వకుండా మాతృభాషైనా నేర్చుకోగలమా? మరి సంస్కృతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన నొప్పేమిటి? పోనీ ఆ భాష బ్రహ్మపదార్థం కానే కాదు కదా.. దేశంలో హిందీ, మరాఠీ లిపి కూడా దేవనాగరి లిపే కదా. సంస్కృత తద్భవాలు లేకుండా దేశంలోని ఏ భాష అయినా ఉన్నదా? అటువంటప్పుడు ఆ భాషను అధ్యయనం చేసి.. అందులో ఉన్న విజ్ఞానాన్ని, చరిత్రను వెలికితీయాల్సిన బాధ్యత సోకాల్డ్ చరిత్రకారులపై లేదా? వీళ్ల సంకుచితత్వం వల్ల మన దేశ చరిత్ర హరప్పా, మొహంజొదారోకు, ఆర్యుల దండయాత్రకు, అశోకుడికి పరిమితమైపోయింది. అశోకుడు, ఔరంగజేబు తప్ప ఈ దేశంలో గొప్ప రాజులెవరూ లేరని పాఠాలు చదువుకొనే దుస్థితి నెలకొన్నది. చరిత్ర అధ్యయనానికి మన ప్రాచీన సారస్వతాన్ని ప్రామాణికంగా తీసుకోకపోవడం వల్ల.. కేవలం పాశ్చాత్య, మార్క్సిజం దృష్టికోణంలోనే రాయడం వల్ల ఈ దేశానికి అపారమైన నష్టం వాటిల్లింది. మేము మార్క్సిస్టు చరిత్రకారులం.. మేము పాశ్చాత్య దృష్టికోణంలో చరిత్రను అధ్యయనం చేస్తాం అంటూ వీళ్లు బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు. చరిత్రను రచించడం వేరు.. అధ్యయనం చేయడం వేరు. చరిత్ర మన భూతకాలాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా విప్పిచెప్పేది. జరిగిన ఘటనలను లభించిన అనేక రకాల ఆధారాలను పరిశోధించి యథాసంభవంగా చెప్పడం చరిత్రకారుల విధి.

దాన్ని విశ్లేషించుకొనేవాళ్లు విశ్లేషించుకొంటారు. చరిత్రకారులంటే చరిత్రకారులే. అంతేకానీ, సిద్ధాంతాల ప్రాతిపదికన, వేరే దేశాల దృష్టికోణంలో చరిత్ర రాయడమనేది ఉంటుందా? మేము మార్క్సిస్టు చరిత్రకారులం అనడంతోనే.. వారు ఒక ప్రత్యేక దృష్టితో చరిత్రను విశ్లేషిస్తున్నారని తేలిపోవడంలేదా? చరిత్రకారులైన వారికి ఇది అర్హత ఎలా అవుతుంది? భారతీయ చరిత్రకు మూలాధారమైన సంస్కృతాన్ని మృతభాషను చేసి.. అసలైన చరిత్రను కనుమరుగు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో మతానికి ఉన్న ప్రమేయమేమిటో నాకు అస్సలు అర్థం కాదు. మిగతా ప్రాంతాలకంటే భిన్నంగా అత్యంత ప్రాచీనమైన చరిత్ర ఉన్నదని చెప్పుకోవడానికి నామోషీ దేనికి.. మనదగ్గర ఏమీలేదు.. ఎవడో వచ్చి మనకు అన్నీ నేర్పాడు అంటూ ఆత్మన్యూనతాభావనతో బతుకులు వెళ్లమార్చాల్సిన అవసరం ఏమున్నది.

ఆ మధ్య ఓ తెలుగు దినపత్రికలో ఓ సంపాదకుడు వేదాల్లో అన్నీ ఉన్నాయిష అంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు కదా.. మీ ప్రభుత్వం (ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి) వాటిలో ఉన్న అంశాలపై పరిశోధనలకు అనుమతించవచ్చుకదా అని రాశారు. ఆయన రాసింది వెటకారంతోనే కావచ్చు. కానీ.. ఆయన అన్నది నిజమే కదా.. రోజూ పొద్దున లేస్తే.. ఆ వేదం అది చెప్పింది.. ఈ వేదం ఇది చెప్పింది.. పురాణాల్లో అవి ఉన్నాయి.. ఇవి ఉన్నాయి అని చెప్పే బదులు.. నిజంగా వాటిలో ఏవైనా ఉన్నాయా? లేక సోకాల్డ్ పాశ్చాత్యులు చెప్పినట్లు ఇవన్నీ మిథ్యేనా? ఒకసారి తేల్చేస్తే ఈ సమస్యే ఉండదు కదా..

ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలని ఉన్నది. ప్రపంచంలో ప్రామాణిక భౌభౌతిక, ఖగోళ శాస్త్రవేత్తలు భూమి పుట్టుక కాలాన్ని 420 కోట్ల సంవత్సరాలని తేల్చి చెప్పారు. ఇవాళ ప్రపంచానికి అత్యంత ప్రామాణికమైన శాస్త్రీయమైన భూమి కాలగణనమిది. ఈ విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన అవసరం ఏమీలేదు. ఈ పరిశోధన ఫలితాలన్నీ 19వ శతాబ్దపు అర్ధభాగం తరువాత వెలువడ్డాయి. 1856లో కొన్ని శిలాజాలు దొరికిన అనంతరం ఒక చర్చ ప్రారంభమైంది. 1891లో డచ్‌కు చెందిన ఒక జియాలజిస్ట్ యూజిన్ డుబోయిస్ అనే ఆయన భూమి పుట్టుక మానవ పరిణామ క్రమాన్ని విశ్లేషించాడు. ఆ తరువాత 1925 సంవత్సరానికి కానీ రేమండ్ డార్ట్ అనే ఆయనకు ఆస్ట్రేలియాఆఫ్రికన్‌లకు సంబంధించిన ఓ శిశువు పుర్రె దొరకడంతో దానిపై పరిశోధన చేసి భూమిపై జీవుల పరిణామ క్రమం మానవులుగా పరిణతి చెంది 8 కోట్ల సంవత్సరాలై ఉంటుందని తేల్చారు. అద్భుతం. దీన్ని అంగీకరించాల్సిందే. ఇదేసమయంలో భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనవని భావిస్తున్న వేదాల్లో, సిద్ధాంత కౌముది వంటి శాస్త్ర గ్రంథాల్లో సృష్టి పరిణామ క్రమాన్ని విశ్లేషించారు. భూమధ్య బిందువునుంచి రోదసిలో ఉన్న గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో లెక్కించారు.

కాకపోతే.. వాళ్లు బ్రహ్మకాలమన్నారు.. మనువులన్నారు.. దేవతలన్నారు.. రాక్షసులన్నారు. వాటిని కాస్త పక్కన పెడదాం. సూర్యసిద్ధాంతం ప్రకారం మనకు కలిశకం ప్రారంభమై 5120 సంవత్సరాలు (2020 నాటికి) అయింది. ఆ విధంగా లెక్కలు కట్టినప్పుడు భూమి పుట్టి 432 కోట్ల సంవత్సరాలైందని సిద్ధాంత కౌముది చెప్తున్నది. ప్రస్తుతం వైవస్వత మనువు కాలం నడుస్తున్నది. ఇది ప్రారంభమై 12 కోట్ల 5 లక్షల 33 వేల 120 సంవత్సరాలు జరిగిందని పేర్కొంటున్నది. మనకాలంలోని ప్రస్తుత జియాలజిస్టులు పూర్తి మానవ పరిణామం ప్రారంభమై 8 నుంచి 9 మిలియన్ సంవత్సరాలై ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారి ఈ రెండింటిని గమనించండి. మన పూర్వికులు దేవనాగరి లిపిలోని సంస్కృతభాషలో రాసిన పలు గ్రంథాలలో చెప్పిన ఈ గణాంకాలకు.. ప్రస్తుతం మనం వేటినైతే అత్యంత ప్రామాణికంగా భావిస్తున్నామో.. ఆ గణాంకాలకు పెద్ద అంతరమంటూ లేనే లేదు. ఇప్పటి జియాలజిస్టులు ఒక అంచనాగా భూమి పుట్టుకను 420 కోట్ల సంవత్సరాలు అంటే.. మనవాళ్లు ఆక్యురేట్‌గా 432 కోట్ల సంవత్సరాలు అని చెప్పారు. మానవుడి పరిణామాన్ని కూడా ఇదే పద్ధతిలో విశ్లేషించారు. ఈ రెండింటినీ సమగ్రంగా పరిశీలించి.. పరిశోధించి ఒక నిర్ధారణకు వస్తే.. దాని ఫలితం ఈ ప్రపంచానికి పనికిరాదా? మనవాళ్లు చెప్పింది నిజమా అబద్ధమా? లేక ఊహాపోహలా.. అన్నది తేల్చవచ్చు కదా… ఇందుకు ఈ చరిత్రకారులకు ఉన్న అభ్యంతరం ఏమిటి? తప్పయితే తప్పని చెప్పండి.. ఒప్పయితే ఒప్పుకోండి.

