సద్గురు సాయి దివ్యోపదేశములు

0
11

[dropcap]క[/dropcap]లియుగ దైవం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాథులు వివిధ సందర్భములలో తన భక్తులతో  పలికిన పలుకులను ఇప్పుడు స్మరించుకుందాము. సద్గురువు పలుకులే మనకు వేద శాస్త్రాలు. సద్గురువు ఆచరించినవే మనకు వేద కర్మకాండ. అందుకని మన గురువు బోధలను తు.చ. తప్పక ఆచరించడమే మన కర్తవ్యం.

  1. సమస్త విషయములయందు మనము నిర్మలుడవుగా వుండవలెను. నిజమైన మానవునికి మమత కాక సమత వుండవలెను. చిన్న చిన్న విషయముల గూర్చి ఇతరులతో పోట్లాడుట అవివేకం. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు.
  2. నా మనుష్యుడు ఎంత దూరమున వున్నప్పటికీ, 100 క్రోసుల దూరమున వున్నప్పటికీ, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి ఈడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను.
  3. నన్ను గూర్చి ఇతరులను అడుగవలదు. మన కండ్లతోనే సమస్తము చూడవలెను. నా గురించి నన్నె అడుగవలెను. అప్పు చేసి శిరిడీకి రావలదు.
  4. నా భక్తుల గృహముల యందు ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి, నా ధ్యానమందే మునిగియుందురో వారి పనులన్నియూ సూత్రధారినై నేనే నడిపించెదను.
  5. ఎవరయితే తమ అంత్య దశలో నన్ను జ్ఞాపకము ఉంచుకొనెదరో వారు నన్నే చేరెదరు. ఎవరయితే వేరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు.
  6. ధనము, ఐశ్వర్యం మున్నగు నవి శాశ్వతము కావు. శరీరము సైతం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని, నీ కర్తవ్యమును చేయుము. ఇహ పరలోక వస్తువులన్నింటియందు వ్యామోహము విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదాలను శరణు వేడెదరో, వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తి పోయి సహాయము చేయును.
  7. శిరిడీలో నువ్వు నన్ను నిత్యం చూసే ఈ మూడున్నర దేహము గల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనే యుండెదననుకొంటివి. నేను సర్వాతర్యామి. నేను సర్వ జీవుల హృదయము నందు నివసించుచున్నాను.

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here