సాగర ద్వీపంలో సాహస వీరులు-4

0
6

[box type=’note’ fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]“అ[/dropcap]మ్మ అదేదో ప్రేమగా చెప్పవచ్చుగా ‘మోసేవాడికే కావడి బరువు’ తెలుస్తుంది” అన్నాడు ఇకఇక.

“అవును మరి, ‘ఈదేవాడికే లోతు తెలిసేది’” అన్నది బెకబెక.

వాటి అల్లరికి నవ్వుకున్న మిత్రులు ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.

***

మరుదినం వేకువనే ప్రయాణం ప్రారంభించిన మిత్రులు ఇరువురు అరణ్య మార్గంలో ప్రయాణిస్తుండగా సమీప కొండ దిగువున ఉన్నబిలంనుండి ‘రక్షించండి కాపాడండి’ అంటూ స్త్రీ స్వరం వినిపించింది.

కత్తులు చేతబూని బిలంలోనికి ప్రవేసించి కొంతదూరం ప్రయాణం చేసాక ‘జయంతా ఆగు ఇక్కడ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఇలానే ముందుకు వెళితే మనం ప్రాణపాయస్ధితికి చేరుకుంటాం’ అంటూనే సృహ తప్పాడు విజయడు. మరికొద్ది క్షణాలకే జయంతుడు సృహ కోల్పోయాడు.

సృహ తెలిసేసరికి మిత్రులు అతిసుందర పాలరాతి మందిరంలో హంసతూలికా తల్పలపై ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్న ఇద్దరు యువతులను చూస్తూ ”అమ్మా మీరు ఎవరూ? మేము ఇక్కడకు ఎలా వచ్చాము” అన్నాడు విజయుడు.

“ముందు స్నానం, అనంతరం భోజనం చేసి కనిపించే కుబేరుని విగ్రహాన్ని పూజించి రండి. మిగిలిన విషయాలు అనంతరం మాట్లాడదాము” అన్నది ఒక యువతి.

అక్కడ ఉన్న కోనేరులో పన్నీరుతో కూడిన సుగంధ భరితమైన నీటిలో స్నానం చేసి, మానవ వాహనధారుడైన కుబేరుని పూజించి భోజనాని కూర్చున్నారు మిత్రులు.

అక్కడ భక్ష, భోజ్య, లేహ్య, చోస్య, మధుర పానియాలు, పిండివంటలతో పాటులతో పాటు, పలు రకాల ఫలాలు ఉన్నవి. మిత్రులు భోజనం ముగించాక పచ్చకర్పూరం, జవ్వాజి, జాపత్రి, యాలుక, లవంగ ఇత్యాది పలు సుగంధలతో కూడిన తాంబూలం సేవించసాగారు. కమ్మని గానం దానికి అనుగుణంగా వాద్య నాదం రావడంతో అటుకేసి చూసిన మిత్రులకు అక్కడ ఇరువురు యువతులు అమర నాట్యం చేయసాగారు.

నాట్యం ముగిసిన అనంతరం “యువకులారా మేము గంధర్వకాంతలం. మమ్ము మీరు గాంధర్వ వివాహం చేసుకుని కొంతకాలం సుఖించండి, అప్పుడు మాకు శాపవిమోచన జరుగుతుంది” అన్నది ఒకయువతి.

“అమ్మా మీ కోరిక తీరడం అసంభవం. మేము ఇంతకు మునుపే మరో మానవ యువతులకు మనసు ఇచ్చాము. కనుక మాతో వివాహం కుదరదు. కనుక మీరు మాకు సోదరి సమానులు. మీ శాపవిమోచనానికి మరేదైనా మార్గం ఉంటే చెప్పండి” అన్నాడు జయంతుడు.

“యువకులారా మేము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి చెప్పగలరా?” అన్నది మరో యువతి.

“ప్రయత్నిస్తాం, ఏమిటా ప్రశ్నలు?” అన్నాడు విజయుడు.

“కళలు అరవై నాలుగు కదా వాటి పేర్లేమిటి?” అన్నదో యువతి.

