రామం భజే శ్యామలం-23

1
10

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]అ[/dropcap]సాధారణంగా మగధ సామ్రాజ్యాభిషక్తుడైన అశోకుడు.. అధికారాన్ని హస్తగతం చేసుకొన్న ఎనిమిదేండ్లకు కళింగపై యుద్ధానికి వెళ్లాడని యురోపియన్ చరిత్రకారులు.. వారి రచనలను అనుసరించిన భారతీయ చరిత్రకారుల మాట. కళింగ యుద్ధం తరువాత అక్కడ జరిగిన రక్తపాతం చూసి విచలితుడైన అశోకుడు.. బౌద్ధం స్వీకరించి.. ప్రశాంతచిత్తుడై భారతదేశాన్ని పరిపాలించాడని చెప్తారు. వీరు చెప్పిన ప్రకారం – నేను ఇంతమందిని హతమార్చినందుకు చాలా శోకిస్తున్నాను.. ఇకపై ఎలాంటి యుద్ధాలు చేయను. జంతువులతో సహా వేటినీ హింసించను – అని శపథం పూనాడు. తన కిచెన్‌లో రోజూ రెండు నెమళ్లు.. ఒక జింక లేదా మరో జంతువును చంపి వండించే ప్రక్రియను కూడా నిలిపివేస్తున్నా అని ప్రకటించాడు. వీటన్నింటికీ ప్రధానమూలం దేవానాంప్రియ, పియదస్సి అనే పేరుతో ఉన్న శాసనాలు.. వాటి గురించి శ్రీలంక పవిత్ర గ్రంథాలైన అశోకావదానం, దివ్యావదానం, దీపవంశం తదితరాలు. వీటన్నింటిలో కూడా అశోకుడు ఏవేవో అద్భుతాలు చేసినట్టుగా ఎక్కడా కనిపించదు. ఆయన ఇన్ని వేల మందిని చంపించాడు. అసంఖ్యాకంగా ఊచకోత కోశాడు. నరకం నిర్మించాడు.. చివరకు భార్యనూ, మంత్రులనూ. అధికారులనూ, సోదరులనూ చంపించాడు.. కానీ చివరకు పశ్చాత్తాపం ప్రకటించి.. ఊరికో బౌద్ధ స్తూపాలు నిర్మించాడు కాబట్టి.. ఒక్కసారిగా భారతవర్షంలో అంతకుముందు కానీ.. ఆ తరువాత కానీ ఇంతటి గొప్ప రాజు లేడని నిర్ధారించారు. తన రాజ్యాన్ని అశోకుడు లేదా పియదస్సి పరిపాలించిన తీరు, చేపట్టిన కొన్ని సంస్కరణల గురించి కొన్ని శాసనాల్లో ప్రస్తావన ఉన్నది. కళింగయుద్ధం తరువాత విపరీతంగా బాధపడిన అశోకుడు మొట్టమొదట ప్రతిన బూనింది హింసను విడనాడుతానని. తరువాతి పాయింట్ ఏమిటంటే.. తనకు శిక్షించే శక్తి ఉన్నప్పటికీ.. అందరిపట్లా క్షమాగుణంతో వ్యవహరిస్తానని.. సంస్కరణవాదిగా మారిపోతానని చెప్పాడు. ఇక యుద్ధాల జోలికి పోకుండా రాజ్యాభివృద్ధిపై దృష్టిపెట్టి.. సుపరిపాలన అందించాడని మన చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అప్పటినుంచి శ్రీలంక, సిరియా, గ్రీస్‌తో సహా దూతలను పంపించి.. బౌద్ధమత ప్రచారం చేశాడు. శ్రీలంకకు తన కూతురు, కొడుకు సంఘమిత్ర, మహేంద్రను పంపించి అక్కడ బౌద్ధమతాన్ని సుప్రతిష్ఠం చేశాడు. కాందహార్‌లో లభించిన ఒకానొక శాసనంలో తాను అన్ని మతాల ప్రజలను సహనంతో.. సమరసభావంతో చూస్తానని చెప్పినట్లుగా ఉన్నదని చరిత్రకారుల మాట.

