సంచిక – పద ప్రతిభ – 131

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) క్షీరసాగరము నందు దొరికిన అమృతాన్ని దేవదానవులకు పంచి పెట్టడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారము (9)
7) మోసము, తాళము యొక్క కాలము, ఒక తెలుగు సినీ నటి (2)
8) తిరగబడిన కుత్తుక, గొంతు, సజ్జరసం (2)
9) స్వప్నము (2)
10) సిగ్గు (2)
12) త్రికోణము, మూడు కోణములు గల దిగనేర్పరచిన కొయ్య చట్టము (4)
13) వెనుక నించి ముందుకి ఒక ఉప వాయువు; మద్దిచెట్టు, సర్పవిశేషము (4)
14) లక్ష్మి, మిక్కిలి (ఏకాక్షరం) (1)
15) గంగానది (4)
19) తన అనంతరం తన స్థిర చరాస్తులు ఎవరెవరికి చెందాలో రాసి వుంచే పత్రం (4)
22) తిన్నావా త్రాగావా లో – 4, 3, 1, 2 (4)
23) చెల్లాచెదురయిన ఔషధవిశేషము, మజ్జిగ, విషము (4)
24) మొదలు లేని స్త్రీ (2)
25) ఎవరికయినా పెళ్లి సంబంధం చూసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికీ కూడా అన్నింటి కన్నా, వారిలో ఇది ముఖ్యమైనదయి వుండేలా చూసుకోవాలి (9)

నిలువు:

1) తామర, శంఖము, జల జంతువు (4)
2) పితృదేవతల గూర్చి శ్రాద్ధము పెట్టెడు క్షేత్రం (2)
3) ఎఱ్ఱగన్నేరు, ఇజ్జలం (4)
4) కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి (4)
5) బీగము, తాటిచెట్టు, కత్తి పిడి, తగరము (2)
6) రంగనాధుడు అను గ్రంథకర్త రాసిన ద్విపద రామాయణము (9)
9) జీలకర్ర, ఈగ, నీటిబొట్టు, లేశము (2)
11) జనము, ప్రజ (2)
15) —- చింతకాయలు రాలుతాయా? మొదటి పదమును పూరించండి ఒక సామెత వస్తుంది (4)
16) వన వహ్ని, గొప్ప మంట (4)
17) రెండో అక్షరంలో క్రింద వత్తులేని అగ్ని, కిత్తు (2)
18) ఇదిగో మనిద్దరిలో వాళ్లు ఎవరిని పిలుస్తున్నారు? (4)
19) యుద్ధము మొదలులోగాని కడపటగాని వేరులు చేసెడు గోష్ఠీపానము (4)
20) తిరగబడిన ఒక సంవత్సరము (2)
21) ‘ఇదే నా సమాధానం’ అనే సినిమా పేరు లోంచి 3, 7 (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 సెప్టెంబర్ 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 131 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 15 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 129 జవాబులు:

అడ్డం:   

1) అగ్ని 2) కౌసల్య 5) శకుని 7) ఆశ 8) హక్కు 9) సూదశాల 11) సారు 12) మురి 13) మాడు 14) కాని 15) ఈశాన్యం (16) లోను 17) నిరృతి 19) పాకలము 21) అధరం 22) రాసక్రీడలు 25) ద్రవ్యం 26) ముతగో 27) సతి

నిలువు:

1) అనసూయ 2) కౌశలము 4) అహల్య 7) ఆశా 11) సామాన్యం 14) కానుక 15) ఈతి 16) లోపాముద్ర 17) నిముసము 18) అరంజోతి 20) లరా 21) అలు 23) క్రీత 24) డగో

సంచిక – పద ప్రతిభ 129 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శిష్ట్లా అనిత
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here