‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) ఆశ్వయుజ మాసపు అమావాస్య నాడు వచ్చే పండుగ (7) |
4) మనోహరురాలు; భాగ్యవంతురాలు (3) |
6) ధాన్యవిశేషం, మంచి బియ్యం (5) |
8) జలము వంటి ద్రవరూప వస్తువు (5) |
10) తొమ్మిదితో మొదలయ్యే గృహవిశేషము (5) |
13) గొప్పతనము, మహత్వము, మాహాత్మ్యము (3) |
14) పెద్ద విసరు కర్ర, Fan (2) |
15) ముల్లు (2) |
16) నూరు; వంద (2) |
17) గండుకోయిల (3) |
19) గర్భము, సంతతి, పొట్ట, బిడ్డ (3) |
23) వాచ్యార్థమును తెలిపెడు శబ్దము, భాషకు సంబంధించిన పాఠ్య పుస్తకము (3) |
24) సుగ్రీవుని భార్య, ఉప్పు గని (2) |
26) తామర, ఒక నిధి (3) |
27) ఎనిమిది గ్రాముల బంగారం (5) |
29) ప్రధానము, శ్రేష్ఠము, (3) |
30) పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు (6) |
నిలువు:
1) దీపమును వెలిగించి భగవంతుని పూజించుట (5) |
2) వనరుహము 1, 3 2 (3) |
3) బమ్మెర పోతన గారి భాగవత గ్రంథంలోని కరిమకరుల కలహానికి చెందిన ఘట్టము (6) |
4) అర్జునుడి భార్య, శ్రీకృష్ణుని చెల్లెలు (3) |
5) ఏనుగు; మూడు అడుగులు (3) |
7) ములక్కాడ, చారులోను సాంబారులోను వేసుకునే కూరగాయ (5) |
9) వ్యవహారంలో హితుడా? కాదు, దూరమున వున్నవాడు (5) |
11) కొయ్య మొదలగునవి కోసే సాధనం, క్రకచము (2) |
16) ఒక వారము పేరు, ఓ ప్రసిద్ధ తెలుగు రచయిత ఈ వారం నాది అన్నారు (5) |
18) బంగారు; లోహము (3) |
20) ఒకానొక నక్షత్రం, విష్ణువు, శివుడు (5) |
21) భూమి కంపించడం, దీని ప్రభావాన్ని రిక్టరు స్కేలుతో కొలుస్తారు (4) |
22) తిరుగు, సంచరించు (4) |
25) మరచిపోము; వాసనగల ఒకానొక చిన్నచెట్టు – చివర లేదు (3) |
27) మచిలీపట్నము మరో పేరులో మధ్య అక్షరం లేదు (2) |
28) కాశీనాధుని విశ్వనాథ్ 1, 4 (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 నవంబర్ 26వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 142 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 01 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 140 జవాబులు:
అడ్డం:
1) కులపాలిక 4) గోకులాష్టమి 7) రమ 8) తరబియ్యతు 10) గంగ 12) ముత్తలు 14) మితవాది 15) ఇలువేల్పు 16) గీజింద 17) మిట్టిపడు 18) తాతతాత 20) పతాకం 22) వింత 23) లగల్పులయి 24) మోదం 27) డుపంటిక్కంము 28) అష్టకష్టాలు
నిలువు:
1) కుమారస్వామి 2) పాశి 3) కమ్మరము 4) గోర్కొయ్యలు 5) లాభం 6) మిసిగవేల్పు 9) బిత్తరిజింకతాల్పు 11) భవానీపతి 13) కలధౌతము 17) మిత్రవిందుడు 19) తల్లిదండ్రులు 20) పగడము 21) కంలట్టాఅ 25) కటి 26) మేక
సంచిక – పద ప్రతిభ 140 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, ఒంగోలు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత
- వనమాల రామలింగాచారి, యాదగిరి గుట్ట
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.