all men are my children. As for my own children, I desire that they may be provided with all the welfare and happiness of this world and of the next, so did I desire for all men as well అని పేర్కొన్నాడు. అశోకుడు ప్రజల పట్ల న్యాయము, క్షమ, దయ, కరుణతో మెలిగేవాడు. ఆయన మంత్రిమండలిలోని మంత్రులు రాజ్యమంతటా తరచూ పర్యటిస్తూ ప్రజల సంక్షేమాన్ని గురించి విచారిస్తూ.. వాళ్ల ఆకాంక్షలను అక్కడికక్కడే తీర్చేవారట. ప్రజలకు, జంతువులకు దవాఖానలు కట్టించి మందులు సరఫరాచేశారట. అశోకుడు అధికారాన్ని చెలాయించాడు. పాటలీపుత్రం నుంచే ఏకపక్ష పరిపాలన కొనసాగించాడు. పెద్ద ఎత్తున అధికారులను నియమించి పన్నులు వసూలు చేశాడు. పెద్ద ఎత్తున గూఢచారులను నియమించి వారితో తానే నేరుగా సంప్రదిస్తూ.. రాజ్యంలో ఏం జరుగుతున్నదీ తెలుసుకొన్నాడు. వ్యవసాయాన్ని పెంచాడు. అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేశాడు. వాటికి ఇరుపక్కలా చెట్లు నాటించాడు. దాహం తీర్చుకోవడానికి బావులు తవ్వించాడు. ఇదీ అశోకుడి రాజ్యంలో పరిపాలన తీరుతెన్నులు.

ఇక్కడే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అశోకుడికి ముందు వరకు మౌర్య సామ్రాజ్యంలో పరిపాలన వికేంద్రీకృతంగా సాగిందని మన చరిత్రకారులే చెప్తున్నారు. ఆయన తాత మౌర్య చంద్రగుప్తుడి కాలంలోనూ.. తరువాత తండ్రి బిందుసారుడి కాలంలోనూ పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అంతెందుకు.. భారతీయ రాజుల చరిత్ర అశోకుడికి ముందు.. అశోకుడికి తరువాత ఎక్కువ మంది రాజుల పరిపాలన అధికార వికేంద్రీకరణ.. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే జరిగింది. అంతెందుకు.. బిందుసారుడి హయాంలో సాక్షాత్తూ అశోకుడు ఉజ్జయిని గవర్నర్‌గా పనిచేశాడు. అతని మరో సోదరుడు తక్షశిల గవర్నర్‌గా ఉన్నాడు.

ఇది చరిత్రకారులు చెప్తున్నమాటలే. తక్షశిలలో సోదరుడు సరిగా అడ్మినిస్ట్రేషన్ చేయడంలేదంటే.. అశోకుడు అక్కడికి వెళ్లి వ్యవహారాన్ని చక్కబెట్టారన్నదీ చరిత్ర పుస్తకాల్లో రాసినదే. అశోకుడు మాత్రం ఎవరినీ ఏ దశలోనూ నమ్మలేదు. ఏ విషయాన్నీ తన కనుసన్నల్లోంచి తప్పించుకోకుండా అనుక్షణం జాగ్రత్తపడ్డాడు. పరిపాలన అన్నది సెంట్రలైజ్‌డ్‌గా.. ఏకపక్షంగా కొనసాగడం గొప్ప రాజుల లక్షణమేమో.. చరిత్రకారులో.. రాజకీయ, రాజ్యాంగ నిపుణులు చెప్పాలి. హైదరాబాద్ స్టేట్‌లో ప్రతి హెల్త్ బ్రాంచ్‌కి ఒకటి చొప్పున నిజాంరాజు హాస్పిటల్ కట్టించాడు. ఇప్పటికీ మనం వాటినే వినియోగిస్తున్నాం. రోడ్ల పక్కన చెట్లు నాటించడమే కాదు.. ఏకంగా రాష్ట్రమంతటా బాగ్‌లు నిర్మించి సమతుల శీతోష్ణస్థితి కల్పించాడు. ఇప్పటికీ అనేక డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లు.. హైదరాబాద్‌ను సురక్షితంగా భావిస్తున్నాయంటే.. పీఠభూమి కావడంతో పాటు.. నిజాం కల్సించిన అనుకూల వాతావరణం కూడా కారణమే. మరి నిజాంను దుర్మార్గుడైన రాజుగా ఎందుకు తిడుతున్నాం? ఎవరైనా పొగిడితే.. ఆ పొగిడేవాడిని కూడా తెగుడుతున్నాం కదా.. అశోకుడి కంటే నిజాం ఏరకంగా తక్కువ.. పైగా హిందూరాజు ఎంతమాత్రం కాదాయె.. ఏ విధమైన క్లాసిఫికేషన్ ఈ ఇద్దరు రాజుల మధ్య ఉన్నదో చరిత్రకారులకే తెలియాలి.

