‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) కన్నతల్లి, పూజ్యురాలు (2) |
2) ప్రాఁకుట, పాఁచి (3) |
5) మొట్టమొదటి దాంట్లో చివరలేదు (2) |
7) క్రిందపరపబడినది (5) |
9) సుమారు, ఇంచుమించు (4) |
11) గండభేరుండపక్షి (4) |
13) ఋషి, బుద్ధదేవుడు, అగిసియ వృక్షము (2) |
14) కవిత్వము రాయువాడు; చెప్పువాడు. పండితుడు (2) |
15) ధ్వని, కంఠధ్వని – మొదటి అక్షరం లేదు (2) |
16) కొలను, సరస్సు వెనుకనించి ముందుకి ప్రవహిస్తోంది (3) |
17) మాంగల్యము గల స్త్రీ, సౌభాగ్యవతి (3) |
18) భీకరంగా, తీక్షణంగా వెనుక నించి ముందుకి వస్తోంది (2) |
19) కలహము, మోసము అటూయిటూ అయింది (3) |
20) తిరగబడిన కోరిక (2) |
22) చాతుర్మాస దీక్షలో 6, 2,5, 1 (4) |
24 భారతంలోని విరాటపర్వంలో అజ్ఞాతవాసంలో ఉన్న వలలుడు (4) |
26) విశేషముగా రచింపబడినది (5). |
28) ఆపద (2) |
29) అందువు, అందగు, అందె, ఏనుగు సంకెల (3) |
30) క్షీరము (2) |
నిలువు:
1) పాదరసము, పొగడ చెట్టు (4) |
2) తొలిసారి అందిన విషయం, మొట్టమొదట తెలిసిన వార్త; రెండవ అక్షరాన్ని చాలామంది ‘ధ’ అని రాస్తారు. ఈసారికి మనమూ అదే రాద్దాము (9) |
3) లోపలి నీరింకిన కొబ్బరి – ఆఖరి అక్షరం లోపించింది (2) |
4) ఇతనే అటూయిటూ అయ్యాడు (3) |
6) ఏమరుపాటు, అనాలోచిత విపత్తు (4) |
7) గది; కొంచెం, కొరత, భేదం, కపటం, సగం (2) |
8) చివర విరిగిపోయిన బంగారు కడియం, శ్రీరమణ గారి కథని గుర్తు చేసుకోండి (2) |
10) ఉత్తరదిక్కున కధిపతి, కుబేరుడు (5) |
12) పరాధీనము; మైమరపు (5) |
17) ఇంద్రుని ఏనుగు, ఇంద్రధనుస్సు (5) |
18) తులము, పండ్రెండు మాషముల యెత్తు (4) |
21) నింద, అపవాదు (4) |
23) ద్వీపం, లంక, నీటి నడుమ దిబ్బ (2) |
25) సమూహము, ఉదకము, బాణం, చెట్టుబోదె – మొదలు లేదు (2) |
(27) అల్పము; నీచము, కొంచెము, స్వల్పము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 06వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 126 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఆగస్టు 11 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 124 జవాబులు:
అడ్డం:
1.అలమేలు మంగ 4. దున్నపోతు 8. ధర్మం 9. మనోవైకల్యం 11. మూసీ 13. ముకుంద 15. అట్టము 16. చంద్రకళ 18. ణ ఏ ము 19. మల్లికాక్షం 20. శైలజ 21. మోదము 24. యతి 25. పంచశిఖము 26. భాష్యం 29. ముముక్షువు 30. ఐతిహాసికుడు
నిలువు:
1.అరుంధతి 2. మేకు 3. మంగనోము 5. న్నఅ 6. తులసీదళము 7. ముకద 10. వైకుంఠఏకాదశి 12. చుట్టరికాలు 14. ఇంద్రకీలము 17. రామణీయకము 21. మోచము 22. ముఖస్తుతి 23. దుష్యంతుడు 27. యక్షు 28. పసి
సంచిక – పద ప్రతిభ 124 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మంజులా దత్త కె
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంబర వెంకట జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]