“అగ్ని స్తంభం-కావ్యం-దృష్టి చనం-లిపికర్మం-అదృశ్యకరణం-కృషి-దేశభాషలిపి – లోహక్రియ-అలంకారం-ఖడ్గ స్తంభం- ధాతువాదం – వయ స్తంభం – అవధానం – ఖనివాదం – నాటకం – వశ్యం – అశ్వక్రియ – గంధవాదం – పరకాయ ప్రవేశం – వాక్ స్తంభం – అసవకర్మం – గాయకత్వం – ప్రాణిదూతృత కౌశలం – వాక్సిద్ది – అంజనం – చర్మక్రియ – పాదుకాసిద్ధి – వాచకం – అంబరక్రియ – చిత్రక్రియ – పాశు పాలనం – వాణిజ్యం – ఆకర్షణం – చిత్రలేఖనం – మణి మంత్రేషధాదిక సిద్ధి – విద్వేషం – ఆగమము – చోరకర్మం – మల్ల శాస్త్రం – వేణుక్రియ – ఇతిహాసము జలవాదం – మారణం – శాకునం – ఉచ్చాటనం – జలస్తంభం – మృత్ర్కియ – సర్వ వంచనం – ఐంద్రిజీవితం – దహదం – మోహనం – సర్వశాస్త్రం -కవిత్వం దారుక్రియ – రత్నశాస్త్రం – సంగీతం – కామశాస్త్రం – దురోదరం జ్ఞానం – రథాశ్యాగజ కౌశలం – సాముద్రికం – కాలవంచనం – దూతీకరణం – రసవాదం – సూదకర్మం” అన్నాడు జయంతుడు .

“ధర్మం అంటే ఏమిటి?” అన్నది ఓక యువతి.

“ధర్మం” అసే పదం ‘దృఇౌ’ అనే ధాతువు నుండి వచ్చింది. ఈ ధాతువుకి ‘ధరణే’ (ధరించునది) అని అర్థం. మనకు ప్రాచీనమైన ధర్మశాస్త్రం ‘మనుస్మృతి’. దీన్నే మను ధర్మశాస్త్రం అంటారు.

అందరూ పాటించవలసిన సాధారణ ధర్మాలు పది చెప్పబడ్డాయి. ధృతి-క్షమ-దమం-అస్తేయం- శౌచం-ఇంద్రియ నిగ్రహం- హ్రీః-విద్యా-సత్యం-అక్రోధం” అన్నాడు విజయుడు.

“మనిషి పుట్టుకతో అతని వెంటవచ్చే శత్రువులు ఎవరు?” అన్నది మరో యువతి.

“కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు” అన్నాడు జయంతుడు,

“మనుషులలో వివాహాలు ఎన్నిరకాలు” అన్నది మరోయువతి.

బ్రాహ్మం: ప్రతిఫల రహితంగా యోగ్యుడైన వరునకు అలంకరించ బడిన కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.. తలిదండ్రులు శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ కూతురును అలంకరించి తగిన సమర్దుడైన వరుని చూసి కూతురి చేతిని అతని చేతిలో కలపి పాణిగ్రహణం చేస్తారు.

దైవం: యజమాని గృహంలో దైవ యజ్ఞం చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.

ప్రాజాపత్యం: కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వధూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్ధితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో కట్నం, కన్యాశుల్కం అనే ప్రసక్తి ఉండదు.

ఆర్షం: వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లిదండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.

ఆసురం: వధువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.

గాంధర్వం:వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.

పైశాచం: కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వధువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.

రాక్షసం: కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలల ఉన్నాయి.

ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్క్యస్మృతిలో కనిపిస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో స్వయంవరం అనే మరొక సాంప్రదాయ వివాహం ఉంది. శివధనుస్సును విరిచి శ్రీరాముడు సీతను పెళ్ళాడినది, మత్యయంత్రమును ఎక్కుపెట్టి ద్రౌపదిని అర్జునుడు చేపట్టినది ఈ పద్దతినే.” అన్నాడు విజయుడు.

“భళా మీ పురాణ పరిజ్ఞానం అభినందనీయం. మా శాపవిమోచనకు కారకులైన మీకు అన్నింట విజయాలు చేకురతాయి శుభం. కళ్ళు మూసుకుని దైవప్రార్థన చేయండి ఈ బిలం వెలుపల ఉంటారు” అన్నది ఒక యువతి.

బిలం వెలుపలకు చేరిన మిత్రులు తమ ప్రయాణం కొనసాగించారు.

***

మరుదినం సువర్ణపురి అనే రాజ్యం చేరి, అక్కడ రాజథాని నగరంలోని సత్రంలో బస చేసి, అక్కడ పూటకూళ్ళ అవ్వ ఇంట భోజనానికి వెళ్ళి భోజనం చేస్తూ “అవ్వా, మేము బాటసారులం. ఈ రాజ్యంలో విశేషాలు ఏమిటి?” అన్నాడు విజయుడు.

