సంచిక – పద ప్రతిభ – 140

0
12

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సద్వంశము, సచ్చీలము గల స్త్రీ (5)
4) కృష్ణాష్టమి, శ్రీ కృష్ణుడి పుట్టిన రోజు (5)
7) లక్ష్మి, కాంతి (2)
8) నేర్పు, విద్య – ‘తర’తో ప్రారంభమయ్యే అన్యదేశ్యం (5)
10) ఒక నది, భాగీరథి, నీరు (2)
12) ముత్యాలు కాదు, వృద్ధులు (3)
14) తక్కువగా మాట్లాడేవాడు, మాటలతో పరిష్కారము చేయగోరువాడు (4)
15) కులదేవత (4)
16) హిందీ జీవితం, చివరి అక్షరం ముందుకొచ్చింది (3)
17) ఎగిరిపడు, మిడిసిపడు (4)
18) విష్ణువు, బ్రహ్మకు తండ్రి (4)
20) అభినయహస్తవిశేషము, జెండా, ధ్వజము, (3)
22) అబ్బురము, ఆశ్చర్యము (2)
23) మొదలు లేని కలగల్పులయి (5)
24) సంతసం, పరిమళం (2)
27) కుడి నుంచి ఎడమకి కొబ్బరికాయ (5)
28) అనేక విధాల కష్టాలు, ఎనిమిది రకముల కష్టాలు (5)

నిలువు:

1) శివపార్వతుల పుత్రుడు (5)
2) వరుణుడు, యముడు, బ్రహ్మదేవుడు, వ్యాధుడు (2)
3) ఇనుము పని చేసే వారి వృత్తి (4)
4) తెల్లవారు ఝామున నాలుగు గంటలకు కనిపించే నక్షత్రాలు; డా. మచ్చ హరిదాసు గారి నానీల సంపుటి పేరు కూడా (4)
5) మిగిలినది, లబ్ధి (2)
6) శివుడు, వ్యోమకేశుడు – రెండో అక్షరం లోపించింది (5)
9) బిత్తరపోయిన జింక కాదండీ, చంద్రుడు, జాబిల్లి (7)
11) పార్వతి భర్త, శివుడు, కపర్థి (5)
13) వెండి, బంగారము, అవ్యక్తమధుర ధ్వని (5)
17) అగ్నిదేవుడు (5)
19) మాతాపితలు (5)
20) నవరత్నములలో ఒకటి (4)
21) క్రింద నుంచి కోటబురుజు (4)
25) కౌను, నడుము (2)
26) ఛాగి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 నవంబర్ 12తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 140 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 నవంబర్ 17 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 138 జవాబులు:

అడ్డం:   

1) పలక 3) గరిత 5) వర్యుడు 7) శారద 8) లలన 9) బ్రహ్మాస్త్రం 11) జల్లెడ 12) వజ్రహాసం 13) కడలి 14) పావనం 16) తేడా 17) మొల్ల 18) విన 19) దురా 20) నిమీల 21) సుధాకరుడు 23) కమ్మదనము 26) చాతకం 27) అట్టిక 28) దుప్పటీ 30) పాటక 31) డుసుకం 32) కుటపం 33) ముకుందం

నిలువు:

1) పరబ్రహ్మం 2) కశాస్త్రం 3) గద 4) తల 5) వనజ 6) డుబుడక్క 10) ఆహారం 12) వలిమొలక 13) కడాని 14) పానకము 15) నందుడు 18) విధాన 21) సుదత్త 22) కంచారుడు 24) మకరందం 26) కందుకం 27) అకము 29) టీకు 30) పాపం

సంచిక – పద ప్రతిభ 138 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మంజులదత్త కె
  • పద్మావతి కస్తల
  • పి.వి.రాజు
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here