“మఱ్ఱిమాను – తరతరాల వారసత్వం” – రంజని కవితల పోటీ ప్రకటన

0
6

[dropcap]రం[/dropcap]జని తెలుగు సాహితీ సమితి, ఏ.జీ.ఆఫీసు, హైదరాబాదు గత అరవై సంవత్సరాలుగా కాలంతోబాటు ప్రయాణం చేస్తోంది. నిత్యం సాహితీ సేవలో తరిస్తూనే “అమ్మ”, “దాంపత్యం” వంటి ఎన్నో కవితా సంపుటాలను వెలువరించి తెలుగు రాష్ట్రాలలో తన ఉనికిని సుస్థిరం చేసుకుంది.

“మట్టిలోన తపస్సు చేసిన విత్తనానికి వందనం
నేలచీల్చి తలెత్తి లేచిన లేత మొక్కకు వందనం”
– అద్దేపల్లి

మానవుడి ప్రస్థానం ఎల్లప్పుడూ ప్రకృతితో సమాంతరంగానే సాగిపోవాలి. ఎప్పుడైతే ఆ సమతుల్యం దెబ్బతింటుందో దాని ప్రభావం వల్ల యావత్ ప్రపంచం అతలాకుతలం ఔతుంది. ఆ సమతుల్యం కాపాడగలిగినది చెట్టు అని అన్ని దేశాలు, అన్ని అంతర్జాతీయ సంస్థలు గుర్తించి వాటి పెంపుదలపై దృష్టి సారించాయి.

ప్రాచీన కవులు మొదలుకుని ఆధునిక భావావేశం కలిగిన కవులను ప్రభావితం చేసిన చెట్టు ఏదన్నా ఉంటే అది మఱ్ఱిచెట్టు. తన ఊడల్ని పెంచుకుంటూ, పరుచుకుంటూ తరతరాల వారసత్వానికి నిలువెత్తు రూపంగా అందరికీ ప్రేరణనిస్తుంది. అటువంటి మఱ్ఱిమ్రాను పై ఒక కవితా సంకలనం తీసుకురావాలని “రంజని” తన బాధ్యతగా తలచి, అందుకు అనువైన వచన కవితలకు ఆహ్వానం పలుకుతున్నది. నిడివి 70 లైన్లకు మించని కవితలను, పైన చెప్పిన వస్తువును మీరకుండా, పంపి మా ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసినదిగా కవులకు ప్రార్థన.

యువ కవుల్ని యుక్త సాహితీవేత్తలుగా పరిణతి చెందేలా ప్రోత్సహించి, జీవితాంతం సహృదయుడిగా నిబద్ధతతో నిలబడిన ‘అద్దేపల్లి రామమోహనరావు స్మారక సాహితీ పురస్కారాన్ని’, వచ్చిన కవితలలో అత్యుత్తమ కవితను (10,000 నగదు పురస్కారం), మరో మూడు ఉత్తమ కవితలను (1,116 నగదు పురస్కారం) ప్రత్యేక బహుమతికి ఎంపికచేసి పుస్తకావిష్కరణ సభలో, ప్రదానం చేయడం జరుగుతుంది.

కవితలు మాకు చేయవలసిన ఆఖరు తేదీ- 30-06-2019
కవితలు పంపవలసిన అడ్రసు. ప్రధాన కార్యదర్శి, రంజని తెలుగు సాహితీ సమితి, ఏ.జీ.ఆఫీసు, హైదరాబాదు- 500004
E-mail: ranjanitss.agoffice@gmail.com, WhatsApp: 8374822255, 9493401629
రచయిత హామీపత్రం తప్పనిసరి. వివరాలకు సంప్రదించండి: 9492921383, 8374822255

శ్రీమతి పద్మలత జయరాం

అధ్యక్షులు, రంజని తెలుగు సాహితీ సమితి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here