[dropcap]క[/dropcap]రగని మంచు
మనుషుల మధ్య పేరుకుపోతోంది
పూడ్చలేని అగాధం
మనస్సుల మధ్య గూడు కట్టుకుంటోంది
భారమైన బరువులు
భావాల మధ్య వ్రేలాడుతున్నాయి
తొలగించలేని ఇనుపకంచె
మాటల మధ్య నాటుకుంటోంది
లయ తప్పుతున్న రాగాలు
హృదయ స్పందనల మధ్య వినిపిస్తున్నాయి
ద్వేషాల ముళ్ళపొదలు
చూపుల మధ్య మొలుస్తున్నాయి
సంప్రదాయపు కట్టుబాట్లు
వ్యవస్ధాగత జాడ్యాలు
ఆర్థిక అసమానతలు
అసూయ ద్వేషాలు
అగాథాన్ని మంచుముక్కలతో కప్పేస్తున్నాయి
భావాలకు వ్రేలాడుతున్న బరువులు
ఇనుపకంచెను నాటుతోంది
చూపుల స్పందనలు
పగిలిన గాజుపెంకుల్లా మెరుస్తున్నాయి
మన మధ్యే కాదు
వ్యవస్థీకృతమైన సమాజమంతా ఇంతే