“ఏముంది నాయనా, మా దేశపు రాజకుమారిని వక్రకేతు అనే మాంత్రికుడు నిన్న తీసుకువెళ్ళి రాకాసి బిలంలో బంధించాడు. సకల సద్గుణ లక్షణాలు కలిగిన పలువురు రాజకుమార్తెలను తన మాయా విద్యలతో తీసుకువచ్చి రాకాసి బిలంలో బందీలుగా ఉంచుతున్నాడు మాంత్రికుడు. కన్యలైన ఆ రాజకుమార్తెలతో పాటు మా రాజకుమారిని కాళీమాతకు బలి ఇచ్చి సర్వసిధ్ధులు పొందాలని వాడి ప్రయత్నం. ఎల్లుండి అమావాస్యకి మా రాజకుమారిని బలి చేయబోతున్నాడట. అక్కడకు వెళ్ళే ధైర్యం, మాంత్రికునితో తలపడే సాహసం ఎవరు చేయలేక పోతున్నారు” అన్నది పూటకూళ్ళ అవ్వ.

“అవ్వా రాకాసి బిలం ఏ దిక్కున ఉంది?” అన్నాడు జయంతుడు.

“నాయనా మీరు ఏ తల్లి కన్న బిడ్డలో. చూపరులకు బాటసారుల్లా ఉన్నా మీ ముఖ వర్చస్సు ఆకర్షణీయంగా ఉంది. మాంత్రికుడు చాలా మాయావిద్యలు తెలిసినవాడు. అలాంటివాడిని మీలాంటివారు తలపడటం సాహసమే!” అన్నది పూటకూళ్ళ అవ్వ.

“అవ్వా, సాహసం చేస్తేనే మన బలం తెలుస్తుంది. పొరాడితేనే మన శక్తి తెలుస్తుంది. పోరాటం యువకుల లక్షణం, పోరాడితే పోయేది ఏముంది? విజయానికి పోరాటమే ఏకైకమార్గం” అన్నాడు విజయుడు.

“ఇక్కడకు కోసెడు దూరంలోని దక్షణ దిక్కున ఉన్న కొండ దిగువున ఉన్న మర్రిచెట్టు వెనుక ఉన్న గుహ మాంత్రికుడి స్ధావరం” అన్నది అవ్వ.

జయంతుడితో దక్షణ దిక్కుకు బయలుదేరాడు విజయుడు.

సాయంత్రానికి రాకాసి బిలం చేరిన మిత్రులకు బిలం ముఖ ద్వారం వద్ద ఉన్న మూడు తలల పెద్ద శ్వేతనాగు బుసకొడుతూ విజయుని పైకి వచ్చింది. ఒడుపుగా దాని కాటునుండి తప్పుకుంటూ, చేతిలోని కత్తితో తాని తలలను తెగవేసాడు విజయుడు. గిలగిల లాడుతూ ఆ శ్వేతనాగు మరణించింది.

“ఆహా ఎంత ధైర్యం, సాహసించి నా గుహకే వచ్చారా? ఎవరు మీరు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చూడండిరా అర్బకులారా నా మంత్ర విద్యలు” అని మంత్రదండంతో ఇద్దరు రాక్షసులను సృష్టించి జయంత విజయులపై ఉసిగొల్పాడు మాంత్రికుడు.

కొద్దిసేపటి పోరాట అనంతరం ఆ రాక్షసులు ఇరువురు జయంతుని, విజయుని చేతిలో మరణించారు.

“భళారే అయ్యలు మీ యుథ్థ నైపుణ్యం మెచ్చదగినదే, శత్రువు మనకన్నా గొప్పవాడు అయినప్పుడు అభినందించవలసిందే! మిమ్మలను శిలా విగ్రహాలుగా మారుస్తా కాచుకొండి” అని మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ వీరి వైపు మంత్రించి చూపించాడు.

మిత్రులు ఇరువురు నవ్వుతూ నిలబడి ఉండటం చూసిన మాంత్రికుడు,

“ఏమిటి నా మంత్రవిద్యలు మీ పైన పని చేయడంలేదు. సరే భుజబలం తోటే మిమ్మల్ని ఎదుర్కొంటాను” అని కత్తితో విజయుని పైకి వెళుతూ, ఒక అస్ధిపంజరాన్ని సృష్టించి జయుంతిని పైకి పంపాడు.

“జయంతా ఈ దుర్మార్గుడు నా వంతు. వీడిని యమపురికి నే పంపుతాను. నువ్వు అస్ధిపంజరం సంగతి చూడు” అంటూ మాంత్రికునితో తలపడ్డాడు విజయుడు.

