సంచిక – పద ప్రతిభ – 135

0
13

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) హేరంభుడు, శౌర్యముచే గర్వించువాడు, సూర్యుడు (4)
4) ఒక రాగము, బంగారముతో మొదలవుతుంది (4)
7) దశరథుని పెద్దకొడుకు, సీతాదేవి భర్త (5)
9) విధము, పద్ధతి (3)
11) కుడి నుంచి ఎడమకి – ప్రేమము; గారాబము (3)
13) శరము, తూపు – వెనుకనించి ముందుకి వచ్చే ప్రయత్నంలో, మొదలు కోల్పోయింది (2)
14) ఉడుగణవీథి, కింజల్కము, చదలు (3)
16) అత్యంతము, మిక్కిలి (2)
17) బెజ్జము, సందు, కన్నము (3)
18) ఉపద్రవము, విపత్తు, కలరావ్యాధి (3)
19) పుంస్త్యము, మగజాతి (2)
20) పల్లు, కొండనడుము, పొదరిల్లు, ఏనుగు దంతం (3)
22) కదా, కాదా, కాదె, కదే (2)
24) ముద్దు తోటిది, అటూ ఇటూ అయింది (3)
26) నిలుచుట, నిలుపు, మీది అంతస్తు, ఆకృతి (3)
27) తేరగా వచ్చింది తినేవాడు, బదనిక, పరుల సొత్తును అనుభవించేవాడు (5)
30) ఇక్ష్వాకు వంశపు రాజు, శ్రీరాముని తండ్రి, చాలామంది చివరి అక్షరాన్ని ఇలా తప్పుగా రాస్తారు (4)
31) విల్లు పూనినవాడు, ధన్వి (4)

నిలువు:

1) కంఠాభరణం, మెడల్, ఆటల పోటీలు మొదలగు వాటిలో గెలిచిన వారికిచ్చే బహుమతి (4)
2) లత్తుక మొదలగు వాటితో పాదాలకు చేసే అలంకారం, పెళ్ళిలో పెళ్లికూతురికి తప్పకుండా ఈ అలంకారం చేస్తారు (3)
3) రత్నం, వజ్రం క్రింద నించి పైకి వచ్చింది (2)
4) రాక్షసమాత, చివర లేదు ఎక్కడికెళ్లిందో మరి (2)
5) కౌను, మధ్యం, అంతరం; మధ్య వుండే వ్యక్తి (3)
6) పచ్చపిట్ట, బంగారుపిచ్చుక (4)
8) పార్వతి, గట్రాచూలి (3)
10) యుద్ధభూమి (5)
12) అనేక రకములు (5)
14) ఏరండతైలము, ఆమిదము (3)
15) సమీపించుట; చేరిక, కూడిక, స్నేహము (3)
19) క్రమము, మేర, మర్యాద (4)
21) మిల్కీ బ్యూటీ అంటూంటారు. తెలుగు, హిందీ నటి (3)
23) వెతుకులాడు (4)
25) — పనాస కాయ. ఇది వరకు బాగా దొరికేవి, శాస్త్రీయ నామం Citrus decumana (3)
26) విలాసములు, బింకములు (3)
28) ఒక సినీ నటి పేరు, శ్రీకృష్ణుడి ప్రియ సఖి (2)
29) భూమి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 అక్టోబర్ 08తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 135 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 అక్టోబర్ 13 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 133 జవాబులు:

అడ్డం:   

1) పొగపెట్టి 3) సారంగము 7) గిండి 8) పార్వతి 9) మేటి 12) సమరం 13) కార్ముకం 17) ణజా 18) శర్మిష్ఠ 19) వేదం 22) చిత్రాంగద 23) చిత్రాంబరి

నిలువు:

1) పొరుగింటి 2) పెళ్ళి 4) రంభ 5) ముక్కొటిక 6) ఊర్వశి 10) భ్రమరం 11) ముర్మురం 14) కాణయాచి 15) ఊర్మిళ 16) కాదంబరి 20) సైగ 21) చిత్రాం

సంచిక – పద ప్రతిభ 133 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధాసాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదన్ తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here