కళింగయుద్ధం తరువాత అశోకుడు హింసను విడనాడాడన్నది కూడా అబద్ధమే. ఇందుకు ఆయన రాజుగా నిర్మించిన నరకమే మరో సాక్ష్యం. ఈ నరకంలో ప్రధానంగా ఐదురకాల శిక్షలు ఉండేవని అశోకావదానం చాలా స్పష్టంగా చెప్తున్నది. పాట్నాలో ఇప్పటికీ అశోకుడి నరకం తాలూకు ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. పాట్నాలోని శీతల్‌దేవి ఆలయాన్ని ఆనుకొని అశోకుడి బావి కనిపిస్తుంది. దీన్ని ఆగమ్‌కువా పేరుతో ఉన్న ఈ బావి అశోకుడి నరకంలోని ఒక భాగంగా చెప్పుకొంటారు. ఇది 105 అడుగుల లోతు బావి. బావి ఉపరితలంపై వర్తులాకారంలో 43 మీటర్ల మేర చుట్టూ గోడ కట్టి ఉన్నది. దీనికి 8 కిటికీలు ఉన్నాయి. ఈ బావికి పాతాళంలోకి దారి తీస్తుందని చెప్తారు. జియో హైడ్రలాజికల్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ బావిలోకి నీటి సరఫరా పక్కన ఉన్న గంగానది నుంచి లింక్ చానల్ ద్వారా అవుతుంది. ఇదీ ఈ నరకం కథ. ఈ బావిలోకి అశోకుడు వందలమందిని తోసేశాడట. తన సోదరులందరినీ ఈ బావిలోనే వేసి జలసమాధి చేశాడని కూడా చెప్తారు. జైన సన్యాసి సుదర్శన ను ఈ బావిలో పడవేశాడని కథనం.

