సహనమూర్తి

    0
    6

    [box type=’note’ fontsize=’16’] “తప్పు తలచుకుంటే కళ్ళు కన్నీటి సంద్రాలౌతున్నాయి, ఇప్పుడు అమ్మ గుర్తుకొస్తే గుండెల్లో గుబులౌతాంది” అంటున్నారు కుమార్ రాజా బుర్రిసహనమూర్తి” కవితలో. [/box]

    ***

    [dropcap style=”circle”]అ[/dropcap]మ్మ ప్రేమకు ప్రతిరూపం
    సహనానికి మారు పేరు
    నవమాసాలు మోసి, జన్మనిచ్చి
    ముద్దు మురిపెం చేస్తూ, వచ్చీ రాని నడకలతో,
    బుడి బుడి అడుగులతో
    తడబడుతూ నడుస్తు వుంటే
    తన చేయినందిస్తూ
    ముద్దార గోరుముద్దలు తినిపిస్తూ
    చందమామను చూపిస్తూ
    ఉషోదయంన లేచింది మొదలు
    రాత్రి నిద్రపోయేవరకు.
    నిద్దుర కోసం బుజ్జగిస్తూ, జోలపాడుతు
    నన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ
    మోకాళ్ళపై ఆడిస్తూ, నేనే తన లోకంలా
    ఎన్నో సపర్యలు చేసిన అమ్మకు నేనిమిచ్చాను
    కొలువు పేరుతో డాలర్ల కోసం, నా బ్రతుకుదెరువు కోసం,
    విదేశాలకేగి అమ్మను ఒంటరిని చేశాను
    అమ్మ మంచాన పడితే చూడలేక పోయాను.
    అయినా అమ్మకు నాపై కోపం లేదు
    అమ్మకేం కాదులే అనే ధైర్యమో
    నా నిర్లక్ష్యమో తెలియది గానీ,
    కడసారి చూపు కొరకు నా కోసం ఎదురు చూస్తునే
    అమ్మ కన్నుమూసింది
    డాలర్ల మోజులో కఠినుడనై అమ్మను పోగొట్టుకున్నాను
    నాకు మంచి జీవితమిచ్చి తను వెళ్ళిపోయింది.
    తప్పు తలచుకుంటే కళ్ళు కన్నీటి సంద్రాలౌతున్నాయి
    ఇప్పుడు అమ్మ గుర్తుకొస్తే గుండెల్లో గుబులౌతాంది
    మానని గాయం బాధ పెడతాంది.

     

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here