మాంత్రికుని మంత్రాలు తమపై పని చేయకపోవడినికి సదానందుల వారు ఇచ్చిన రక్షరేఖలే కారణం అని గ్రహించాడు జయంతుడు.

చేతిలో బల్లెంతో నడుచుకుంటూ వచ్చిన అస్ధిపంజరం జయంతునితో తలపడిండి. హోరాహోరిగా సాగిన అస్ధిపంజర పోరాటంలో జయంతుని ఖడ్గానికి అస్ధిపంజరం పుర్రె తెగిపడింది.

కొంతపోరాటం అనంతరం విజయుని చేతిలో మాంత్రికుడు మరణించాడు.

బందీగా ఉన్న రాజకుమార్తెలను అందరిని క్షేమంగా ఆ దేశ రాజుకు అప్పగించి తమ ప్రయాణం కొనసాగించారు మిత్రులు.

అరణ్యమార్గంలో వెళుతుండగా చెట్టుకు ఒక ముని తల్లకిందులుగా వేళ్ళాడుతూ కనిపించాడు.

మిత్రులు ఇరువురు ఆశ్చర్యపోతూ ఆ మునిశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించారు.

“స్వామి తమరు ఇలా ఉండటానికి కారణం ఏమిటి?” అన్నాడు జయంతుడు.

“నాయనలారా మా గురువు గారు చేస్తున్న యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం ప్రదర్శించినందుకు నన్ను మా గురువు గారు ఇలా శపించారు” అన్నాడు ముని.

“మరి శాపవిమోచనం వేడుకోలేదా?” అన్నాడు విజయుడు.

“ఉన్నది నాయనలారా వేదాలు, స్మృతులు, పంచ మహాయజ్ఞాలతో పాటుగా కొన్ని యాగలు వాటి ప్రయోజనాలు, ఎవరైనా బ్రహ్మచారి సాహసి, వీరుడు అయిన యువకుడు నాకు తెలియజేస్తే అప్పుడు నాకు శాపవిమోచనం అవుతుంది” అన్నాడు ముని.

“స్వామీ, మా గురుదేవులు సదానందల వారు నేర్చిన పురాణ విద్యలో భాగమే ఇది. నేను చెప్పగలను….

చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుని తూర్పు ముఖం నుండి ఋగ్వేదమూ, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అధర్వణవేదము ఉధ్బవించాయి. యజ్ఞానికి ‘హోత’ – ‘అధర్యుడు’ – ‘ఉద్గాత’ – ‘బ్రహ్మ’ అని నలుగురు ఋత్విక్కులు ఉంటారు. హోత అనే ఋత్విక్కుకు సంబంధించినవీ, గానం చేయబడనివీ, అయిన ప్రశంసాత్మక మంత్ర స్తోత్రాలు తూర్పుముఖం నుండి వెలువడినవి. అధ్వర్యునికి సంబంధించిన విధిరూపమైన ఇజ్య, గాన యోగ్యాలైన మంత్ర స్తోత్రాలు దక్షణ ముఖంనుండి వెలువడ్డాయి. ఉద్గాత ప్రయోగించే స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖంనుండి ప్రాదుర్భవించాయి. బ్రహ్మ అనబడే నాల్గవ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్తకాండ ఉత్తరముఖం నుండి ఉద్బవించింది. ఉపవేదాలలో ఆయుర్వేదం ప్రాజ్ముఖం నుంచీ, ధనుర్వేదం దక్షణముఖం నుండి, గాంధర్వవేదం పశ్చిమ ముఖం నుండి, విశ్వకర్మకు సంబంధించిన స్ధాపత్యము అనే శిల్పవేదం ఉత్తరముఖం నుండి ఉత్పన్న మయినాయి.

పంచమ వేదమైన ఇతిహాస పురాణ సముచ్ఛయం బ్రహ్మ దేవుని అన్ని ముఖాలనుండి ఆవిర్బవించింది. మరియ కర్మతంత్రాలయిన షోడశి – ఉక్ధ్యము, చయనం – అగ్నిష్టోమం, ఆప్తోర్యామం – అతిరాత్రం, వాజపేయం – గోసవం, అనేనాలుగు జంటలు, ధర్మపాదాలైన విద్య – ధనం – దానం – తపస్సు అనేవి క్రమంగా నాలుగు ముఖాల నుండి ఉద్భవించాయి. బ్రహ్మచర్యం, గార్హస్ధ్యం, వానప్రస్తం, సన్న్యాసం అనే ఆశ్రమ చతుష్టయం కూడా బ్రహ్మనాలుగు ముఖాలనుండి వెలువడ్డాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here