అశోకుడు గొప్ప రాజు అంటూ ఎంతగా హైప్‌ చేసి చెప్పారంటే.. వింటుంటేనే ఆశ్చర్యమేస్తుంది. దీనికి హేతుబద్ధత ఏమిటన్నది ఎంతగా ఆలోచించినా అర్థం కాదు. కళింగయుద్ధం తరువాత ఒక్కసారిగా మారిపోయాడని చెప్పడమే ఒక మిథ్యాకథనం. ఇందుకు మరొక్క ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉన్నది. అశోకుడికి ఐదుగురు భార్యలున్నారు. ఏకపత్నీవ్రతుడేమీ కాదు. ఇదేమీ గొప్పరాజు కావడానికి డిస్‌క్వాలిఫికేషన్ కాదు. అదే సమయంలో అతనికి కామాశోకుడు అన్న ప్రసిద్ధమైన పేరు కూడా ఉన్నది. ఈ కామాశోకుడు, చండాశోకుడు లాంటి విశేషణాలన్నీ కళింగయుద్ధానికి ముందువే తప్ప ఆ తరువాతవి కావని చరిత్రకారుల ఉవాచ. అశోకుడికి పద్ధెనిమిదేండ్ల వయసులో మొదటిసారి వివాహమైంది. ఆమె పేరు దేవి. ఈమె ఏ రాజవంశానికి చెందిన అమ్మాయి కాదు. విదిశలో ఒక వ్యాపారి కూతురు. పెండ్లయిన రెండేండ్లకు కొడుకు పుట్టాడు. అతని పేరు మహింద, ఐదేండ్లకు కూతురు సంఘమిత్ర పుట్టింది. వీళ్లిద్దరే శ్రీలంకకు వెళ్లి బౌద్ధాన్ని ప్రచారంచేశారు. ఈమెను వివాహం చేసుకున్నప్పుడు అశోకుడు రాజు కాదు. ఉజ్జయిని గవర్నర్‌గా ఉన్నాడు. ఇతను పాట్నా (పాటలీపుత్రం)కు తిరిగి వెళ్లేటప్పుడు భార్యను అవంతిలో వదిలేసి వెళ్లిపోయాడు. పాట్నా నుంచి బయటకు వెళ్లినప్పుడు అశోకుడు కొంతకాలం మారువేషంలో తిరిగాడట. ఆ సమయంలో కళింగ రాజ్యానికి వెళ్తే.. అక్కడ ఒక జాలరి కూతురైన కార్వాకిని ప్రేమించి పెండ్లి చేసుకొన్నాడట. ఈమెకు తివ్వల అనే కొడుకు పుట్టాడు. అధికారంలోకి రావడానికి ముందే.. అశోకుడు కళింగరాజ్యానికి వెళ్లి.. అక్కడి అమ్మాయిని పెండ్లి చేసుకొని సంతానాన్ని కూడా కన్నాడు. అశోకుడి శాసనాల్లో కార్వాకి, తివ్వల పేర్లు కనిపిస్తున్నాయి. ఇది గమనించాల్సిన విషయం. మూడో భార్య  పద్మావతి. ఈమె కుమారుడు కుణాలుడు. ఈ పద్మావతి చాలా తొందరగా, చిన్న వయసులోనే చనిపోయిందని చెప్తారు. అందువల్లే ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియడంలేదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ మూడు పెండ్లిళ్లు కూడా అశోకుడు సమ్రాట్టు కాకముందు జరిగినవే.

అశోకుడు తన 34 వ ఏట పట్టాభిషక్తుడయ్యాడు. 18వ ఏట మొదటి వివాహం జరిగితే.. 16 సంవత్సరాల  మధ్యలో మరో ఇద్దరిని పెండ్లి చేసుకొన్నాడు. మహావంశం అన్న శ్రీలంక గ్రంథం ప్రకారం అశోకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేండ్లకు (అంటే కళింగ యుద్ధానికి ముందే..) మహేంద్రను శ్రీలంకకు పంపించాడు. అప్పుడు మహేంద్రవయస్సు ఇరవై ఏండ్లు. అప్పటికే అశోకుడికి తన సోదరుడు సుషుమితో తీవ్రమైన వైరం కొనసాగుతున్నది. మహేంద్రను సుషుమి చంపేస్తాడేమోనన్న భయంతో అతణ్ణి దూరంగా పంపించాడు. ఆ తరువాత కూతురునీ అదేబాటలో పంపాడు.

ఇక నాలుగో భార్య అసంధిమిత్ర. అశోకుడు సమ్రాట్టు అయిన తరువాత చేసుకొన్న వివాహమిది. ఈమెకు మహారాణి హోదా లభించింది. ముందున్న ముగ్గురికి ఆ హోదా కలుగలేదు. ఈమెకు సంతానం కలుగలేదు. పద్మావతి చనిపోయిన తరువాత అసంధిమిత్ర మహారాణిగా మారింది. చరిత్రకారుల కథనం ప్రకారం అసంధిమిత్ర 240 బీసీలో చనిపోయింది. అప్పటికి అశోకుడి వయస్సు 65 సంవత్సరాలు. ఆ తరువాత మరో నాలుగేండ్లకు అంటే తాను చనిపోవడానికి మూడేండ్లముందు అశోకుడు మరో పెండ్లి చేసుకొన్నాడు. తన నాలుగో భార్య దగ్గర పనిమనిషిగా ఉన్న తిష్యరక్షితను పెండ్లిచేసుకొన్నాడు. ఆమె బౌద్ధురాలు కాదు. అప్పటికి ఆమె వయస్సు చాలా చాలా తక్కువ. వృద్ధుడైన రాజుకంటే.. అతని కొడుకు కుణాళుడిపై మోజు పడింది. ఆమె అతనికి చేసిన ప్రపోజల్‌ను కుణాలుడు తిరస్కరించాడు. తల్లి స్థానంలో ఉన్న నీవు ఇలా ప్రవర్తించడం తగదన్నాడు. దీంతో ఆమె ఒక పథకం ప్రకారం అశోకుడి ఆస్థానంలో తనకు అనుకూలంగా ఉన్నవారి సహాయంతో కుణాళుడి కండ్లు పీకేయించింది. అశోకుడు దీన్ని సహించలేకపోయాడు. తిష్యరక్షితను అత్యంత దారుణంగా తాను నిర్మించిన నరకంలోనే చంపేశాడు. అక్కడితో అశోకుడు ఆగలేదు. ఆమెకు సహకరించిన ఒక బ్రాహ్మణ మంత్రిని.. అతనికి సహాయంగా నిలిచిన చాలామందిని దారుణంగా హతమార్చాడు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిందేమిటంటే.. కుణాళుడి పట్ల తిష్యరక్షిత ఆకర్షితురాలు అయిందన్న ఈ కథనానికి ఎక్కడా ఒక స్పష్టమైన చారిత్రక ఆధారం లేదు.

