సంచిక – పద ప్రతిభ – 108

0
10

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఏనుగు (5)
5. మారేడు చెట్టు (5)
9. ధనము (3)
10. వ్యత్యస్తమగు, ఆరు మూడగు – అదికూడా తడబాటుగా (3)
12. పాలుకుడుచు పసిపాప;  సూర్యుఁడు [చివరి అక్షరమునకు ఉకారాంతము  కాదు ఇకారాంతము అని చదువుకొనవలసినది] (3)
13. మగ్గమునందలి తాకుడుపలక పలుకునా?, పలుకుఁజెలి (2)
14. చూరు పట్టకుండా వేరుపురుగుచూడు – ఇంకా తడబడుతూనే ఉన్నట్టుందే! (5)
16. దీని సిగ దరగ కాదండోయ్ సిగ తిరగ చూడండి (2)
17. ఒకరికి ఒకరు సహాయకరంగా ఉండటం (7)
19. పరివారమును చూడాలంటే అటునుండి రండి (4)
21. జస్టిస్ చౌదరిగారు దీంట్లోనే ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలు చూసుకోనా అని అడిగారు   (4)
23. ఈ ముద్ర వేయడం అంటే శాశ్వతంగా ఉండేటువంటి ప్రభావం చూపడం – కాస్త అటూఇటూ అయ్యింది (4)
24.  వ్యాఘ్రనఖభూషణం చెల్లాచెదురయ్యింది (4)
25. విశాఖ ఓడరేవులో కొలువై ఉన్న భారతదేశపు ప్రప్రథమ నౌకా రాజము – అక్కడ బానేఉంది గానీ ఇక్కడే కాస్త తడబడింది (4)
27. దీనితో హారతివ్వబోతే ఇది కూడా గందరగోళమయ్యింది! (4)
29. కోపంతో దూసుకు వచ్చారుగానీ ఈ కత్తుల రంగారావు గారు మన పదప్రతిభకి భయపడి  వెనుదిరిగి పోయారు (7)
32. రేయి (2)
34.  స్థిరత్వంతో పాటు శుభం కూడా కలగాలంటూ శుభకార్యాలలోనూ, పూజల సమయంలోనూ ఇంటి ద్వారానికి ఈ పూవుల దండలను కడతారుట – ఆ వేపునుండి కోసుకురండి (5)
35. ఇటునుండి చూస్తే మొదలు లేని వినోదము కానీ అటునుండి చూస్తే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య కనిపిస్తుంది (2)
36. తోక (3)
38. దానము (3)
39. ప్రత్యక్షము – ఎస్సార్ అని బడిపిల్లలు చెప్పేది (3)
40.  విడిరాసులను కూడగా లభ్యమగు రాశి (sum) – చివరలేదు (5)
41. శివుడే (5)

నిలువు:

1. మేము బాగా సంపద ఉన్నవారము (5)
2. సుదూర ప్రాంతాలలో ఉన్న లక్ష్యాలని తాకి పేల్చివేసే ఆయుధవిశేషము (3)
3. సాకు (2)
4. మన్మథుడు (4)
5. దొంగ తడబడ్డాడు పైగా ఒక కాలు పొట్టిగా ఉంది (4)
6. అంచెలమీఁద వచ్చు ఉత్తరము లోనగునవి (2)
7. సంపెంగ పూదండ (3)
8. ముడిగొనఁజేయు/ముడుచు (5)
11. స్త్రీలు (4)
14. వేదాల చివరి భాగాలు (7)
15. సువర్ణ కవచము క్రిందనుండి పైకి (7)
17. ఈవేల్పు అంటే వినాయకుడే (5)
18. మిక్కిలి యెత్తుగా నుండు దేవాలయపు గోపురము (5)
20. జలౌకసము కకావికలయింది (3)
22. కోడిపుంజునెత్తిపైజుట్టు (3)
25. ధనమేరా అన్నిటికీ మూలం అనే పాటే ఈ సినిమా లోదే (5)
26. గజిబిజిగా పుష్పము వలె మనోహరయగు స్త్రీ (4)
28. తాలూకా కచ్చేరిలో లెక్కలు సరిచూసేవాడు (5)
30. తడబడిన లవంగము (4)
31. రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్ – ‘రాజకీయ చెదరంగం’ సృష్టికర్త – పేరు కొంచెం అటుఇటుగా ఉంది – ఆరింట నాలుగింతలే ఉంది (4)
33. చదును చేయని గడ్డినేల (3)
35. లోహపుపొడి (3)
37.  చివరికంటా లేని గోల్డు కవరింగు (2)
39. విడుచుట/ త్యాగము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 02 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 108 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 07 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 106 జవాబులు:

అడ్డం:   

1.భవికము 4. వనస్పతి 7. బతిమాలిక 9. భూగోళం 11. రంకమ 13. తిరు 14. తిమిరం 16. టంక 17. కొబ్బరి 18. గర్తిక 19. అయ్య 20. కచుడు 22. టపా 24. కలువ 26. సములు 27. గయోపాఖ్యానం 30. కశేరుక 31. తందనము

నిలువు:

1.భవభూతి 2. కబళం 3. ముతి 4. వలి 5. నకరం 6. తికమక 8. మాస్వామి 10. గోరుకొయ్యలు 12. కటంకటము 14. తిరిక 15. రంగడు 19. అకళంక 21. చులింపా 23. పాలుకము 25. వగరు 26. సనంద 28. యోక 29. ఖ్యాతం

సంచిక – పద ప్రతిభ 106 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here