సంచిక – పద ప్రతిభ – 128

0
7

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రాజమండ్రి దగ్గరున్న ద్వారపూడి సమీపంలో తాపేశ్వరం అనే వూరు వీటికి ప్రసిద్ధి. వీటిని ఆ వూరి పేరుతోనే చెప్తారు. (7)
6. బొబ్బట్లు, దిబ్బట్లు, పోలికలు (3)
7. జలం, హరిణం, ఒక రత్నదోషం, సుకుమారము – పదంలోని అక్షరాలు చెల్లాచెదురయ్యాయి (4)
9. కష్టం, ఆపత్తు, విపత్తు (3)
11. ఐరేనికుండలు (5)
13. అందువలన, కాబట్టి (3)
14. సీత, శ్రీరామచంద్రుని భార్య, భూమిజ (మొదటి అక్షరానికి ఒత్తు లేదు) (4)
15. తిరగబడిన సంతానం; కొలత విశేషం, చెట్టుకు కాసేది (2)
16. తిరగబడిన బృహస్పతి కొడుకు (3)
17A. తడబడు, సమస్యలతో నిండి ఉండు (6)
19. క్షీరము, భాగము; తెల్లనగు, వశము (2)
20. పాలు, బెల్లము వేసి అనుకుగా వండిన అన్నము, పాయసము (5)

నిలువు:

1. మంగళ సూత్రంలోని రెండవ అక్షరానికి దీర్ఘం పెట్టండి (2).
2. ప్రేలు, అదేపనిగా మాట్లాడు (2)
3. కామధేనువు (3)
4. చేపలను పట్టే వల (2)
5. క్రిందనించి పైకి – ముల్లు, త్రాసు ముల్లు (2)
6. పెసరపప్పు నాన బోసి రుబ్బి పంచదార కలిపి చేసే బూరెలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వండుతారు (7)
8. కోవా తో కాయలు, ఒక తీపి పిండివంటకము (7)
9. అక్కడ, ఆ ప్రదేశంలో (2)
10. మాటలాడు; సమాధానము చెప్పు, వీణా స్వరము, విద్య, ఖండము (3)
12. కర్ణుడు, ధర్మరాజు భీముడు, అర్జునుడు (5)
13. కిరణము, చెయ్యి, ఇంద్రధనుస్సు, ఏనుగు తొండము (2)
16. కరకరలాడు – 6, 5, 4 (3)
17. క్రింద నించి పైకి – మాడజేయు, మాడించు (3)
18. చరిత్ర, గాథ, వృత్తాంతం, చెప్పడం (2)
18A. మండూకం. పాపం, ఒత్తు పోయింది (2)
19. సర్పము, అహి, అక్షము, కాకోలము, పూయు, పులుము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 20తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 128 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఆగస్టు 25 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 126 జవాబులు:

అడ్డం:   

1) అమ్మ 2) ప్రాకుడు 5) ప్ర ప్ర 7) అధరితము 9) రమారమి 11) ఇరుపద 13) ముని 14) కవి 15) రము 16) సిరస 17) ఐదువ 18) ద్రం రౌ 19) మా టం రా 20) శ ఆ 22) క్ష తు దీ చా 24) వడముడి 26) విరచితము 28) ముప్పు 29) మురుము 30) పాలు

నిలువు:

1) అమరము 2) ప్రాధమిక సమాచారము 3) కురి 4) డు త ఇ 6) ప్రమాదము 7) అర 8) మురు 10) మానిసి రౌతు 12) పరవశము 17) ఐరావతము 18) ద్రంక్షణము 21) ఆడికోలు 23) దీవి 25) డము (27) చిరు

సంచిక – పద ప్రతిభ 126 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here