మరి ఈ కథనం ఎక్కడి నుంచి స్వీకరించారో తెలియదు. ఇది చరిత్రే అయితే.. చెప్పాల్సిందే. తక్షశిలలో అశోకుడి సుషిమి గురించిన సమాచారమున్నది. శ్రీలంకలో సంఘమిత్ర గురించిన కథనం ఉన్నది.

అశోకుడి కొడుకు మహేంద్ర గురించిన కథనం తెలుస్తున్నది. ఆయన ఐదు పెండ్లిళ్ల గురించి తెలుస్తున్నది. కళింగయుద్ధం.. ఊచకోత.. బౌద్ధం.. ఆరామాలు, విహారాల నిర్మాణం.. ఇవన్నీ ఉన్నాయి. కానీ.. చివరకు అశోకుడి హెల్ గురించి చాలా పెద్ద పుస్తకమే ఉన్నది. తిష్యరక్షిత వివాహం.. ఆమె హత్య గురించి వివరణ అశోకావదానంలో, దీపవంశంలో కనిపిస్తున్నది కానీ, కుణాళుడికి ఆకర్షితురాలు కావడం.. అతని కండ్లు పీకించడం వల్ల అన్న కథకు నేరుగా చరిత్రపరమైన ఆధారం కనిపించడంలేదు. రెండు బెంగాలీ నవలల్లో మాత్రమే తిష్యరక్షిత ప్రేమ వృత్తాంతం కనిపిస్తుంది. అశోకావదానంలో కుణాళుడు గుడ్డివాడు కావడానికి తిష్యరక్షితను బాధ్యురాలిగా పేర్కొన్నారు. కానీ.. కారణం ఏమిటన్నది అశోకావదానంలో కనిపించదు. తక్షశిలలో బౌద్ధ వ్యతిరేకులు కుణాళుడిని గుడ్డివాడిని చేయడంలో విజయవంతం అయ్యారని పేర్కొంటారు. వీటన్నింటిని కలగలిపితే నవలలో ఉన్న కథ కాస్తా చరిత్రగా మారిపోయింది. ఏమైనప్పటికీ.. తిష్యరక్షితను.. ఆమె అనుచరగణాన్ని అశోకుడు తన చరమాంకంలో దారుణంగా చంపించాడు.

Ashokavadana refers to Girika as Chandagirika or Girika the Cruel. It appears that Girika overheard a Buddhist monk recite the Balapanditasutta which contains vivid descriptions of the five tortures of hell, such as:

Finally, there are beings who are reborn in hell whom the hell-guardians grab, and stretch out on their backs on a fiery floor of red-hot iron that is but a mass of flames. Then they carry out the torture of the five-fold tether; they drive two iron stakes through their hands; they drive two iron stakes through their feet, and they drive one iron stake through their heart. Truly, O monks, hell is a place of great suffering.