సూర్యసిద్ధాంత గ్రంథంలోని గోళాధ్యాయంలోని 29 నుంచి 32 శ్లోకాల్లో భూ స్వరూపాన్ని వివరంగా చెప్పారు.

బ్రహ్మాండ మేతత్సుషిరం యత్రేదం భూర్భువాదికం
కటాహాద్వితయంచైవ సంపుటం గోళాకృతిః

బ్రహ్మాండ మధ్యే పరిధి వ్యోమ కక్ష్యాభి ధీయతే,
తన్మధ్యే భ్రమణం భానాం తదదోహః క్రమాత్తధా

మందామరేద్య భూపుత్ర సూర్య శుక్రేందు జేందవ:
పరిభ్రమం త్యధోధస్థా సిద్ధ విద్యాధరా ఘనాః

మధ్యే సమంతా దండస్య భోగోళో వ్యోమ్ని తిష్టతి
భిభ్రాణః పరమాం శక్తిం బ్రాహ్మణో ధారణాత్మికాం

భూమి సమఘన వృత్తంలా గోళాకృతిలో ఉన్నది. రోదసి మధ్యలో ఆకాశ కక్ష్య ఉన్నది. దాన్ని వ్యోమ కక్ష్య అంటారు. మధ్యలో నక్షత్ర కక్ష్య ఉంటుంది. అందులో మేషం తదితర 12 రాశులు, శని, కుజ, గురు, సూర్య, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలు ఒకదాని దిగువన మరొకటి ఉన్నది. దానికి దిగువన నక్షత్ర గణాలతో కూడిన భూగోళము ఉన్నది అని సూర్య సిద్ధాంతం చెప్తున్నది.

ప్రస్తుతం మన సోలార్ సిస్టమ్‌ను ఒకసారి గమనిస్తే.. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. భూమధ్య బిందువునుంచి సూర్యుడికి ఉన్న దూరం లక్ష బ్రహ్మాండ యోజనాలని ఇదే ఇదే సూర్య సిద్ధాంత గ్రంథం లెక్కగట్టింది. ఒక బ్రహ్మాండ యోజనం అంటే.. బ్రిటిష్ వాడి లెక్కల ప్రకారం 30 మైళ్ల 533 గజాల ఒక అడుగు అన్నమాట. ప్రస్తుత శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం భూమికి, సూర్యుడికి మధ్యనున్న దూరం 148 మిలియన్ కిలోమీటర్లు. భారతదేశంలో ఈ లెక్కల పుస్తకాలు రాసి వేల ఏండ్లే అయింది. అథమ పక్షం యురోపియన్ల నుంచి థాపర్ల దాకా చెప్పిన ఊకదంపుడు చరిత్ర ప్రకారం చూసుకొన్నా.. క్రీస్తుకు పూర్వం 1400 అవుతుంది. అట్ల లెక్కలేసుకొన్నా.. పాశ్చాత్యుల కంటే చాలాకాలం క్రితం చెప్పినవే కదా ఈ అంశాలు. ఫర్ సపోజ్ వీళ్లు రాసిన చరిత్రే నిజమని ఒక విఘడియ అనుకొందాం. వీళ్లు చెప్పే ఆర్యులనేవాళ్ల శకం 1400 బీసీలో మొదలైనాక వెయ్యేండ్లకు జ్ఞానోదయమైందని చెప్తున్నారు కదా.. అప్పుడు రాసినా కూడా ఈ చరిత్ర సోకాల్డ్ ఆధునిక చరిత్రకారులకంటే చాలా చాలా పాతదే అవుతుంది కదా.. ఇది ప్రామాణికమా కాదా నిర్ధారించండి. యురోపియన్ల నిర్ధారణకు ఉన్న ప్రామాణికత ఏమిటి? మన పూర్వీకుల గణాంకాల్లో లేని ప్రామాణికత ఏమిటి? స్పష్టంగా తేల్చిచెప్పాలి కదా.. ఒకవేళ మన పూర్వికులు కట్టిన లెక్కలు కరెక్టే అయితే.. ఆయా పుస్తకాల్లో ఉన్న రాజుల చరిత్రలు అబద్ధాలని, మిథ్య అని ఎలా చెప్పగలం? ఇంకొక ఉదాహరణ చెప్పాలని ఉన్నది. ఆ మధ్య హిస్టరీ చానల్ చూస్తున్నప్పుడు ప్రపంచంలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఒక ధారావాహిక ప్రసారమవుతున్నది. అందులో భారతదేశానికి సంబంధించిన ఓ ప్రాచీన గ్రంథంలో పేర్కొన్న అంశాలపై ఇద్దరు (వాళ్లు సైంటిస్టులని చానల్ చెప్పింది.) మేధావులు ఆన్‌స్క్రీన్ పరిశోధన చేస్తున్నారు. వారి చేతిలో ఉన్నది అగస్త్యుడు అనే ఓ ఋషి రాసిన అగస్త్య సంహిత. ఇందులో ఆయన విద్యుదుత్పత్తి గురించి ఒక ఫార్ములా రాశాడు. ఇది కూడా దేవనాగరి లిపిలోనే ఉందని గమనించ ప్రార్థన. వాళ్లకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో కానీ.. మొత్తంమీద నేర్చుకొన్నారు. ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన పరిశోధన వివరాలు. ఇందులో దాపరికం ఏమీలేదు. ఎవరైనా సరే హిస్టరీ చానల్‌లో సెర్చ్ చేస్తే బహిరంగంగానే అందుబాటులో ఉన్నది. అగస్త్య సంహిత కూడా దొరుకుతుంది. ఈ సైంటిస్టులు అగస్త్యుడు రాసిన ఫార్ములా ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించారు. అందులో చెప్పినదాని ప్రకారం ఒక రాగి రేకు, ఒక జింక్ రేకు తీసుకొన్నారు.

