సంచిక – పద ప్రతిభ – 139

0
11

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నామకరణం వేడుక (4)
3) సంపెంగ పువ్వు (4)
7) ముసలితనం, ఒక రాక్షసి, కత్తిపిడి (2)
9) పోటీ; పోలిక (2)
10) ఆశ్చర్యం, అధికమైన, అశక్యమైన (3)
11) తెలుగు సంవత్సరాలలో 18వ సంవత్సరము (3)
14) చేటని తమిళంలో — అంటారు (2)
15) పూర్తిగా నశించు, మొదలాఱు, మొదలూడు (7)
18) ధనము, సంపద (2)
19) పౌర్ణమి (3)
20) అంతా, సకలము, సమస్తము (3)
24) గృహము, నివాసము, – య గుణింతంతో వ్రాయండి (2)
25) గాలి (4)
27) సమానము కాదు (4)
28) భూమి (2)
29) ఉసిరిక, పచ్చ గంధం, మేటుల, దక్షిణ పాంచాలమునకు ముఖ్యపట్టణము (3)
30) కుంకుమ పువ్వు, దేవతల వల్ల పొందే కోరిక, వరించడం, ఒక నిధి, మేలైన (2)

నిలువు:

1) పుష్యమి నక్షత్రం, నీతిశాస్త్రం, ఒక కాలమానం (4)
2) మత్తు పానీయం (2)
4) నగవు; హాసము (2)
5) పక్షిని పెట్టి పెంచెడు గూడు, శరీరము (4)
6) భక్తరామదాసు యొక్క మేనమామలు (7)
8) యుద్ధభూమి (4)
12) సరదా, పండుగ, కుతూహలం, వినోదము (3)
13) పావురము (3)
16) ఒకానొక యజ్ఞము, యజ్ఞవిశేషము (4)
17) పుణ్యస్త్రీ, సువాసిని, సుమంగళి (5)
21) కంటకము, వరిముల్లు, త్రాసుముల్లు (2)
22) జాజి చెట్టు, స్త్రీ (3)
23) ఆడవాళ్ళ భర్త తమ్ముడు, చెల్లెలి మొగుడు (3)
26) విహంగము, పక్కి (2)
27) సలిలం లా ధ్వనించే అల్పము, మధ్య అక్షరం మాయం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 నవంబర్ 05తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 139 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 నవంబర్ 10 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 137 జవాబులు:

అడ్డం:   

1.పంచవటి 3. గజేంద్రుడు 5. వీణ 6. పని 8. హంకారము 9. తిమ్మరుసు 10. పద్మాలయ 12. రవణకం 15. వీల 16. కసుగాయ 19. తూర్పు 20. ముసిముసి 21. వులుముడు

నిలువు:

1.పంకేరుహం 2) టిప్పణము 3. గణపతి 4) డుత్రుపుసు 5. వీర 7. నిమ్మ 10. పద్మకము 11. యవీయసి 12. రవీషువు 13. వల 14. కందర్పుడు 17. సుసి 18. గాము 19. తూము

సంచిక – పద ప్రతిభ 137 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మంజులదత్త కె
  • పి.వి.రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here