అంతకుముందు చాలా ఏండ్లకు ముందే కదా.. అశోకుడు పూర్తిగా మారిపోయాడని చెప్పింది? నాకు ఇక జ్ఞానోదయమైంది. కళింగలో శవాలపై చూసిన రక్తంతో కండ్లు తిరిగిపోయినయి.. కాబట్టి.. ఇకపై ఎలాంటి హింస చేయను.. ఎవరినైనా క్షమిస్తాను అని కదా నొక్కి నొక్కి వక్కాణించింది? మరి తిష్యరక్షితను కూడా ఇదే కోవలో క్షమించేయాలి కదా.. ఎందుకు చేయలేదో! పోనీ.. రాజుగా రాజకుమారుడి గుడ్డితనానికి ఆమె బాధ్యురాలు అయితే.. ఆమెను తన బాధ్యత ప్రకారం రాజదండన విధించాడని అనుకొందాం. ఆమెకు అనుకూలంగా వ్యవహరించిన వారందరినీ ఏరి ఏరి పట్టుకొచ్చి చంపడం అశోకుడి క్షమాగుణానికి నిదర్శనమని భావించాలా?

అశోకుడి జీవితంలో బహుశా ఇది ఆఖరి మారణకాండ అయిఉంటుంది. ఎందుకంటే.. అతను చనిపోవడానికి కొన్ని నెలలకు ముందు జరిగిన ఘటన ఇది. అశోకుడికి సంబంధించి కథనాలన్నింటికీ సోకాల్డ్ మార్క్సిస్టు చరిత్రకారులు.. రోమిలాథాపర్ తాము రాసిన చరిత్రకు గ్లామర్ టచప్‌ చేశారు. అటు శాసనాల్లో కానీ, దివ్యావదానంలో కానీ, దీపవంశంలో కానీ.. చివరకు అశోకావదానంలో కానీ.. అశోకుడి హింసా ప్రవృత్తి రహస్యంగా ఏమీ దాగిలేదు. దాపరికం ఎంతమాత్రం లేదు. ఇందులో ఏ ప్రాతిపదిక ప్రకారం అశోకుడిని మహా మహా గొప్ప రాజుగా పరిగణించారన్నది అర్థంకాని విషయం. పుట్టినప్పటినుంచి హింసే వ్యక్తిత్వంగా.. హింసే ప్రవృత్తిగా లక్షల మంది ఊచకోతకు కారకుడైన ఒక వ్యక్తిని ఈ దేశం మహాత్ముడని ఎందుకు కొలవాలో ఈ చరిత్రకారులు చెప్పాలి.  అంటే ఓ లక్ష మందిని చంపి.. మరి కొన్ని వందలమందిని ఫర్నేస్‌లో తగులబెట్టి.. ఆ తర్వాత తీరిగ్గా కూచుని.. నాకు ఇంకా శిక్షించే శక్తి ఉన్నది.. కానీ క్షమించేస్తా.. అసలు నేను పూర్తిగా మారిపోయాను.. నా కిచెన్‌లో రోజూ జరిగే జంతువధను కూడా బ్యాన్ చేసేశాను..  అన్నాడని చెప్తున్న వాడు తన జీవితంలో చిట్ట చివరి రోజువరకూ ఎవరినో ఒకరిని చంపకుండా.. రక్తం చవిచూడకుండా ఉండలేదు. ఇంతమందిని చంపి ఓ సారీ చేప్పేస్తే (అది కూడా చెప్పాడన్నది అనుమానమే)  ఒక్కసారిగా ఆదర్శ చక్రవర్తి అవుతాడా? అశోకుడికి ముందుకానీ, ఆ తరువాత కానీ.. దేశంలో గొప్ప పరిపాలకులైన రాజులు ఒక్కడంటే ఒక్కడు లేడా? కనిపించలేదా? అశోకచక్ర అవార్డు ప్రారంభించిన వాళ్లకు.. అశోక హాలు పేరు పెట్టినవారికి.. అశోక హోటల్ కట్టించిన వారికి.. సదరు అశోకుడిలో ధర్మం ఎక్కడ కనిపించింది? సంఘం పట్ల ఆర్ద్రత ఎక్కడ కనిపించింది? మహాపురుషుడైన గౌతమ బుద్ధుడి బోధనల ప్రభావం ఎక్కడ కనిపించింది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here