రెంటినీ ఒకవైపు కింద చిన్న ప్లేట్‌లో ఉంచి.. మరోవైపు అనుసంధానం చేశారు. సదరు ప్లేట్‌లో కాపర్ సల్ఫేట్ రసాయనాన్ని వేశారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న మల్టీ మీటర్‌తో పరీక్షించారు. వీటి ద్వారా ఒక వాట్ విద్యుత్ జనరేట్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని ఒప్పుకుంటారా? లేదా? వాళ్లు చేసింది జిమ్మిక్ అనుకొందాం. మీరు అదే ప్రయోగం చేయండి.. ఆయా శాస్త్రీయ గ్రంథాల్లో ఉన్న ఫార్ములాలను ప్రయోగాత్మకంగా పరీక్షించండి.. అవన్నీ చెత్త అని తేలితే.. అక్కడే డస్ట్‌బిన్‌లో పడేయండి. ఫార్ములాలు విజయవంతమైతే.. ఈ దేశానికి ఆ విజ్ఞానాన్ని పంచిపెట్టండి. ఇవి చేయడానికి ఈ దేశ చరిత్రకారులకు, సైంటిస్టులకు, పాలకవర్గాలకు ఉన్న అభ్యంతరమేమిటి? వీటిలోని గణాంకాలు, శాస్త్రీయమైన ఫార్ములాలు సరైనవో కాదో.. అత్యున్నత పౌరపురస్కారాలు అందుకొన్న మేధావులు.. కేవలం ‘శాస్త్రీయత’పైనే ఆధారపడి మాట్లాడే మార్క్సిస్టు మహానుభావులు తేల్చండి. వీళ్లు ఆ పని ఎంతమాత్రం చేయరు. ఎందుకంటే ఇవన్నీ నిజాలని.. చారిత్రక సత్యాలని కచ్చితంగా తేలుతాయి కాబట్టి. అన్యాయంగా, అసాధారణంగా మన ప్రాచీన చారిత్రక కాలాన్ని ముందుకు జరిపి వీళ్లు ఇంతకాలంగా చెప్తున్న దానికంటే అత్యంత ప్రాచీనమైనదని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. అవి తేలితే.. ఆయా గ్రంథాల్లోని సమస్త భారతీయ రాజుల చరిత్రలన్నీ కాలమానాలతో సహా వాస్తవాలని నిర్ధారణ చేయాల్సివస్తుంది కాబట్టి. అదే జరిగితే.. ఇంతకాలం ఊదరగొట్టి.. బాకాలూదిన చరిత్రనంతా చెత్తబుట్టలో పారేయాల్సి వస్తుంది కాబట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here